Japan minister yuko obuchi resigned with make up scam allegations

make up scam, japan make up scam, yuko obuchi resign, yuko obuchi allegations, japan latest updates, world latest updater, scams in india, scams in world, scams in japan, funny news, interesting news in world

japan minister yuko obuchi resigned with make up scam allegations : japanese minister yuko obuchi resigns over make up scam allegations came on her that she spent rupees 58lakhs for buying make up kits and for other cosmetics with public money

సిల్లీ : మేకప్ స్కాం లో మహిళా మంత్రి రాజీనామా

Posted: 10/20/2014 10:41 AM IST
Japan minister yuko obuchi resigned with make up scam allegations

మనదేశంలో వందల, వేల కోట్లు దోచుకున్న స్కాంలు చాలానే ఉన్నాయి. ఈ కుంభకోణాల్లో ఆరోపణలు ఎదుర్కున్న ప్రముఖులు తమ పదవులకు మాత్రం రాజీనామాలు చేయలేదు. అదే జపాన్ లో అయితే రూ.58లక్షల విలువైన స్కాంలో ఆరోపణలు రావటంతో ఓ మంత్రి రాజీనామా చేసింది. యుకో ఒబుచి జపాన్ పరిశ్రమల శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వర్తించేది. గతంలో జపాన్ లో కీలకమైన వాణిజ్యం, ఆర్ధిక శాఖలను కూడా నిర్వహించింది. సమర్ధవంతమైన మంత్రిగా మంచి పేరు తెచ్చుకుంది.

అయితే ఈ మద్య ఆమె రాజకీయ విరాళాల కోసం వచ్చిన డబ్బును మేకప్ సామాన్లు కొనేందుకు ఖర్చు పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. ఓ డిపార్ట్ మెంటల్ స్టోర్ కు వెళ్ళి వివధ సౌందర్య లేపనాలు, అందం పెంచే క్రీములు, సెంటు బాటిళ్లు వగైరా కొనేసిందట. ఇలా మేకప్ కోసం రూ. 58లక్షల విలువైన ప్రజాధనంను తన వ్యక్తిగత అవసరాల కోసం ఖర్చుచేయటంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మంత్రి తీరును చాలామంది తప్పుబట్టారు. ఈ అంశం ప్రధాని షింజోకు తలనొప్పిగా మారింది. చిన్న మొత్తానికి సంబంధించిన విషయం ఇంత చికాకు తెప్పిస్తోంది ఏమిటి అని తలపట్టుకున్నారాయన.

తన వల్ల వచ్చిన వివాదాన్ని తానే ముగిస్తానంటూ మంత్రి పదవికి యుకో ఒబుచి రాజీనామా చేసింది. తప్పనిసరి పరిస్థితుల్లో మంత్రి రాజీనామాను షింజో ఆమోదించారు. దేశంలో కీలకమైన శాఖలను సమర్దంగా నిర్వహించ మంచి పేరు తెచ్చుకున్న యుకో ప్రధాని అభ్యర్దిగా ప్రచారం జరుగుతోంది. ఈ తరుణంలో మేకప్ ఆమె జీవితంపై మచ్చను తీసుకువచ్చింది. అయితే డబ్బును చెల్లించకుండా పదవిని వీడి సమాధానం చెప్పినందుకు యుకోను అంతా అభినందించాలి. మన నేతలు మాత్రం కోర్టులు తప్పుబట్టినా.., పదవులు లేకుంటే ప్రాణాలు లేనట్లుగా వ్యవహరిస్తారు. అందుకే అణుబాంబులు పడ్డా జపాన్ అభివృద్ధిలో దూసుకెళ్తుంటే.., మనం మాత్రం నడిచేందుకు కూడా ఇబ్బంది పడుతున్నాము.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : make up scam  latest updates  yuko obuchi  resign  

Other Articles