Surprising crores of people using this

mobile phone subscribers, mobile phones, Trai, private providers, BSNL, MTNL,, 95 crore, Telecom Subscriber Base, August

Telecom Subscriber Base Crosses 95 Crore Mark Again In August

వామ్మో.. కోట్ల మంది దీనిని వాడుతున్నారా..?

Posted: 10/16/2014 01:06 PM IST
Surprising crores of people using this

మనం ఏక్కడికైనా వెళ్తే.. అక్కడ జనసమూహ్మాన్ని చూస్తే.? వారి తరువాతే మీరని తెలిస్తే.. వామ్మో ఏమీ జనం అనుకుంటారు. కానీ మన దేశంలో ప్రపంచీకరణ తరువాత వచ్చిన విప్లవాత్మక మార్పులతో మొబైల్ ఫోన్ తప్పని సరి వస్తువుగా మారింది. మన దేశంలో ప్రస్తుతం మొబైల్ ఫోన్లను వాడే వారి సంఖ్య ఎంతో తెలుసా..? జులై నెలాఖరు నాటికి దాని సంఖ్య ఎంతవరకు చేరుతుందో తెలుసా..? ఏదోలే కోటి మందో, లేక పది కోట్ల మందో అనుకంటున్నారా..? ఇంతకీ మన దేశ జనాభా ఎంత అన్న ప్రశ్నలు ఇక్కడ ఉత్పన్నం కావాల్సిందే..

2011 జనాభా లెక్కల ప్రకారం 120 కోట్ల మంది జనాభా వున్న మన దేశంలో టెలి కమ్యూనికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం 92.43 కోట్ల మంది మొబైల్ ఫోన్లను వాడుతుండగా.. జులై నెలాఖరు నాటికి ఈ సంఖ్య 95 కోట్లకు చేరుతుందని అంచానా వేసింది. ఆగస్టులో మొత్తం టెలికాం వినియోగదారుల సంఖ్య మరోసారి 95 కోట్లను దాటింది. 'జులై నెలాఖరు నాటికి 94.64 కోట్ల మంది టెలికాం వినియోగదారులు ఉండగా.. ఆగస్టు చివరికల్లా వీరు 95.18 కోట్లకు పెరిగారని ట్రాయ్ ఒక ప్రకటనలో తెలిపింది.

దాదాపు రెండేళ్ల తర్వాత సెల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య 95 కోట్లను చేరింది. తొలిసారి 2012 మార్చిలో 95 కోట్ల మంది వినియోగదారులు సెల్ ఫోన్ లను వాడినా.. అ తరువాత క్రమంగా తగ్గారు. మళ్లీ ఇప్పుడు ఆ సంఖ్యను అధిగమించనున్నారు. దాటింది. ట్రాయ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. మొబైల్, ఇంటర్నెట్‌ను వినియోగించే వారి సంఖ్య 91.87 కోట్ల నుంచి 92.43 కోట్లకు పెరిగింది. వీరిలో 80.72 కోట్ల మంది మాత్రమే క్రియాశీలకంగా ఉన్నారు. వినియోగదారుల విషయంలో ప్రైవేట్ టెలికాం కంపెనీలది 90 శాతం వాటా కాగా.. బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్‌ను వాడుతున్న వారు 9.84 శాతం మాత్రమే. ల్యాండ్‌లైన్ ఫోన్ల వినియోగదారులు 2.76 కోట్ల మంది నుంచి 2.75 కోట్లకు తగ్గారని ట్రాయ్ వెల్లడించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles