4000 years old cd rom cracked details found a prayer to mother

4000 years old cd rom, old cd rom, old cd models, latest technology in dvd, cd dvd playing technology, latest news, Phaistos Disk, unique signs

4000 years old cd rom cracked details found a prayer to mother : Experts have been trying to read the pictorial signs of the mysterious disk. the 4000 years old cd rom contains of a prayer to mother

4000 ఏళ్ళ క్రితపు సీడి.. అందులో అమ్మ పాట

Posted: 10/31/2014 07:05 AM IST
4000 years old cd rom cracked details found a prayer to mother

టెక్నాలజి రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. అయితే ఇవన్నీ మన పూర్వికులు కొన్ని వందల సంవత్సరాల క్రితమే తయారు చేశారని.. ప్రస్తుత ఆవిష్కరణలకు ప్రాణం పోశారని ఎన్నో సంఘటనలు నిరూపించాయి. తాజాగా ప్రస్తుతం మనం వినియోగిస్తున్న సీడీలను కూడా వేల సంవత్సరాల క్రితమే మనుషులు ఉపయోగించారు. పూర్వం 4వేల సంవత్సరాల క్రితం రూపొందించి, ఉపయోగించిన ఓ సీడిని ఈ మద్య నిపుణులు డీకోడ్ చేశారు. ఇందులో ఉన్న సమాచారం ఏమిటో కనుగొన్నారు.

అతి పురాతనమైన ఈ డిస్క్ లో తల్లికి చేసే ఓ ప్రార్దన ఉన్నట్లుగా గుర్తించారు. అతిమెత్తని మట్టితో ఈ సీడీని తయారుచేశారు. అయితే ఈ సీడీలో వాయిస్ (గొంతు) ఏమి లేదు. కేవలం నాటి కాలంలో వాడుకలో ఉన్న భాష, సంకేతాలు (సంజ్ఞలు) ద్వారా సమాచారాన్ని పొందుపర్చారు దీన్నీ అచ్చులుగా ముద్రించారు అని చెప్పవచ్చు. గ్రీకులోని పురాతన క్రేట్ ద్వీపంలో లభ్యమైన ఈ సీడీని కనుగొన్న శాస్ర్తవేత్తలు, నిపుణులు దీనిలోని సమాచారం ఏమిటో తెలుసుకునేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. అనేక గ్రీకు భాషావేత్తలు, ఇతర ప్రముఖులను కలిసి ఇందులోని సంకేతాలకు అర్ధాలను కనుగొన్నారు. అన్నిటిని కలిపి పరిశోధించి.. చివరకు ఈ సీడీలో ముద్రించినది.., అమ్మ గురించి చేసే ఓ ప్రార్ధన అని తేల్చారు.

15 సెంటీమీటర్ల పొడవున్న ఈ సీడీ లో గజిబిజీగా ఉన్న అనేక సంకేతాలు ఉన్నాయి. ఇది క్రీస్తు పూర్వం కాలంనాటి.., మధ్య యుగంకు చెందినదిగా గుర్తించారు. ఇందులో మొత్తం 241 సంకేతాలు (బొమ్మలు) ఉన్నాయి. టెక్నలాజికల్ ఎడ్యుకేషన్ ఇన్ స్టిట్యూట్ కు చెందిన డాక్టర్ గారెట్ ఈ సీడీనీ డీకోడ్ చేయటంలో కీలక పాత్ర పోషించాడు. అనేక పరిశోధనల తర్వాత ఇందులో అమ్మ గురించి పాట ఉందని ప్రకటించారు.

 

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : old cd rom  technology  unique signs  latest news  

Other Articles