Diwali festival speciality

diwali celebrations in india, diwali celebrations 2014, diwali celebrations in andhrapradesh, diwali celebrations in telangana, diwali festival speciality, diwali crackers, latest crackers in the market, hindu festivals, festvals in 2014, latest updates

diwali festival speciality : diwali alias deepawali known as indian lights festival in the simple meaning this festive brings lights to peoples lifes and gives glorious brightness in the life, hindus mainly business man perform laxmi pooja for wealth and blessings from god of money

దివ్య వెలుగుల పండగ మన ‘దీపావళి’

Posted: 10/22/2014 03:43 PM IST
Diwali festival speciality

దీపం జ్యోతిః పరంబ్రహ్మ దీపం సర్వతమోపహమ్ |

దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమ్మోస్తుతే ||

తెలుగు విశేష్’ వీక్షకులకు దీపావళి శుభాకాంక్షలు. భారతీయ సంస్కృతి, ఆచారాలు-సాంప్రదాయాలకు ఎంతో విశిష్టత ఉంది. ప్రతి కార్యానికి ఒక కారణం ఉంటుంది. అలాగే దీపావళి పండగకు కూడా మన చరిత్ర, పురాణాలు, ఇతిహాసాల్లో ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి పండగా ఓ మంచి పనికి శుభ సూచకంగా జరుపుకున్నట్లే..., ఈ వెలుగుల పండగను కూడ నరకాసురుడి పీడ తొలగినందుకు జరుపుకుంటారని పురాణాలు చెప్తున్నాయి. వాటిని ఒకసారి పరిశీలిస్తే.., దేవతల కాలంలో నరకాసురుడనే రాక్షసుడు ప్రజలు, దేవతలను చాలా ఇబ్బందులకు గురిచేశాడు. ఈ రాక్షసుడి ఆగడాలపై దేవతలంతా కలిసి శ్రీకృష్ణ, సత్యభామను కలిసి వేడుకుంటారు. (భూదేవి కుమారుడైన నరకుడిని తాను తప్ప మరెవరూ చంపకుండా గత జన్మలో భూదేవి వరం పొందుతుంది. ఆ తర్వాతి జన్మలో ఆమె సత్యభామగా తిరిగి జన్మిస్తుంది.)

దేవతలు, ప్రజలకు ఇబ్బంది కల్గిస్తున్న నరకాసురుడితో యుద్దం చేసి సత్యభామ రాక్షసుడని వధిస్తుంది. అలా రాక్షస పీడ విరగడై తమ జీవితాల్లో వెలుగులు నిండాయనే సంతోషంతో ప్రజలంతా ఈ దీపావళిని జరుపుకుంటారు. అంతేకాకుండా రాముడు రావణుడిని సంహరించిన తర్వాత సతీ సమేతంగా అయోధ్యకు తిరిగివచ్చిన రోజును ప్రజలు దీపావళిగా జరుపుకుంటారు అని పూర్వీకులు చెప్తున్నారు. అలా అనేక విశిష్టలతో ఆశ్వయిజ అమవాస్య రోజు వచ్చే ఈ పర్వదినం నాడు.., చంద్రుడి వెలుగులను తలదన్నేలా ప్రజలు ప్రతి ఇంట్లో వెలుగులు నింపుతారు.

కొత్త బట్టలు కట్టుకుని కొంతమంది దీపావళి రోజున నోములు, వ్రతాలు చేస్తారు. ఇది వారి పూర్వికుల నుంచి సాంప్రదాయంగా వస్తుంది. ఇక కొంతమంది.., మరీ ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజు సాయంత్రం లక్ష్మిపూజ నిర్వహిస్తారు. ఇలా చేయటం వల్ల తమకు అమితమైన సంపదలు రావటంతో పాటు కుటుంబానికి ఎప్పుడూ మహాలక్ష్మి ఆశీర్వాదం ఉంటుంది అని నమ్మకం. దీనికి ఒక పురాణ గాధ కూడా ఉంది. పూర్వం దుర్వాస మహర్షి దేవేంద్రుడి ఆతిధ్యంను మెచ్చి ఒక హారం బహుకరించాడు. అయితే ఎంతో సంపద ఉన్న తనకు ఈ హారం ఎందుకు అని తన దగ్గర ఉండే తెల్ల ఏనుగు మెడలో వేయగా అది కాలితో తొక్కేస్తుంది. దీంతో ఆగ్రహించిన ద్వారసుడు.., ఇంద్రుడిని శపిస్తాడు. తత్ఫలితంగా ఇంద్రుడు సంపదనంతా కోల్పోతాడు. ఇది గమనించిన శ్రీ మహావిష్ణువు.., ఒక దీపం వెలిగించి ఆ జ్యోతి వెలుగునే మహాలక్ష్మిగా భావించి పూజించమని సలహా ఇస్తాడు. ఆ ప్రకారంగా పూజ చేయగా లక్ష్మిదేవి మెచ్చి ఇంద్రుడికి తిరిగి సంపదలను ప్రసాదిస్తుంది.

ఇలా ఉత్తర, దక్షిణ భారత దేశాల్లో వేర్వేరు ఆచారాలు, సాంప్రదాయాల ప్రకారం దీపావళిని జరుపుకుంటారు. కాని అందరి ఉద్దేశ్యం మాత్రం వెలుగులు నింపుకోవటమే. తమ జీవితాల్లోకి కొత్త వెలుగులు కోరుకుంటూ ప్రతి ఒక్కరూ పండగ జరుపుకుంటారు. ఇక సాయంత్రం అయ్యిందంటే సంబరాల దీవాళి మొదలవుతుంది. నిశిరాత్రిలో రంగురంగుల బాణాసంచా వెలుగులు చూడటానికే రెండు కళ్లు సరిపోవు. చిన్నా.., పెద్దా తేడా లేకుండా అంతా బాణాసంచా కాల్చేందుకు ఉత్సాహం చూపిస్తారు. ఎంతో సరదాగా.., జరిగే ఈ కార్యక్రమంలో జాగ్రత్తలు తీసుకోకుంటే మాత్రం ముప్ప తప్పదు. క్షణికానందం కోసం టపాసులను చేతిలో పట్టుకుని పేల్చటం.., విసిరేయటం వంటివి చేస్తే తర్వాత బాధపడక తప్పదు. సరదాల కంటే... మన ప్రాణం ఎంతో విలువైనది అనే విషయం గుర్తుంచుకొండి.

చివరగా.., ఈ దీపావళి మీ జీవితాల్లొ కొత్త వెలుగులు నింపాలని.., ప్రతి ఒక్కరి జీవితాలు ప్రకాశవంతం కావాలని ‘తెలుగువిశేష్’ కోరుకుంటోంది. మరోసారి మీకు, మీ కుటుంబానికి దీపావళి శుభాకాంక్షలు.


కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : diwali  festival  latest updates  lights  

Other Articles