Al qaeda s next target is american oil tankers

al qaeda india branch, al qaeda attacks, al qaeda osama bin laden, al qaeda activities, al qaeda on america, al qaeda next targets, terrorist attacks in india, world latest news, america news, al jawahari, america oil tankers

Al Qaeda's next target is American oil tankers : latest information that world terrorist organisations al qaeda targetted again america, now terrorist organisation targets america oil tankers

అమెరికాలో ఆల్ ఖైదా తర్వాతి టార్గెట్ ఇదే

Posted: 10/30/2014 10:10 PM IST
Al qaeda s next target is american oil tankers

సెప్టెంబర్ 11 దాడులతో అమెరికాను వణికించిన ఆల్ ఖైదా మరోసారి ఆ దేశంపై దాడికి సిద్దం అవుతోంది. గతంలో విమానాలను హైజాక్ చేసి ట్విన్ టవర్స్ కూల్చేయగా.., ఇప్పుడు అమెరికా ఆయిల్ ట్యాంకర్లను ఆల్ ఖైదా టార్గెట్ చేసింది. ఈ విషయాన్ని ఓ ఆంగ్ల మ్యాగజైన్ వెల్లడించింది. అమెరికాకు ఇంధనం సరఫరా, మార్గాలు, వినియోగం ఇతరత్రా అవసరమైన సమాచారం అంతా ఈ ఉగ్రవాద సంస్థ చేతిలో ఉన్నట్లు మ్యాగజైన్ తెలిపింది. పక్కా వ్యూహంతో దాడులు చేసేందుకు ఆల్ ఖైదా సిద్దం అవుతోందని తెలుస్తోంది.

అమెరికా సైన్యం తమపై చేస్తున్న దాడులకు సమాధానంగా అగ్రరాజ్యంపై దాడి చేయాలని ఉగ్రవాద సంస్థ భావిస్తోంది. ఇందుకు ఆయిల్ ట్యాంకర్లను ఎంచుకుంది. ట్యాంకర్లు అంటే మనం నిత్యం రోడ్లపై చూసే చిన్నపాటి ట్యాంకర్లు కాదు లెండి. వివిధ దేశాల నుంచి అమెరికాకు ఉన్న ఆయిల్ పైప్ లైన్లు, వివిధ మార్గాల ద్వారా వస్తున్న ఇందన మార్గాలను ధ్వంసం చేయటం. దీనికి కారణం ఏమిటంటే.. అమెరికాలో ఇంధన వనరులు లేవు. ఇందుకోసం ఇతర దేశాలపై ఆధారపడక తప్పదు. ప్రధానంగా ఇరాక్, సౌదీ వంటి ముస్లిం ప్రభావిత దేశాలపైనే ఆధారపడుతుంది. కాబట్టి వీటిని ద్వంసం చేస్తే.., అమెరికాలో ఇంధన సంక్షోభం ఏర్పడి దేశ ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంతేకాకుండా మిలటరీకి కూడా తమపై దాడులు చేసేందుకు ఇంధనం ఉండదు అని ఆల్ ఖైదా ప్లాన్.

ఈ ప్లాన్ వినటానికి చాలా సింపుల్ గా ఉన్నా.. అమలు చేయటం మాత్రం చాలా కష్టం. ఎందుకంటే అమెరికాకు వచ్చే పైపులైన్లు, సూపర్ ట్యాంకర్ల మార్గంలో పటిష్ట భద్రత ఉంటుంది. దీన్ని దాటుకుని ఆల్ ఖైదా వచ్చి దాడులు చేయటం అంటే అది అసాధ్యం అని చెప్పాలి. అందుకే ఇతర ఉగ్రవాద సంస్థల సాయం తీసుకుంటోంది. ఇరాక్, సిరియాలో ప్రస్తుతం పెత్తనం చెలాయిస్తున్న ఇస్లామిక్ స్టేట్ (ఐ.ఎస్.ఐ.ఎస్) ఉగ్రవాద సంస్థ అగ్రరాజ్యానికి వ్యతిరేకి. ఇదే సమయంలో ఈ సంస్థ ఆధీనంలో పలు చోట్ల పెట్రోల్ బావులు ఉన్నాయి. ఇలా ఇతర ఉగ్రవాద సంస్థల సాయంతో అమెరికా ఇంధన వ్యవస్థను చిన్నాభిన్నం చేసేందుకు ఆల్ ఖైదా సిద్దం అవుతోందని మ్యాగజైన్ కథనం.

లాడెన్ మరణం తర్వాత ఈ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలు తగ్గాయి అని అంతా భావించారు. కానీ చాపకింద నీరులా నెట్ వర్క్ విస్తరణ, ఆయుధాల సేకరణ, దాడులకు కొత్త పధక రచనల్లో సంస్థ ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : al qaeda  oil tanker  america  latest news  

Other Articles