Movie theaters ban google glass

google glasses review, google glasses price in india, google glasses features, google glasses latest news, google glasses banned, google glasses technology, latest updates, america movie theaters

Movie theaters ban Google Glass : google launched glasses facing protest from movie theaters management and also from other units because of its cameras and multi functional features

కళ్ళద్దాల వాడకంపై థియేటర్లలో నిషేధం

Posted: 10/31/2014 11:30 PM IST
Movie theaters ban google glass

ప్రపంచంలో ఇంటర్నెట్ సంచలనాలకు వేదికగా నిలిచిన గూగుల్ పలు విమర్శలకు కూడా వేదికవుతోంది. ప్రస్తుతం వస్తున్న గూగుల్ గ్లాసెస్ (కళ్ళద్దాలు)పై సినిమా థియేటర్ల యజమానులు నిషేధం విధించారు. అయితే ఇది మన దేశంలో కాదు లెండి అమెరికాలో. ఎక్కడయితే ఏముంది ఈ అద్దాలను అసలు ఎందుకు నిషేధించారు అని ప్రశ్న వస్తే. మందుగా వీటి గురించి మనం తెలుసుకోవాల్సిందే. అత్యాధునిక టెక్నాలజితో తయారు చేసిన ఈ కళ్ళద్దాలను మోషన్ కంట్రోల్, రికార్డింగ్ సహా ప్రస్తుత ఆండ్రాయిడ్ ఫోన్ లో ఉండే అన్నీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

దీంతో సినిమాలకు వెళ్లేవారు థియేటర్ లో ఎంచక్కా రికార్డింగ్ ఆన్ చేసి పెడితే సినిమా మొత్తం రికార్డవుంతుంది. ఎందుకంటే ఇవి 16జీబీ, 32జీబీ ఇలా ఎక్కువ మెమోరి కెపాసిటీతో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే రహస్యంగా కెమెరాలు, సెల్ ఫోన్ల ద్వారా సినిమాలను రికార్డ్ చేసి పైరసీలు చేస్తున్నారు. వీటి వల్ల అన్ని ఫిలిం ఇండస్ర్టీలు భారీగా నష్టపోతున్నాయి. ఇక ఈ గ్లాసెస్ థియేటర్ కు వచ్చాయంటే మరుక్షణం సినిమా ప్రింట్ బ్లాక్ మార్కెట్ లోకి వచ్చేసినట్లే అని థియేటర్ల యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే వీటిని నిషేధించాలని నిర్ణయం తీసుకున్నారు.

ఈ నిర్ణయంపై అనుకూల వ్యతిరేక వాదనలు విన్పిస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజి ఉన్న వీటిని ఉపయోగించి సినిమాలను మరింత క్వాలిటీగా చూడవచ్చని కొందరు చెప్తున్నారు. ఇదే సమయంలో రికార్డు చేయరు అని గ్యారంటి ఏమిటి అని ప్రశ్నలు వస్తున్నాయి. ఇలా ఎవరి వాదనలు వారివి. ఇవన్నీ పక్కనబెడితే ఈ గూగుల్ గ్లాసులకు విపరీతంగా క్రేజ్ వస్తోంది. అన్నీ టెక్నాలజి ఫీచర్లు ఇందులో ఉండటంతో కొనేందుకు యువత తెగ ఆరాటపడుతున్నారు. ఇది మంచి కోసం ఉపయోగిస్తే సరి లేకపోతే ఎన్నో దుష్పరిణామాలకు ఈ గ్లాసెస్ ఖచ్చితంగా కారణం అవుతాయి.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : google glasses  cinema theaters  ban  latest news ?  

Other Articles