Ape eats self roasted marshmallows

marshmallow food, marshmallow trees, marshmallows for apes, ape eats marshmallow, animal planet videos, world latest updates, tollywood latest news, apes funny

ape eats self roasted marshmallows : a video released by animal planet shows that an ape named kanzi eating marshmallows with roasting self and cooking for own needs this video become popular in youtube and other social networking sites

ఎంచక్కా.. వంట చేసుకుని తింటున్న వానరం

Posted: 10/23/2014 02:33 PM IST
Ape eats self roasted marshmallows

మనుషులు కోతి నుంచి పరిణామ క్రమంలో పుట్టుకొచ్చారు అని తెలుసు. అందుకే మనం కొన్ని కోతి పనులు చేస్తుంటాం.. కోతులు కూడా మనుషుల్లా ప్రవర్తిస్తాయి. అలాంటిదే ఈ సంఘటన. ఓ కోతికి ఆకలేసింది. మామూలుగా అయితే దగ్గర్లో ఏ ఆహారం ఉంటే వాటిని తీసుకుంటాయి. అయితే ఇక్కడ ఉన్న కాంజి అనే కోతి మాత్రం అందర్లా తాను ఎందుకు తినాలి అనుకుంది. తన దగ్గర ఉన్న మార్ష్ మాల్లోస్ ను కాల్చుకుని తినాలి అనుకుంది. వెంటనే కర్రలను తీసుకువచ్చి పోగేసింది. అగ్గిపెట్టెతో నిప్పు రాజేసింది. పెద్గగా మంట వచ్చేందుకు అచ్చం మనుషుల్లాగే గాలి ఊదుతూ మంట తెప్పించింది.

మార్ష్ మల్లాస్ ను కర్రకు గుచ్చి మంటపై బాగా కాల్చింది. అన్ని కాలిన తర్వాత నిప్పుతో ఏ ప్రమాదం జరగకుండా నీరు తెచ్చి జాగ్రత్తగా మంటను ఆర్పేసింది. ఆ తర్వాత రోస్ట్ అయిన మార్ష్ మల్లాస్ ను ఎంచక్కా కబాబ్ ల మాదిరిగా ఆరగించింది. ఈ వీడియోను యానిమల్ ప్లానెట్ విడుదల చేసింది. ఇందులో కోతి స్వయం పాకం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఎంతయినా మనుషులకు ముందు జాతి కదా.. మన వ్యవహార శైలి దానికి కూడా వచ్చి ఉంటుంది. కావాలంటే ఈ వీడియోను మీరు కూడా చూడండి. కోతి తెలివిని మెచ్చుకోక మానరు.

 

 

 

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : marshmallows  ape  roasted  animals  

Other Articles