Energy drinks are hazardous to health

energy drinks, caffine, hazardous, health, researchers, side effects, B vitamin, soft drinks

energy drinks are hazardous to health, says researchers

ఎనర్జీ కోసం తాగిలే.. అసలుకే ఎసరు వస్తుందట..!

Posted: 10/14/2014 08:37 AM IST
Energy drinks are hazardous to health

ఎనర్జీ అదే బలం కోసం తాగితే అసలుకే ఎసరు వస్తుందట. అదేంటండీ మేమే మధ్యం తాగం అంటున్నారా..? మేం చెప్పేది కూడా మధ్యం కాదు. ఎనర్జీ డ్రింక్స్ గురించే..! శక్తినిస్తాయని ఎనర్జీ డ్రింకులు తీసుకుంటే దేహం డొల్లలా తయారవుతుందని తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఎనర్జీ డ్రింకుల వల్ల కలిగే హాని ఎంతో ఎక్కువని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వీటిల్లో ఉన్న కెఫైన్‌ మనిషి ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు. ఎక్కువ ఎనర్జీ డ్రింకులు తీసుకోవడం వల్ల గుండె కొట్టుకోవడంలో తేడాలు సంభవించి తీవ్రమైన గుండెజబ్బులు తలెత్తుతున్నట్టు గత అధ్యయనాలు చెప్తున్నాయి. ఇటీవల చేసిన అధ్యయనాల్లో ఎనర్జీ డ్రింకులు అధికంగా తీసుకోవడం వల్ల నిద్రలేమితోపాటు నరాల జబ్బులు కూడా ఎక్కువ వస్తున్నాయని వెల్లడైంది.

ఎనర్జీ డ్రింకులు అథ్లెట్స్‌పై చూపించే అనుకూల, ప్రతికూల ప్రభావాల గురించి స్పెయిన్‌లోని కెమిటో జోసె సెలా విశ్వవిద్యాలయం వారు పరిశోధనలు చేశారు. ఫుట్‌బాల్‌, రగ్బీ, హాకీ, బాస్కెట్‌ బాల్‌, టెన్నిస్‌, వాలీబాల్‌ ఇలా రకరకాల క్రీడలు ఆడే అథ్లెట్లు అందరిపై ఈ అధ్యయనాన్ని చేశారు. క్రీడా పోటీలు జరగడానికి ముందు వీళ్ల చేత ఎనర్జీ డ్రింక్స్‌ను బాగా తాగించారు. ఎనర్జీ డ్రింక్స్‌ తాగిన తర్వాత క్రీడాకారుల ఆరోగ్య స్థితి ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. ఎనర్జీ డ్రింక్స్‌ తీసుకోవడం వల్ల అథ్లెట్ల క్రీడా పటిమ మూడు నుంచి ఏడు శాతానికి పెరిగినట్టు తేలింది.

అదే సమయంలో ఎనర్జీ డ్రింక్స్‌ తీసుకోవడం వల్ల క్రీడాకారుల్లో కొన్ని రకాల సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా తలెత్తాయని వెల్లడైంది. ఎనర్జీ డ్రింకులు తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య బాగా పెరిగినట్టు క్రీడాకారులు చెప్పారు. వారి నాడీ వ్యవస్థ కూడా బాగా బలహీనపడినట్టు ఇందులో తేలింది. ఎనర్జీ డ్రింకుల్లో కార్బోహైడ్రేట్లు, కెఫైన్‌, బి విటమిన్‌లు ఎక్కువగా ఉంటాయి. సాఫ్ట్‌ డ్రింకుల కన్నా ఎనర్జీ డ్రింకుల్లో శరీరానికి అందించే అదనపు ఎనర్జీ ఏమీ లేదట. కానీ వీటిల్లోని కెఫైన్‌ ఉత్ర్పేరకంగా పనిచేసి వారి క్రీడాపటిమను తాత్కాలికంగా పెంచుతుందని పరిశోధకులు తెలిపారు. కెఫైన్‌ పరిమాణం కూడా ఎనర్జీ డ్రింకుల్లో ఎక్కువగా ఉంటుందిట. అధిక మోతాదులో కెఫైన్‌, షుగరు ఉండడం శరీరానికి ఎప్పుడూ మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

జిమనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : energy drinks  caffine  hazardous  health  researchers  side effects  B vitamin  soft drinks  

Other Articles