Virat kohli breaks sachin record for the first time by making 20 centuries in just 64 innings

virat kohli, virat kohli latest news, virat kohli records, sachin tendulkar news, sachin tendulkar records, sachin tendulkar latest news, sachin tendulkar cricket innings, virat kohli break sachin record, virat kohli centuries, indian cricket players

virat kohli breaks sachin record for the first time by making 20 centuries in just 64 innings

సచిన్ రికార్డు బద్దలు.. చరిత్ర సృష్టించిన కోహ్లీ!

Posted: 10/20/2014 08:00 PM IST
Virat kohli breaks sachin record for the first time by making 20 centuries in just 64 innings

భారత క్రికెట్ దిగ్గజం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఇంతవరకు ఎన్ని రికార్డులు బద్దలుకొట్టాడో అందరికీ తెలిసిందే! క్రికెట్ చరిత్రలోనే ఎవ్వరూ సాధించలేనంతగా సచిన్ పేరు సంపాదించుకున్నాడు. అందుకే.. ఆయన్ను ఇతర క్రికెట్ దిగ్గజాలతోపాటు అభిమానులందరూ ‘‘గాడ్ ఆఫ్ క్రికెట్’’గా అభివర్ణిస్తారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సచిన్ చాలా చిన్న వయస్సులోనే టెస్ట్ మ్యాచులు ఆడిన క్రికెటర్ గా చరిత్రకెక్కడమే కాకుండా టెస్టుల్లో అత్యధిక సెంచరీలు సాధించిన బ్యాట్స్ మెన్ గా అరుదైన ఘనతను తన ఖాతాలో నమోదు చేసుకున్నాడు. టెస్టు మ్యాచుల్లో ఇతను సాధించిన రికార్డులు ఇంతవరకు ఏ ఒక్క క్రికెటర్ నమోదు చేయలేకపోయాడు. వన్డే మ్యాచుల్లో కూడా సచిన్ అరుదైన రికార్డులు సాధించాడు కానీ.. ఆ రికార్డులను అప్పుడప్పుడు కొంతమంది క్రికెటర్లు బద్దలుకొట్టుకుంటూ చరిత్ర సృష్టిస్తున్న ఆటగాళ్లూ వున్నారు.

ఉదాహరణగా చెప్పుకోవాలంటే.. సచిన్ వన్డే మ్యాచుల్లో 200 స్కోరు చేసి రికార్డు సాధిస్తే.. సెహ్వాగ్ 219 పరుగులు ఆ రికార్డును తిరగరాశాడు. అలాగే ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కరు ఆయన రికార్డులను బద్దులుకొడుతున్నారు. అటువంటి జాబితాల్లోకి ఇప్పుడు విరాట్ కోహ్లీ కూడా చేరిపోయాడు. సచిన్ రికార్డును బద్దలుకొడుతూనే చరిత్రలో ఇంతవరకు ఏ ఆటగాడు సాధించని రికార్డును తన ఖాతాలో జమచేసుకున్నాడు ఈ యువ ఆటగాడు! ఐదువన్డేల సిరీస్ లో భాగంగా మొన్న వెస్టిండీస్ తో జరిగిన నాలుగో వన్డేలో విరాట్ కోహ్లీ ఏవిధంగా చెలరేగాడో అందరికీ తెలిసిందే! ఆ మ్యాచ్ లో 127 పరుగులు చేసిన విరాట్.. తన వన్డే కెరీర్ లో మొత్తం 20 సెంచరీలను పూర్తి చేశాడు. దీంతో ఇతగాడు కేవలం 64 ఇన్నింగ్స్ లోనే 20 సెంచరీలు చేసి, ఈ ఫీట్ ను అత్యంత వేగంగా అందుకున్న క్రికెటర్ గా సరికొత్త రికార్డును తన ఖాతాలో జమ చేసుకున్నాడు.

ఇక సచిన్ విషయానికొస్తే.. తన వన్డే కెరీర్ లోనే మొత్తం 49 సెంచరీలు చేసిన ఈ క్రికెట్ దిగ్గజం... తన తొలి 20 సెంచరీలను పూర్తి చేసేందుకు ఏకంగా 197 ఇన్నింగ్స్ ను ఆడాల్సి వచ్చింది. ఎంతోకాలం వరకు కాలక్షేపం చేస్తేగానీ సచిన్ 197 ఇన్నింగ్స్ లకు గాను కేవలం 20 సెంచరీలు మాత్రమే చేయగలిగాడు. దీంతో కోహ్లీ సచిన్ పేరిట వున్న 20 సెంచరీల రికార్డును బద్దలుకొట్టేసి.. సరికొత్త చరిత్రను సృష్టించిన ఆటగాడిగా నిలిచిపోయాడు. అలాగే టెండూల్కర్ రికార్డులను ఛేదనలో తొలివిజయం సాధించిన యువఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. అతి తక్కువ సమయంలోనే సచిన్ రికార్డును బ్రేక్ చేసిన విరాట్.. రానురాను మరెన్నీ రికార్డులు నమోదు చేస్తాడో..? ఛేదిస్తాడో..? వేచి చూడాల్సిందే!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  sachin tendulkar  indian cricket players  virendar sehwag  

Other Articles