Isis one of richest terror groups earns 1 million a day selling oil

isis, america, canada, militants, Islamic State militants, $1 million, black market, oil sales

ISIS one of richest terror groups, earns $1 million a day selling oil

అత్యంత ధనిక ఉగ్రవాద సంస్థగా అవిర్బవిస్తున్న ఐఎస్ఐఎస్..

Posted: 10/31/2014 01:40 AM IST
Isis one of richest terror groups earns 1 million a day selling oil

ఇరాక్, సిరియా దేశాల్లో భయంకరమైన దాడులకు పాల్పడుతున్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్ధ, ప్రపంచంలోనే అత్యంత ధనిక సంస్ధగా ఆవిర్భవించనుంది. ఈ ఉగ్రవాద సంస్ధ రోజు వారీ ఆదాయం రూ.6 కోట్లతో శరవేగంగా పెరుగుతుండటంతో అగ్రరాజ్యం అమెరికాను కూడా కలవరపెడుతున్నాయి. ఇరాక్, సిరియాల్లో తన స్వాధీనంలోకి తీసుకున్న ప్రాంతాల్లోని చమురు బావుల ద్వారా భారీగా ఆదాయాన్ని ఆర్జిస్తున్న ఐఎస్ఐఎస్, బెదిరింపుల ద్వారాను పెద్ద ఎత్తున కూడగడుతోందని అమెరికా ఆర్థిక శాఖలో ఉగ్రవాదం, ఆర్థిక నిఘా విభాగంలో సహాయ కార్యదర్శిగా పనిచేస్తున్న డేవిడ్ కోహెన్ వ్యాఖ్యానించారు. ఐఎస్ఐఎస్ అక్రమార్జనను తక్కువగా అంచనా వేశామని ఆయన పేర్కొన్నారు. ఇటీవల కాలంలో ఈ సంస్ధ రాకెట్ల దోపిడీ, నేరాలు, బ్యాంకుల్లో దొంగతనాలు వంటి కార్యకలాపాల ద్వారా పెద్ద మొత్తంలో నిధులను సమకూర్చుకుంటుదని అన్నారు. ప్రస్తుతం ప్రపంచ అత్యంత ధనిక ఉగ్రవాద సంస్థగా ఇస్లామిక్ స్టేట్ ఆవిర్భవించిందని..కార్నెగీ ఎండోమెంట్ అంతర్జాతీయ శాంతి కోసం ఏర్పాటు చేసిన సంస్థ ఉపాధ్యక్షుడు మార్వన్ మాషర్ అన్నారు.

కిడ్నాపుల ద్వారా ఐఎస్ఐఎస్‌కు ఈ సంవత్సరం ఆదాయం 122 కోట్లు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కొన్ని టెర్రరిస్ట్ సంస్ధల ద్వారా పెద్ద మొత్తంలో నిధులను రాబట్టడంలో ఐఎస్ఐఎస్ సఫలం కావడంతో అత్యంత ధనిక ఉగ్రవాద సంస్ధగా నిలవనుంది. గతంలో ఒసామా బిన్ లాడెన్ నేతృత్వంలోని అల్ ఖైదా అత్యంత ధనిక ఉగ్రవాద సంస్థగా పేరుగాంచిన సంగతి తెలిసిందే. అయితే, వారిలా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రపంచ నలుమూలల్లో ముఖ్యంగా గల్ఫ్ దేశాలు లేదా ఇతర దేశాలలో వున్న మత చాంధసవాదులు, అల్ ఖైదా శ్రేయోభిలాషుల నుంచి డబ్బును సేకరించడం లేదు.  తాజాగా ఐఎస్ఐఎస్ ఆస్తుల విలువ, అల్ ఖైదా ఆస్తులను మించిపోనుందని సమాచారం. చమురు అమ్మాకాలతో పాటు కొన్ని ప్రభుత్వ ప్రోత్సహక ఉగ్రవాద సంస్థలు కూడా ఇస్లామిక్ స్టేట్ కు సహకరిస్తున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో, ఆ సంస్థను నిలువరించేందుకు దీర్ఘకాలంపాటు సమరం చేయాల్సి ఉందని కూడా కోహెన్ చెప్పారు. రోజు వారీగా వస్తున్న భారీ ధనంతో ఐఎస్ఐఎస్ పెద్ద ఎత్తున ఆయుధాలను సమకూర్చుకుంటోందని తెలుస్తోంది. ఇదే తరహాలో ఆ సంస్థ ఎదిగితే ప్రపంచానికి తీవ్ర ముప్పు తప్పదని కోహెన్ హెచ్చరించారు. అయితే ఇన్నాళ్లు తక్కువగా అంచావా వేసి మోససోయామని, త్వరలోనే ఐస్లామిక్ స్టేట్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటామని కొహెన్ చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : isis  america  canada  militants  Islamic State militants  $1 million  black market  oil sales  

Other Articles