Pawan kalyan meets hudhud cyclone victims

tollywood, volentary, hudhud victims, cm relief fund, cyclone, andrapradesh, pawan kalyan, contribute

pawan kalyan meets hudhud cyclone victims

పవన్ ఒంటరిగా కదిలినా.. జన సమూహమే..

Posted: 10/16/2014 11:24 AM IST
Pawan kalyan meets hudhud cyclone victims

కడలిశరంలా ప్రపంచవేగంతో వచ్చిన హదూద్ తుఫాను ఉత్తరాంధ్రను కాకావికళం చేసిన పరిస్థితులు ఆయన కంట కన్నీరోలికించాయి. పుట్టెడు ధ:ఖంలో వున్న ఉత్తరాంధ్రవాసులకు ఆయన తన వంతు సాయంగా 50 లక్షల రూపాయలను అందించారు. అంతటితో తాను చాలా చేశానని అనుకోలేదు. బాధితులను తన వంతుగా ఓదార్చాలని పూనుకున్నాడు. ఒంటరిగా బాధిత ప్రాంతాలకు కదిలాడు. అతనే జనసేన అధినేత, సీనీనటుడు పవర్ స్టార్ పవన్ కల్యాన్.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/pawan-meetscyclone-victims

ఆర్థులను ఓదార్చేందుకు బాధిత ప్రాంతాలకు కదలివెళ్లాడు. ప్రజల బతుకు చిత్రాన్ని ఛిద్రం చేసిన హుద్ హుద్ తుఫాను మిగిల్చిన విధ్వంసాన్ని స్వయంగా చూసి చెలించిపోయాడు. దివిసీమ ఉప్పెన తరువాత, అంతటి తీవ్రమైన తుపాను ఇదేనన్నాడు. సర్వం కోల్పోయి అతలాకుతలమైన విశాఖనగర వాసుల్ని పరామర్శించాడు. బాధితులకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చాడు. మురికివాడలు మొదలు ..బహుళ అంతస్తుల్లో ఉండేవారు వరకూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు పరిశీలించిన తరువాత ఇంకా ఏం చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందో ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకెళతానని చెప్పారు.

ఒంటరిగా వెళ్లి ప్రజల కష్టాలను చూద్దమనుకున్న పవన్ కళ్యాన్ కు అక్కడ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. తమ కష్టాలను పక్కన బెట్టి పవన్ కల్యాన్ తో కరాచలనం కోసం పోటీ పడ్డారు. వారందరినీ పలకరిస్తూ పవన్ కల్యాన్ ముందుకు సాగాడు. ఇళ్లను కోల్పోయిన వారిని, గూడు చెదిరిన అభాగ్యులను పరామర్శించాడు. బాధితులు పవన్ తో తమ గోడును వెళ్లబోసుకున్నారు. వారందరికీ జనసేన పార్టీ అండగా వుంటుందని హామి ఇచ్చడు పవన్.. దట్ ఈజ్ పవన్..

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tollywood  volentary  hudhud victims  cm relief fund  cyclone  andrapradesh  pawan kalyan  contribute  

Other Articles