Kannada actress aishwarya caught fake producer eshwar along with her friends and handed over to police

kannada actress aishwarya, kannada actress aishwarya latest news, bangalore cine world, kannada film industry, sandalwood actresses, sandalwood fake producers, sandalwood heroes, sandalwood heroines, aishwarya fake producer, aishwarya hot photo shoot, kannada actress nayana, fake producer eshwar

A big chase in bangalore cine world : kannada actress aishwarya caught fake producer eshwar along with her friends and handed over to police

సినీ ఫక్కీలో బిగ్ ఛేజ్.. ఐశ్వర్య చేతిలో దొంగనిర్మాత!

Posted: 10/17/2014 07:44 PM IST
Kannada actress aishwarya caught fake producer eshwar along with her friends and handed over to police

చిత్రపరిశ్రమలో ఇంతవరకు ఎవరూ ఊహించని విధంగా ఒక అనూహ్యమైన సంఘటన చోటు చేసుకుంది. సినిమా అవకాశాలు ఇస్తానని నమ్మబలికి ఇతరుల నుంచి డబ్బులు కాజేస్తున్న ఒక దొంగ నిర్మాతను నటి ఐశ్యర్య పసిగట్టింది. అతను చెప్పిన దొంగమాటలకు లొంగకుండా తెలివిగా వ్యవహరించిన ఐశ్యర్య... తన స్నేహితుల సహాయంతో సునాయాసంగా ఆ నిర్మాతను పోలీసులకు పట్టించింది. ఈ మొత్తం వ్యవహారం బెంగుళూరు సినీఫక్కీలో చోటు చేసుకుంది. సినిమా అవకాశాల కోసం వేచి చూస్తున్న నటి ఐశ్యర్య, సినిమాల్లో ఆఫర్లు ఇప్పిస్తానంటూ డబ్బులు మింగేస్తున్న దొంగనిర్మాత మధ్య జరిగిన కథ ఇది!

నటి ఐశ్వర్య సినిమా ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో తనకు హీరోయిన్ గా మరిన్నీ సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానంటూ ‘‘ఈశ్వర్ (32)’’ అనే వ్యక్తి దొంగ నిర్మాతనంటూ ఈమె దగ్గరకు వచ్చాడు. ఓ పెద్ద సినిమాలో హీరోయిన్ వేషం ఖచ్చితంగా ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు. దీంతో పొంగిపోయిన నటి ఐశ్యర్య... ఆ సినిమాలో నటించినందుకుగాను ప్రతిఫలం అడిగింది. ఇక్కడే ఆ నిర్మాత అసలు రూపం కొద్దివరకు బయటకు పడింది. ఆమె ప్రతిఫలం అడగ్గానే... ‘‘ముందు ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో సభ్యత్వం తీసుకోవాలి. అందుకు పదివేల రూపాయలు ఇవ్వాల్సి వుంటుంది’’ అంటూ ఆమెనే అడిగాడు. అతని మీద కాస్త అనుమానం కలగడంతో ఐశ్వర్య తన దగ్గర డబ్బులు లేవని, తర్వాత ఇస్తానని అక్కడి నుంచి వచ్చేసింది. వచ్చిన వెంటనే ఈ మొత్తం తతంగాన్ని తన స్నేహితులకు వివరించింది. దీంతో ఆ వ్యక్తితో జాగ్రత్తగా వుండాలంటూ ఆమెని స్నేహితులు హెచ్చరించారు.

ఇదిలావుండగా.. ఆ దొంగనిర్మాత ఈశ్వర్ ఇంతలోనే మరో అమ్మాయికి హీరోయిన్ అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికాడు. అదృష్టవశాత్తూ ఆ అమ్మాయి ఐశ్వర్య స్నేహితురాలిగా తేలింది. ఆమె పేరు రమ్య. గురువారం రమ్య, ఈశ్వర్ ఒక కాఫీ షాప్ లో మూవీ గురించి మాట్లాతుండగా... హీరోయిన్ వేషం కోసం పదివేలు ఇవ్వాల్సిందిగా ఐశ్వర్యను కోరినట్టే రమ్యను కూడా అడిగాడు. అయితే ఆమె కూడా తెలివిగా వ్యవహరించి, తన స్నేహితురాలయిన ఐశ్వర్యకు ఫోన్ చేసి మొత్తం వ్యవహరాన్ని వివరించింది. ఆ దొంగ నిర్మాతను ఇదే మంచి సమయమని భావించిన ఐశ్యర్య... తాను కాఫీ షాప్ కు వచ్చేంతవరకు అతనితో కబుర్లు మాట్లాడుకుంటూ వుండమని రమ్యతో చెప్పింది. వెంటనే తన స్నేహిరాలు నయన, మరో నటుడిని అక్కడికి తీసుకెళ్లింది. వారిని చూసిన ఆ దొంగనిర్మాత పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే వీళ్లందరూ ఒకేసారి దొంగ దొంగ అంటూ అరవడంతో.. చుట్టుపక్కల వున్న ప్రజలు అతడిని పట్టుకున్నారు. అలా ఆ విధంగా ఐశ్వర్య చేతికి చిక్కిన ఆ దొంగనిర్మాత.. ఇప్పుడు పోలీసుల బందీ ఖానాలో వున్నాడు. ఇది బెంగుళూర్ సినీఫక్కీలో జరిగిన ఓ అనూహ్యమైన ఛేజింగ్!

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles