Terrorist groups recruiting youth majorly from foreigns

terrorist groups, terrorist recruitment, isis recruitment, isis latest news, terrorist attacks in india, terrorist recruits indians, latest recruitment notifications, government job recruitment, it and bpo job recruitment, uno latest news, united nations on terrorism, world latest news

terrorist groups recruiting youth majorly from foreigns : The report by a panel of experts monitoring al-Qaida and the Taliban, says that terror groups recruiting large number of youth from foreigns with attractive offers

ఉగ్రవాద సంస్థల్లో భారీ రిక్రూట్ మెంట్

Posted: 11/01/2014 02:00 PM IST
Terrorist groups recruiting youth majorly from foreigns

ప్రపంచానికే సవాల్ గా మారిన ఉగ్రవాదులు తమ సత్తా చాటేందుకు కొత్త ఎత్తులు వేస్తున్నారు. కత్తుల్లాంటి అనుచరులను తయారు చేసేందుకు భారీగా రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నారు. ఉగ్రవాదం, మతం పేరుతో జరిగే ప్రచారం పట్ల ఆకర్షితులయ్యే యువతతో పాటు కుటుంబ పరిస్థితులు, సమాజంపై కసి, కోపం ఉన్న వారిని టార్గెట్ చేసి రిక్రూట్ మెంట్ నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్యసమితికి తాజాగా అందిన నివేదిక ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. గత కొంతకాలంగా ఉగ్రవాద సంస్థల్లో చేరుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఐ.రా.స. గుర్తించింది.

ఆల్ ఖైదా, ఇస్లామిక్ స్టేట్, తాలిబన్ వంటి ఉగ్రవాద సంస్థల కదలికలపై నిఘా ఉంచగా..., వారు చేపడుతున్న నియామకాల గురించి కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో ప్రధానంగా ఏజంట్ల ద్వారా విదేశాల నుంచి నియామకాలు జరుపుతున్నారు. ఇక విస్తరించిన సోషల్ మీడియా కూడా ఉగ్రవాదులకు కలిసి వచ్చే అంశం. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇతర సోషల్ మీడియా సైట్ల ద్వారా.., ఉగ్రవాదులు యువతకు గాలం వేసి వారిని మతోన్మాదంలోకి లాగుతున్నారు. నేరుగా సంభాషణలు జరిపి సంస్థల్లోకి చేర్చుకుంటున్నారు. ఇస్లామిక్ స్టేట్ జరిపే రిక్రూట్ మెంట్ ఫ్రధానంగా రష్యా, ఫ్రాన్స్, యు.కే, ఐర్లాండ్ వంటి దేశాలతో పాటు భారత్ నుంచి కూడా నియామకాలు జరుపుతోంది.

వీరంతా నేరుగా వచ్చి ఉగ్రవాద కార్యకలాపాల్లో..., వారితో కలిసి పనిచేయకపోవచ్చు. అయితే సొంత ప్రదేశాల్లో లేదా ఉగ్రవాద సంస్థలు చెప్పిన ప్రదేశాల్లో ఉంటూ వారికి సమాచార సేకరణ, దాడులకు వ్యూహాలు ఇతర పనులు చేసిపెడతాయి. ఇందుకోసం భారీ స్థాయిలో వేతనాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఈ డబ్బుకు ఆకర్షితులయి ఉగ్రవాద సంస్థల్లో చేరుతున్నవారు కొందరు అయితే... మతం పట్ల అమితమైన ప్రేమ ఉన్న మరికొందర్ని టార్గెట్ చేసి వారిని ఉగ్రవాదం వైపు ఆకర్షితుల్ని చేస్తున్నారు. ఉగ్రవాద సంస్థల్లో చేరేవారికి వారి వ్యక్తిగత, సామాజిక పరిస్థితులు కూడా కారణం అవుతున్నాయని సర్వేలో తేలింది.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : terrorists  recruitment  isis  al-qaeda  

Other Articles