Dead heart transplant huge breakthrough

world first, Australian surgeons, success, transplant, dead heart, patients, Sydney, St Vincent's Hospital, still-beating donor, Cardioogists, surgeon

Dead heart transplant 'huge breakthrough'

ఆగిన గుండెను విజయవంతంగా అమర్చిన వైద్యులు

Posted: 10/31/2014 02:03 AM IST
Dead heart transplant huge breakthrough

గుండె మార్పిడి చేసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీకు డోనర్ (దాత) దొరికారా..? లేదా..? ఇంకా అన్వేషిస్తున్నారా..? ఇప్పుడిక అన్వేషణలకు చెక్ పెట్టండి. ఎందుకంటే వైద్య రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పలు, వైద్యుల అధ్యయనాల ఫలితంగా మరణించిన వారి గుండె కూడా మీకు పనికోస్తుంది. నమ్మకంగా లేదు కదూ.. నిజమండీ.. అస్ట్రేటియాలోని సిడ్నీలో ఈ మేరకు జరిపిన పరీక్షలు విజయవంతమయ్యాయి.

చనిపోయిన వారి గుండెను 20 నిమిషాల లోపే వేరొకరికి విజయవంతంగా అమర్చిన సంఘటన ఆస్ట్రేలియాలో జరిగింది. సిడ్నీలో సెయింట్‌ విన్‌సెంట్స్‌, విక్టర్‌ చేంజ్‌ కార్డిక్‌ రీసర్చ్‌ సెంటర్‌ అనే రెండు సంస్థలు కలిపి వినూత్న కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేశాయి. ముగ్గురు వ్యక్తులు గుండె కొట్టుకోవడం ఆగిపోవడంతో చనిపోయారు. వీరి దేహాల నుంచి 20 నిమిషాలలో గుండెలను సేకరించి మరో ముగ్గురు వ్యక్తులకు శస్త్రచికిత్స ద్వారా అమర్చారు. వీరు తయారు చేసిన టెక్నాలజీ ద్వారా గుండె తిరిగి కొట్టుకునేలా చేశారు.

ఆగిన గుండెలు అమర్చకున్న వారిలో ఇద్దరు పూర్తిగా ఆరోగ్యవంతులుగా మారారు. మరొకరిని మాత్రం ఐసీయూలో వైద్యుల పరిశీలనలో ఉన్నారు. ఇప్పటి వరకు కళ్లు, కిడ్నీలు లాంటి వాటినే వేరొకరికి అమర్చడం చూసాం. గుండె మార్పిడి చేయాలంటే బ్రెయిన్‌డెడ్‌ అయి చనిపోయిన వారి కొట్టుకుంటూ ఉన్న గుండెను సేకరించి మాత్రమే వేరొకరికి అమర్చవచ్చు. ప్రస్తుతం వీరు తయారు చేసిన టెక్నాలజీతో ఆగిపోయిన గుండెను కూడా ఇతరులకు అమర్చడం సాధ్యమవుతుందని చేసి చూపించారు. గుండెలను అమర్చుకున్న 57 ఏళ్ల తొలి వ్యక్తి మాట్లాడుతూ ఇంతకు ముందు తాను చాలా జబ్బుపడిన దానిలా వుండేదానినని.. గుండెను అమర్చుకున్న తరువాత చాలా ఉత్సహాంగా, ఉల్లాసంగా కేవలం 40 ఏళ్ల వయస్కురాలులా వున్నానన్నారు. మరో రోగి కూడా తన సంభ్రమాశ్చర్యాన్ని వ్యక్తం చేశాడు. ఈ విథంగా తను మళ్లీ పునరుజ్జీవం పోసుకుంటానని అనుకోలేదని తెలిపారు. అయితే తనకు గుండెను దానం చేసిన అమరుడిని మాత్రం నిత్యం తలచుకుంటానన్నారు. అయనే లేకుంటే తాను ప్రాణాలతో వుండేవాటికి కాదని బాధతప్తహృదయంతో తెలిపాడు. ఇది మార్పిడి విధానం అందరికీ అందుబాటులోకి వస్తే.. ఇక ప్రపంచ వ్యాప్తంగా గుండె జబ్బులతో మరణాలకు స్వస్తి పలకవచ్చునని ఆశిద్దాం.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles