Man rescued from a firing home in california

man saved from burning home, california home fire, man rescued from firing home, california news, america news, us latest updates, tollywood latest updates, fire accidents

man rescued from a firing home in california : in california a house burned with fire owner of the house shouted for help with the call a man enters into house amazingly saved owner brought him out

మంటల్లో వ్యక్తిని కాపాడిన రియల్ హీరో

Posted: 10/21/2014 04:24 PM IST
Man rescued from a firing home in california

నిప్పు దగ్గరకు వెళ్తేనే వేడి తగిలి ముట్టుకోవాలంటే భయపడతాము. అలాంటిది చుట్టు దట్టమైన అగ్నికీలలు.. ఊపిరి ఆడకుండా పొగ కమ్మేసినా భయపడలేదు. ప్రాణాలకు తెగించి ఓ వ్యక్తిని రక్షించాడు. అందరిచే హీరో అన్పించుకుంటున్నాడు. ప్రస్తుతం అమెరికాలో పాపులర్ అయిన ఈ వ్యక్తి.., అతడు చేసిన సాహసం గురించి పూర్తి వివరాలు ఇవి. కాలిఫోర్నియాలోని ఫ్రెస్నో ప్రాంతంలో ఓ ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి.., క్షణాల్లో ఇళ్ళంతా వ్యాపించాయి.

ప్రమాదం జరిగిన సమయంలో ఇంటి యజమాని లోపలే చిక్కుకుని కాపాడాలని అరవటం మొదలు పెట్టాడు. అప్పటికి పైర్ సిబ్బంది ఇంకా రాలేదు.. చుట్టు ఉన్న వారంతా చూస్తున్నారు తప్ప ఎవరూ ఇంట్లోకి వెళ్ళటానికి ధైర్యం చేయలేదు. ఈ సమయంలోనే అందరిలోనుంచి ఓ వ్యక్తి వేగంగా లోపలికి వెళ్ళాడు. ఓ రెండు నిమిషాల తర్వాత ఇంటి ఓనర్ ను భుజాన వేసుకుని బయటకు వచ్చాడు. ఇంటి యజమానికి.., రక్షించిన వ్యక్తికి చిన్న గాయం కూడా కాలేదు. ఈ సాహసం చూసిన వారంతా ఆ వ్యక్తిని ప్రశంసలతో ముంచెత్తారు. ఇంటి యజమాని అయితే తనను కాపాడిన దేవుడు, రియల్ హీరో అంటూ పొగిడారు. ఆ రియల్ హీరో.. రియల్ సాహసం మీకోసం అందిస్తున్నాం చూడండి.


{youtube}CTq8WLpDOL4|620|400|1{youtube}

కార్తిక్ 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : california  fire accident  latest updates  hero  

Other Articles