Sheila dikshit praises modi vision questions her resign

sheila dikshit on modi, sheila dikshit praises modi, sheila dikshit kerala, sheila dikshit scam, sheila dikshit commen wealth games scam, sheila dikshit son, sheila dikshit post in congress, nda government programmes, narendra modi promises to public, latest news

sheila dikshit praises modi vision questions her resign : former kerala governor sheila dikshit praised narendra modi by she saw a confident man with vision and a new language. sheila explains about her governor post resign and situations manipulated on her ot a media house

ప్రధాని మోడిపై షీలా మనస్సులో మాటలివి

Posted: 10/30/2014 02:59 PM IST
Sheila dikshit praises modi vision questions her resign

ప్రధాని నరేంద్రమోడి కాంగ్రెస్ నేతలకు సింహస్వప్నం లాంటి వ్యక్తి. స్వాతంత్ర్యానికి పూర్వం నుంచి ఉన్న పార్టీని.., పార్లమెంటులో పత్తా లేకుండా చేసిన సమర్ధుడు మోడి. నూట పాతికేళ్లకు పైగా చరిత్ర ఉన్న పార్టిని ఇలా చిత్తుచేసిన వ్యక్తిని చూస్తే ఎవరికైనా కోపం వస్తుంది. కసి తీర్చుకోవాలన్పిస్తుంది. కాని వాస్తవికంగా, నాయకత్వ కోణంలో ఆలోచించే వారికి మాత్రం అవతలి వ్యక్తి గెలుపుకు కారణాలు, వారి గొప్పతనం కన్పిస్తుంది. కేరళ మాజి గవర్నర్, ఢిల్లీ మాజి ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కు కూడా ఇదే అన్పించింది. తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్య్వూలో షీలా మనసులో భావాలను బయటకు చెప్పింది.

ఎన్డీఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గవర్నర్లుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నేతల స్థానాల్లో కొత్త వారిని పెడతామని కేంద్రం ప్రకటించింది. ఈ క్రమంలోనే కేరళ గవర్నర్ గా ఉన్న షీలా కూడా అనేక పరిణామాల మద్య రాజీనామా చేసింది. అయితే తన రాజీనామాకు ముందుగా మోడిని కలిసిన సందర్బంగా.. ఆయనలో ఓ పూర్తిగా దూరదృష్టి కలిగి ధృడ విశ్వాసంతో ఉన్న వ్యక్తిని, కొత్త బాష్యం చెప్తున్న శక్తిని చూస్తన్నట్లు అన్పించిందని తెలిపింది. ఇక మోడిని చూసి కాంగ్రెస్ కొత్త విషయాలు నేర్చుకోవాలన్న అంశంపై స్పందిస్తూ, మోడి మెథడాలజీ ఫాలో కావడమా లేదా ఆయనలా వ్యవహరించటమా అనేది తెలియదు కానీ.. మార్పు మాత్రం కావాలి ఇందుకు సమయం కూడా రావాలి అని పేర్కొంది. అయితే మోడి ఎలా హామీలను అమలు చేస్తాడు అనేది చూడాలి. ఆయన చెప్పినవన్నీ ఆచరణ సాధ్యం అని సందేహాలు మనస్సులో ఉన్నాయని తెలిపింది.

ఇక తన రాజీనామాకు సంబంధించి జరిగిన విషయాలను షీలా దీక్షిత్ వివరించింది. ‘మిగతా గవర్నర్లకు మాదిరే నాకు కూడా హోంశాఖ నుంచి పిలుపు వచ్చింది. పదవి నుంచి వైదలగాలి అని కోరటం జరిగింది. ఈ సంద్బంగా వారికి రెండు విషయాలు చెప్పాను. అందులో ఒకటి తమది రాజ్యాంగ బద్ద పదవి, రెండవది గౌరవప్రదమైన హోదా. వీటిని దృష్టిలో పెట్టుకుని వ్యవహరించాలని అని చెప్పాను. అంతేకాకుండా మరోసారి నన్ను పిలవకండి అని చెప్పాను. అయితే ఆయన నా మాట వినలేదు. ఇక ఆ తర్వాత హోంమంత్రి రాజ్ నాధ్ ను కలిశాను. స్పందించేందుకు 10-12 రోజులు సమయం ఇవ్వాలని కోరాను. అంతేకాకుండా ఈ పదవి కోసం మేము దరఖాస్తు చేసుకోలేదు. వాటికి తాము ఎంపిక చేయబడ్డాము అని స్పస్టం చేశాను. ఇలా తన గవర్నర్ పదవి రాజీనామా పరిణామాలు, మోడి ప్రభుత్వం, కాంగ్రెస్ గురించి షీలా అనేక ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sheila dikshit  narendra modi  nda government  governor  

Other Articles