Woman actress harassed 100 times in 10 hours in new york goes viral

Harassment, New York, Video, YouTube, manhattan, Newyork, America, actress, Woman, 100 times, 10 hours, viral

Woman actress harassed 100 times in 10 hours in new york goes viral

10 గంటల్లో నటిని వేధించిన 100 మంది యువకులు

Posted: 10/30/2014 07:26 PM IST
Woman actress harassed 100 times in 10 hours in new york goes viral

అందమైన అమ్మాయి కనబడితే మన దేశంలోనే నయం.. అమ్మాయిని చూసి చూడనట్లు వదిలేస్తుంటారు కుర్రాళ్లు. అదే అమెరికాలోని న్యూయార్క్లో అయితే అమ్మాయి వెంటపడి మరీ.. వేదిస్తుంటారు. నమ్మశక్యంగా లేదా..? కావాలంటే.. కింద చూయించే వీడియోలు చూడండి. పేరుకు అగ్రరాజ్యం, అభివృద్ది చెందిన రాజ్యంగా పేరొందితే తప్ప.. అక్కడా అమ్మాయిలకు పోకిరీల నుంచి రక్షణ కరువైంది. న్యూయార్క్ వీధుల్లో ఓ నటికి పది గంటల్లో ఎదురైన అనుభవమే ఇందుకు నిదర్శనంగా నిలుస్తుంది.

న్యూయార్క వీధుల్లో మహిళలపై వేధింపుల నేపథ్యంతో తీసిన వీడియో ఇంటర్నెట్ లో దూమారం లేపుతోంది. రెండు నిమిషాల వ్యవధి ఉన్న ఈ వీడియో ఘటన అమెరికా మీడియాలో పెద్ద చర్చకు దారి తీయడమే కాకుండా మైనారీటీలు, మహిళ సంఘాలు నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతోంది.  
 
జీన్స్, టీషర్టు ధరించి మాన్ హట్టన్ వీధుల్లో పది గంటల పాటు నడిచి వెళ్తున్న నటి  శోషానా బి. రాబర్ట్స్ వీడియోను హోలాబ్యాక్ ఛారిటీ కోసం షూట్ చేశారు. ఈ వీడియోలో కొంత మంది యువకులు శోషానాను 'హే బేబీ', హే, బ్యూటిఫుల్ అంటూ వేధించడం లాంటివి షూట్ చేశారు.

 

పదిగంటల్లో సుమారు 100 మంది యువకుల రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించినా శోషానా పెద్దగా స్పందించకుండా నవ్వుతో మందలించడం లాంటి సన్నివేశాలు వీడియోలో కనిపిస్తాయి. మంగళవారం యూట్యూబ్ లో అప్ లోడ్ చేసిన వీడియోను 9.8 లక్షల మంది చూడటం విశేషం. వీడియో చూసిన కొంతమంది ఆన్ లైన్ లో తనపై బెదిరింపులకు పాల్పడినట్టు శోషానా ఫిర్యాదు చేశారు.

 

ఈ మెయిల్స్ లో కొంత మంది ప్రశంసించగా, మరికొంత మంది చంపుతామని బెదిరించారు. ఈ బెదిరింపుల కారణంగా తాను అభద్రతాభావానికి లోనవుతున్నానని.. ఈ సంఘటనల్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్తానని  శోషానా వెల్లడించింది. స్వలింగ సంపర్కులు, నల్లజాతివారి నుంచి ఎక్కువగా వేధింపులకు గురయ్యానని శోషానా బి. రాబర్ట్స్ తెలిపింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Harassment  New York  Video  YouTube  manhattan  Newyork  America  actress  Woman  100 times  10 hours  viral  

Other Articles