Dangers of sexting what teens need to know

Danger, Sexting, awareness, blackmail, teenage, exploit, messages, mails, sms, mms, photos, explicit picture

Dangers of Sexting: What Teens Need to Know

కౌమారం.. చాలా పథిలం.. చేజారిందో జీవితమే నరకం..

Posted: 10/24/2014 05:45 PM IST
Dangers of sexting what teens need to know

కౌమార దశ అదే టీనేజ్.. ది డేజంరస్ ఏజ్.. ఈ వయస్సులోనే పిల్లలను అదుపాజ్ఞల్లో వుంచుకుని సన్మారంగంలో నడిచేలా ప్రతీ తల్లితండ్రి చర్యలు తీసుకోవాలి. పిల్లవాడు మంచివాడా..? చెడ్డవాడా..? అన్నది ఇక్కడే తేలిపోనుంది. ఈ వయస్సులో పిల్లలు పెడదారి పడితే ఇక వారిని సన్మార్గంలో పెట్టడం భగీరథ ప్రయత్నమే చేయాల్సి వుంటుంది. అన్ని తెలుసుకోవాలన్న అత్రుత.. ఎదుటివారిలాగే తనకు అన్ని వుండాలని తొందర, అప్పడప్పుడే తెరమీదకు వచ్చిన ప్రెస్టేజ్ తో బాయ్ ఫ్రెండ్స్, గాళ్ ఫ్రెండ్స్ కావాలని, వారితో అన్ని రకాలుగా చనువుగా వుండాలన్న ఆశ ఈ వయస్సు వారికి అధికం. అందుకే తెలిసి తెలియని ఈ ప్రాయంలోనే పిల్లలు అధికంగా పాడువుతుంటారు. అక్కర్లేని ఆర్బాటాలకు పోయి.. తెలిసీ తెలియని తప్పులకు జీవితకాలం శిక్షను వేసుకుంటున్నారు.

సంక్లిష్టమైన హై స్కూలు చదువులు దాటి కాలేజీల్లో ప్రవేశించిన వెంటనే వీరికి ముచ్చటగెలిసే సెల్ ఫోన్లు జేబుల్లోకి లేదా చేతుల్లోకి రావాల్సిందే. నేటి జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోనడానికి వారు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక విప్లవాన్ని, అందిపుచ్చుకోవాల్సిందే. అయితే ఇది నిజంగా మంచికే ఉపయోగపడితే తప్పులేదు కానీ.. అలా కాకుండా చెడుకు ఉపయోగపడితే.. దాని పరిణామాలు ఎలా వుంటాయోనన్న భయాందోళన తల్లిదండ్రులది. లింగ వ్యతిరేకులతో నన్నిహిత్యం, వారితో చనుపు వెట్టుకోవడం కూడా ఈ కౌమర దశ లక్షణాలే.. అందుకే పూర్వం కౌమార దశ వచ్చిందంటే చాలు వివాహాలు చేసేవారు.

స్మార్ట్‌ ఫోన్‌తో గంటల తరబడి గడుపుతు.. అంతంతసేపు వాటితో పిల్లలు ఏం చేస్తున్నారో తెలియక తల్లిదండ్రులు దోళనకు గురవుతుంటారు. అయితే ఏవరితో మాట్లాడుతున్నావు అని అడగగానే మా ఫ్రెండ్ అంటూ చటుకున్నవారిచ్చే సమాధానం పెద్దల నోరు కట్టేస్తుంది. అసభ్యకర సందేశాలు పెట్టడం, లైంగికంగా వేధించడం, అశ్లీల బొమ్మలు పంపడం వంటివేమైనా చేస్తున్నారా అన్న విషయాన్ని కూడా తల్లిదండ్రులలో ఆందోళన రేపుతుంది. ఎందుకంటే.. ఏ చిన్న తప్పు చేసినా సభ్య సమాజంలో జీవితాంతం వారు దోషులుగా నిలబడాల్సి వస్తుందనే వేదన.

 దాదాపు 40 మిలియన్ల మంది పిల్లలకు స్మార్ట్‌ ఫోను అందుబాటులో ఉంటే వీరిలో చాలామంది సోషల్‌ మీడియాను నిత్యం బ్రౌజ్‌ చేసున్నట్టు తెలుస్తోంది. 10 మిలియన్ల మంది పిల్లలకి వారి తోటి వయసు పిల్లల నుంచే అసభ్య సందేశాలు అందుతున్నాయి. ఇవేకాక పలురకాల ఇబ్బందులను కూడా ఎదుర్కొంటున్నారు. సెల్‌ఫోన్‌ ఉపయోగిస్తున్న పిల్లలు చెడుదారిలో పట్టకుండా ఉండేందుకు ఈ యాప్‌ ఎంతగానో ఉపకరిస్తుందనడంలో సందేహం లేదు. ఈ యాప్‌ ఉపయోగించే వాళ్లు నెలకు తొమ్మిదివందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

ముఖ్యంగా ఈ వయస్సులో కలిగే వ్యామోహ కోరికలే ఇలాంటి తప్పిదాలు చేయిస్తాయి. ఈ మధ్యకాలంలో మరీ విపరీతంగా సెల్పీల పేరుతో అమ్మాయిలు వారి బాయ్ ఫ్రెండ్స్ కి నగ్న చిత్రాలు పంపడం కూడా అధికమైంది. ఆ చిత్రాలతో వారు అమ్మాయిలను బ్లాక్ మెయిల్ చేయడం, డబ్బును లాగటంచ అంతేకాదు చివరకు వ్యభిచారినిగా కూడా మర్చాడం మన చుట్టూ నిత్యం జరుగుతన్న ఘటనలే. వయస్సు వచ్చిందని భ్రమలో ఏదో తందరపాటు పని చేసి జీవితకాలం మాయని మచ్చలా అది రేపిన గాయాన్ని తలచుకోవడం కన్నా.. నూరేళ్ల జీవితంలో తాము కేవలం 16 నుంచి 20 ఏళ్ల మధ్యే వున్నామని, ఇంకా చాలా జీవితం వుందని తలిస్తే తప్పలు చేయరు. తల్లిదండ్రలు కూడా వీరని సక్రమమైన మార్గంలో నడిచేలా పురాణగాధలు, దైవ చింతన, స్వాతంత్ర్య సమరయోధుల కథలు, ఇతిహాసాలు, పురాణాలు వంటి వాటిని చిన్నప్పటి నుంచే అలావాటు చేస్తే పిల్లల ద్యాస చెడు నుంచి మంచి మార్గంలో ప్రయాణించే అవకాశాలున్నాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Danger  Sexting  awareness  blackmail  teenage  exploit  messages  mails  sms  mms  photos  explicit picture  

Other Articles