100 she teams to curb eve teasing in hyderabad

Eve teasing, 'She' Teams, police commissioner M. Mahender Reddy, Women's Safety 100 she Teams, parks, education centers, malls, railway stations, tourist places

100 she teams to curb eve teasing In Hyderabad, teams will be in civil dress says Hyderabad commissioner mahender reddy

అబ్బాయిలూ..జగ్రత్తా.. అమ్మాయిలకు అండగా ‘షీ’ చెక్

Posted: 10/25/2014 04:25 PM IST
100 she teams to curb eve teasing in hyderabad

తెలంగాణలో అందులోనూ హైదరాబాద్‌లో మీ అమ్మాయి చదువకోడానికి వస్తుందా..? అయితే అమ్మాయి ఒంటరిగా రావడంతో మీరు కలవర పుడుతున్నారా..? డోంట్ వర్రీ.. అంటున్నారు పోలీసులు మీ అమ్మాయనే కాదు.. అమ్మాయిలకు, మహిళలకు ఎక్కడ ఎలాంటి పోకిరీలు ఎదురైనా వారి భరతం పట్టేందుకు నగరంలో కొత్తగా షీ టీమ్ లను ప్రవేశపెట్టారు పోలీసులు. సాధారణమైన డ్రెసింగ్ తో వుంటూను కెమెరా, రికార్డర్ తదితరాలను పెట్టుకుని పోకిరీలు చేసే వెకిలిచేష్టలను ముందుగా కొంచెంద ఆధారం కోసం రికార్డు చేసిన తరువాత రంగంలోకి దిగి తమ పద్దతిలో మందలిస్తాయి ఈ షీ టీమ్ లు.

మహిళల భద్రత కోసమే ఈ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, వారికి ఎక్కడ ఎలాంటి ఆపద వచ్చిన స్పందిస్తాయని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి తెలిపారు. మహిళల భద్రతకు ఈ ప్రత్యేక బృందాలు పనిచేస్తాయని చెప్పారు. ఐదుగురు పోలీసులు (పురుషులు, మహిళలు) ఉండే విధంగా 100 షీ బృందాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

విద్యాసంస్థలు, బస్సు, రైల్వే స్టేషన్‌లు, షాపింగ్ మాల్స్, విహార యాత్ర స్థలాల వద్ద ఈవ్‌టీజింగ్‌కు పాల్పడేవారిని అదుపులోకి తీసుకోడానికి, మహిళల భద్రతకు ఇవి పనిచేస్తాయన్నారు. షీ బృందాలలోని పోలీసులు సాధారణ దుస్తుల్లో ఉంటారని, వారి వద్ద వీడియో రికార్డింగ్ కెమెరాలు కూడా ఉంటాయని తెలిపారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడేవారిని ఈ బృందాలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుని నగర సీసీఎస్‌కు తరలిస్తాయని చెప్పారు. ఆకతాయిలకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు కేసులు నమోదు చేసి జైలుకు పంపుతాయన్నారు.

ఫిర్యాదుకు మహిళలు ధైర్యంగా ముందుకురావాలి: స్వాతి లక్రా

ఈవ్‌టీజింగ్‌కు పాల్పడేవారిపై మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని క్రైమ్ అదనపు పోలీసు కమిషనర్ స్వాతిలక్రా సూచించారు. 100 నంబర్‌కు ఫోన్ చేస్తే పది నిమిషాల్లో పోలీసులు సంఘటన స్థలానికి వస్తారన్నారు. ఫిర్యాదు చేసే బాధితుల వివరాలు గోప్యంగా ఉంచుతామని చెప్పారు. షీ బృందాలకు ప్రత్యేకంగా శిక్షణ కూడా ఇచ్చామన్నారు. నిందితులకు శిక్షలు పడే విధంగా కోర్టుకు చార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles