Ap government agrees to give 300 mw power to telangana

Andrapradesh, AP government. CM chandrababu, 300 MegaWatts, Electricity, power, Telangana, KCR, Krishna River, Srisailam Dam

AP government agrees to give 300 MW power to Telangana

300 మెగావాట్ల విద్యుత్ ఇవ్వడానికి అంగీకారం..

Posted: 10/22/2014 02:56 PM IST
Ap government agrees to give 300 mw power to telangana

తెలంగాణ రాష్ట్రం ఎదుర్కొంటున్న విద్యుత్ కొరతపై ఏపీ ప్రభుత్వం స్పందించింది. కృష్ణా డెల్టా రైతులను ఆదుకునేందుకు శ్రీశైలం డ్యామ్ నుంచి జల ఉత్పాదకను నిలిపివేసిన పక్షంలో తెలంగాణకు 300 మెగావాట్ల విద్యుత్ ను సరఫరా చేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని కృష్ణా జిల్లా పర్యటనలో వున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.

తెలంగాణలో కరెంట్ కష్టాలకు తానే కారణమని టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని చంద్రబాబు మండిపడ్డారు. ముందు చూపుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోకుండా తనపై విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజల కష్టాలు తీరవని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల కోసం 300 మెగావాట్ల విద్యుత్ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

విద్యుత్ ఉత్పత్తి వల్ల శ్రీశైలంలో నీళ్లు పూర్తిగా తగ్గిపోయాయని… అందువల్లే విద్యుత్ ఉత్పత్తి సాధ్యం కాదని తెలంగాణ ప్రభుత్వానికి తెలియజేసినట్లు బాబు తెలిపారు. ఇలాగే విద్యుత్ ఉత్పత్తి చేసినట్లయితే.. ఎండాకాలంలో తాగడానికి ఇరు రాష్ట్రాల ప్రజలకు నీళ్లు ఉండవని ఆయన అన్నారు. దీనికి ప్రతిఫలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 300 మెగావాట్ల విద్యుత్ ను తెలంగాణకు ఇవ్వడానికి తాను సంసిద్ధత వ్యక్తం చేశానని చంద్రబాబు అన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles