Srisailam power production issue may come end soon

srisailam power issue, srisailam power production issue, telangana government on srisailam power issue, andhrapradesh on srisailam power production, telangana and andhrapradesh war, telugu latest news, krishna river management board

srisailam power production issue may come end soon : war cause between telangana and andhrapradesh will end soon with krishna water board intervention in the issue. krishna board chariman tells andhrpradesh chief minister that telangana government stops power production in srisailam

విద్యుత్ వివాదం కొలిక్కి...

Posted: 10/24/2014 07:04 PM IST
Srisailam power production issue may come end soon

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల మద్య గత కొద్దిరోజులుగా వివాదాస్పద అంశంగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది.. కృష్ణా నది బోర్డు జోక్యంతో ఈ వివాదం పరిష్కారం అయ్యింది. శుక్రవారం సాయంత్రం చంద్రబాబుతో జరిగిన సమావేశం సందర్బంగా తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసింది అని బోర్డు చైర్మన్ ప్రకటించారు. అంతేకాకుండా ఈ వివాదంపై ఇరు రాష్ర్టాలతో త్వరలో చర్చించి సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు.

శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తిపై గత వారం రోజులుగా రెండు రాష్ర్టాల మద్య వివాదం కొనసాగుతోంది. రాష్ర్ట అవసరాలు, కొరతలు తీర్చుకునేందుకు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి చేస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. తమకు ఉన్న కొరతను తీర్చుకుని, పరిశ్రమలకు కరెంటు ఇవ్వాలంటే ఉత్పత్తి తప్పనిసరి అని స్పష్టం చేస్తోంది. ఇప్పుడు తమకు పంటల కంటే కరెంటు ముఖ్యమని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై ఏపీ నేతలతో ఢీ: అంటే ఢీ: అనే విధంగా ప్రత్యేక రాష్ర్ట నేతలు వ్యవహరించారు. విభజన కేటాయింపుల లెక్కల ప్రకారం తమకు ఏపీ నుంచి రావాల్సిన విద్యుత్ అందకపోవటం వల్లే రాష్ర్టంలో కోతలు విధిస్తున్నామనీ..., వీటిని అధిగమించేందుకు తమకు అనుమతి ఉన్న మేరకు విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటున్నామని చెప్పారు.

దీనికి తోడు ఏపీ వాదనకు తలొగ్గి నీటిని విడుదల చేస్తే తెలంగాణలో విద్యుత్ సమస్య రావటంతో పాటు.., పులిచింతల పరిధిలోని గ్రామాలు ముంపుకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. కాబట్టి నీటిని విడుదల చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఇప్పటికే పరిమితికి మంచి నీటిని వాడుకుందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపించింది. అటు ఏపీ పరిధిలోని పవర్ ప్లాంట్లలో కరెంటును తెలంగాణకు ఇవ్వొద్దనే ఉద్దేశ్యంతో కావాలనే ఉత్పత్తి తగ్గించారని ఆరోపించింది.

అటు ఈ వివాదంపై ఆంధ్రప్రదేశ్ కూడా బెట్టు వీడలేదు. తెలంగాణ ప్రభుత్వం మొండిగా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. ఏపీలో పంటలకు నీరు అందాలని కోరుతుంటే.., పంతాలకు పోయి కరెంటు ఉత్పత్తి చేస్తున్నారని విమర్శించారు. చేతిలో అధికారం పెట్టుకుని పవర్ తెచ్చుకోలేక ఏపీపై విమర్శలు చేస్తున్నారని నేరుగా చంద్రబాబు నాయుడు సైతం విమర్శించారు. విభజన కేటాయింపుల ప్రకారం విద్యుత్ ఇచ్చేందుకు ఏపీకి అభ్యంతరం లేదనీ... కానీ భవిష్యత్ లో చేప్టటే ప్రాజెక్టుల్లో కూడా వాటా అడిగితే ఎలా ఒప్పుకుంటారు అని ప్రశ్నించారు. ప్రతి విషయాన్ని వివాదం చేయకుండా పరస్పరం సహకరించుకోవాలని బాబు విజ్ఞప్తి చేశారు.

చివరకు ఈ వివాదం కేంద్రానికి చేరింది. సమస్యపై ప్రధానికి చంద్రబాబు ఫిర్యాదు చేశారు. మరోవైపు జోక్యం చేసుకోవాలని ఏపీ నేతలు కృష్ణా రివర్ బోర్డు యాజమాన్యాన్ని కోరారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసింది అని బోర్డు చైర్మన్ ప్రకటించారు. ఈ పరిణామాలు చూస్తుంటే త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుంది అన్పిస్తుంది. అయితే ఇన్నిరోజులుగా విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తాం అని ప్రకటించిన తెలంగాణ సర్కారు ఇప్పుడు ఉన్నట్లుండి ఉత్పత్తి ఎందుకు ఆపేసింది...? ఈ ప్రశ్నకు సరైన సమాధానం చెప్పేందుకు నేతలు అంతగా ఆసక్తి చూపటం లేదు. ఇప్పటికే తీవ్ర విద్యుత్ సంక్షోభంలో కూరుకుపోయిన తెలంగాణకు విద్యుత్ ఎక్కడి నుంచి అందిస్తారన్న అంశంపై ప్రభుత్వం పునరాలోచన చేసిన తరువాతే విద్యుత్ నిలిపేసిందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srisailam  krishna borad  telangana  andhrapradesh  

Other Articles