Chandra babu and pawan kalyan shares dias for the cause

tollywood, volentary, hudhud victims, cm relief fund, cyclone, andrapradesh, pawan kalyan, chandrababu, chief minister

chandra babu and pawan kalyan appeals to help the cyclone victims

ఆ అవసరం కోసమే ఒక్కటైన బాబు, పవన్..

Posted: 10/16/2014 04:56 PM IST
Chandra babu and pawan kalyan shares dias for the cause

వారిద్దరూ భిన్న ధృవాలు, వారి అలోచనా విధానాలు కూడా వేరు. అంతేకాదు రెండు వేర్వేరు పార్టీలకు అధినేతలు, అయినా ఒక్కటిగా కలిసారు. వారే టీడీపీ అధినేత, అంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. అప్పడెప్పుడో నాలుగు నెలల క్రితం సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్ర సార్వత్రిక ఎన్నికలు వచ్చినప్పడు ఇరువురు నేతలు కలసి వేదికను పంచుకున్నారు. జనసేన తరపున పవన్.. మోడీ అద్యక్షతలోని బీజేపికి మద్దతు తెలిపిన సందర్భంగా, అదే వేదికపై చంద్రబాబు కూడా వున్నారు. కానీ ఇప్పుడలా కాదు. ఇక్కడేమీ ఎన్నికలు లేవు. అయినా సరే ఇద్దరు నేతలు ఒకే వేదికగా.. ఒకటిగా మీడియా ముందుకు వచ్చారు. ప్రజలకు పిలుపునిచ్చారు.

కడలిశరంలా ప్రపండ వేగంతో వచ్చిన హదూద్ తుఫాను విశాఖ సహా ఉత్తరాంధ్రలో పెను విధ్వంస సృష్టించిన నేపథ్యంలో.. బాధితులను ఆదుకోవడం అందరూ సామాజిక బాధ్యతగా భావించాలని వారు పిలుపునిచ్చారు. విశాఖలో పవన్ కళ్యాణ్ తో కలసి మీడియా ముందుకు వచ్చిన చంద్రాబాబు మాట్లాడుతూ.. వ్యక్తులు, కార్పొరేట్ సంస్థలు సాయం చేసేందుకు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. ప్రజలు కూడా ప్రభుత్వానికి సానుకూలంగా సహకరిస్తున్నారన్నారు. ఖర్చు ఎంతైనా పరవాలేదు.. ప్రజల బాధలు తీరాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు వివరించారు.

chandra-babu-pawan-kalyan

సమయం, సందర్భం చూసుకుని పనికానిచ్చుకోవడంలో దిట్టగా పేరుగాంచిన చంద్రబాబు, సందర్భం కాకపోయినా పనిలో పనిగా పవన్ కల్యాణ్ ను పోగడ్తలో ముంచెత్తాడు. బాధితులను ఆదుకోవటంలో పవన్ కల్యాణ్ ఎంప్పుడూ ముందుంటారని అభినందించారు. జీఎంఆర్, టాటా, ఇన్ఫోసిస్ సంస్థలు తుపాను బాధితులను ఆదుకునేందుకు ముందుకురావటం అభినందనీయమన్నారు. 15రోజులు పడుతుందనుకున్న విద్యుత్ సమస్యను మూడు రోజుల్లో దారికి తెచ్చామని వెల్లడించారు. బంగాళ దుంపలకోసం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రితో 3సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. భారీ నష్టం రాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్‌కు విద్యుత్‌ను అందిస్తున్నట్లు తెలిపారు. తుపాను బాధితులకు విశాఖ డైరీ 3.85లక్షలు, హెరిటేజ్ 65వేల లీటర్ల పాలు అందించినట్లు చెప్పారు. సినీనటుడు పవన్ కల్యాన్, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

హుదుద్ తుపాను కలిగించిన నష్టం బాధాకరం: పవన్ కల్యాణ్

హుదుద్ తుపాను విశాఖలో కలిగించిన నష్టం బాధాకరమని సినీనటుడు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. గురువారం ఉదయం విశాఖలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తుపాను బాధితులను ఆదుకునేందుకు తనవంతు సాయంగా రూ.50లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.... క్లిష్ట సమయాలను ఎదుర్కొనే నాయకత్వ లక్షణాలు చంద్రబాబులో ఉన్నాయన్నారు. తక్షణ సాయం ప్రకటించిన ప్రధానమంత్రి మోదీ, ప్రజలకు అండగా ఉన్న చంద్రబాబుకు పవన్ కల్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పుడు రాజకీయాలు చేయడం తగదని, చంద్రబాబుకు సహకరించాలని సూచించారు. విశాఖ స్మార్ట్ సిటీగా అవబోతున్న వేళ.. ఈ విపత్తుబాధ కలిగిస్తోందన్నారు. వైపరీత్యం సమయంలో ఐటీ విశాఖకు రాదంటూ విమర్శలు సరికాదన్నారు.ేర

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles