High court ordered to pay fifty thousand rupees fine to students mother for teacher beaten a student

chennai news, high court fine chennai teacher, teacher meherunnisa, chennai kesari higher secondary school, student mother high court petition on school, chennai latest news, chennai high court

high court ordered to pay fifty thousand rupees fine to students mother for teacher beaten a student

ఆశ్చర్యం : విద్యార్థి బుగ్గ గిల్లిందని టీచర్ కు భారీ జరమానా!

Posted: 10/30/2014 08:22 PM IST
High court ordered to pay fifty thousand rupees fine to students mother for teacher beaten a student

మన భారతదేశంలో అప్పుడప్పుడు కొన్ని వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. ఆ తరహాలోనే చెన్నైలో ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. స్కూల్ లో వున్న విద్యార్థి అల్లరి చేస్తే.. అతనిని దండించే క్రమంలో కేవలం గిల్లిందని ఆ టీచర్ కు భారీ జరిమానే పడింది. సహజంగానే స్కూల్ లో విద్యార్థులు అల్లరి చేస్తే టీచర్లు దండించడం సహజం. కానీ ఇక్కడ కేవలం గిల్లిందని ఏకంగా జరిమానా విధించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

వివరాల్లోకి వెళితే.. 2012లో కేసరి హయ్యర్ సెకండరీ పాఠశాలలో ఓ విద్యార్థి అల్లరి చేస్తే.. అతనిని దండించే క్రమంలో టీచర్ మెహరున్నీసా అతని బుగ్గ గిల్లింది. అంతే! ఈ విషయం తెలుసుకున్న ఆ విద్యార్థి తల్లి ఆగ్రహంతో జరిగిన ఘటనను స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ దృష్టికి తీసుకెళ్ళింది. అప్పటినుంచి దీనిపై విచారణ జరిపిన కమిషన్.. 2013లో నిబంధనలు అతిక్రమించిందంటూ పాఠశాలకు రూ.1000 జరిమానా విధించింది. అదే సమయంలో విద్యార్థి తల్లి తమ బిడ్డ టీసీ (ట్రాన్స్ ఫర్ సర్టిఫికెట్) కూడా ఇవ్వాల్సిందిగా కోరింది. కానీ బాలుడికి టీసీ ఇవ్వడంలో ఆ పాఠశాల యాజమాన్యం జాప్యం చేసింది.

అయితే జరిగిన ఘటనలో తనకు సరైన న్యాయం జరగలేదన్న ఆవేదనతోపాటు స్కూలు యాజమాన్యం టీసీ ఇవ్వడంలో జాప్యం చేసిందని విద్యార్థి తల్లి తీవ్ర ఆగ్రహానికి గురైంది. దీంతో ఆమె ఏకంగా హైకోర్టు మెట్లు ఎక్కింది. అంతేకాదు.. సైదాపేట మేజిస్ట్రేట్ న్యాయస్థానంలోనూ ఆమె ప్రైవేట్ కేసు దాఖలు చేసింది. మరోవైపు తనను పలువిధాలుగా వేధిస్తున్నారంటూ టీచర్ మెహరున్నీసా కూడా హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు... ఈ కేసు కింది కోర్టులో పెండింగ్ లో ఉందని, అక్కడకు వెళ్ళాలని సూచించింది. అయితే విద్యార్థి తల్లి చేసిన ఆరోపణలన్నింటిపైనా రూ.50000 జరిమానాగా చెల్లించాలని తెలిపింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles