Uses with hyderabad police news vehicles

hyderabad police, hyderabad police vehicles, hyderabad police new vehicles, hyderabad traffic police, hyderabad traffic police challan payment, cyberabad police, cyberabad police traffic challans, kcr on police, kcr on telangana police, latest updates, telangana news

uses with hyderabad police news vehicles : hyderabad police got new vehicles of cars and bikes for crime control and patrol and also police logo changed these changes are came effective but there is doubts that crimes are increased or decreased

కొత్త వాహనాలతో ఏం లాభం... నేరాలు తగ్గాయా..? పెరిగాయా ?

Posted: 10/20/2014 05:31 PM IST
Uses with hyderabad police news vehicles

తెలంగాణ ప్రభుత్వం ఎంతో ఆర్బాటంగా పోలిసులకు కొత్త వాహనాలు కొనిచ్చింది. బ్రాండ్ హైదారబాద్ పేరుతో బైకులు, ఇన్నోవా కార్లను అందించారు. ప్రస్తుతం ఈ బైకులు, కార్లు నగర రోడ్లపై రయ్..,. రయ్ మని దూసుకెళ్తున్నాయి. కోట్లు ఖర్చుపెట్టి తీసుకువచ్చిన ఈ వాహనాల వల్ల ఏమైనా అదనపు ప్రయోజనం ఉందా..? ఇంత ఖర్చుపెడితే మనకు ఒరిగిందేమిటి అని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి చేసిన ఆర్బాటాలు పోలిసులకు కొత్త వాహనాల వల్ల నగరంలో నేరాలు తగ్గాయా..? పెరిగాయా అని అంతా చర్చించుకుంటున్నారు.

తెలంగాణ రాష్ర్టం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం పోలిసులకు కొత్త వాహనాలు అందిస్తామని ప్రకటించింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ప్రపంచ వ్యాపితం చేయాలనే ఉద్దేశ్యంగా అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న డబ్బులతో బైకులు, కార్లను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. వివిధ వాహన ఉత్పత్తి కంపనీల నుంచి టెండర్లు ఆహ్వానించి చివరకు బైకులను హీరో కంపనీ నుంచి కార్లను టయెటా కంపనీ నుంచి తీసుకుంది.

గతంలో ఉన్న తెలంగాణ పోలిసుల లోగోను మార్చటంతో పాటు.., హైదారబాద్ పోలిసుల లోగోలను కూడ మార్చేసింది. దీనికి తోడు కోట్ల రూపాయలు ఖర్చుచేసి పోలిసులకు కొత్తవాహనాలు అందించింది. ఆగస్టు పదిహేను రోజున ముఖ్యమంత్రి వీటిని ప్రారంభించారు. ఈ వాహనాల వల్ల నగరంలో నేరాలను తగ్గించటతో పాటు గస్తిని పెంచటానికి ఉపయోగపడుతుందని చెప్పారు. కొత్త వాహనాలు, పోలిసుల లోగులను చూసిన హైదరాబాద్ ప్రజలు ప్రభుత్వ నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. తెలంగాణలో కేసీఆర్ పాలన బాగానే ఉంది అని కితాబిచ్చారు.

ఇంతవరకు బాగానే ఉంది అయితే..., ఈ కొత్త వాహనాల వల్ల నగరంలో నేరాలు ఏమైనా తగ్గాయా అనేది తేలాల్సి ఉంది. గతంలో బ్లూ స్కాట్స్ పేరుతో పోలిసులు గల్లీలు, బస్తీల్లో తిరిగే వారు. అలాంటి వారే ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన బైకులపై గస్తీ తిరుగుతున్నారు. అదేవిధంగా ఒకప్పుడు సుమోలతో తనిఖీలు, ఘటనా స్థలానికి చేరుకోవటం చేసిన పోలిసులు ఇప్పుడు అధునాత సౌకర్యాలున్న ఇన్నోవా కార్లలో వస్తున్నారు. వాహనాలు మారాయి సరే. అందుకు తగ్గట్లుగా పోలిసుల ప్రవర్తన.., .ప్రజలతో వ్యవహరించే విధానంలో మార్పు వచ్చిందా అనేది ఇంకా ప్రశ్నగానే మిగిలి ఉంది. పోలిసుల కోసం ప్రభుత్వం అధికారం చేపట్టగానే వారంలో ఒకరోజు సెలవుదినం ప్రవేశపెట్టింది. ఇలా ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నా.., నేరాలు తగ్గాయా..? పెరిగాయా..? అనేది ఖాఖీలకే తెలుసు. అయతే సామాన్య ప్రజల అభిప్రాయాన్ని బట్టి ఈ వాహనాల వల్ల లుక్ మారింది తప్ప పెద్దగా ఒరిగిందేమి లేదంటున్నారు. మరి వీరి అభిప్రాయాల్లో ఉన్న వాస్తవమెంతో ప్రభుత్వమే చెప్పాలి.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : hyderabad police  kcr  latest updates  vehicles  

Other Articles