Indian troops have shut pakistan s mouth

border firing, pakistan, india, jammu kashmir, pakistan rangers, bsf forces,, narendra modi, indian army

Indian troops have shut Pakistan's mouth

భారత్ ధీటైన జవాబుతో.. తోకముడిచిన పాక్ రేంజర్లు

Posted: 10/10/2014 05:02 PM IST
Indian troops have shut pakistan s mouth

అంతర్జాతీయంగా విపరీతమైన ఒత్తిడి వస్తుండటంతో గత తొమ్మిది రోజులుగా కాల్పులకు తెగబడిన పాకిస్థాన్ వెనక్కి తగ్గింది. జమ్ము కాశ్మీర్ సరిహద్దులో పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిచి గత కొద్ది రోజులుగా వరస దాడులకు పాల్పడుతన్న పాక్.. భారత్ సైన్యం నుంచి ధీటైన సమాధానం రావడంతో తోకముడించింది. అంతర్జాతీయ సరిహద్దుల్లో గత వారం రోజులుగా విపరీతంగా కాల్పులు, బాంబుదాడులకు పాల్పడుతూ పౌర ఆవాస ప్రాంతాల్లో కూడా భయాందోళనలు కలిగిస్తున్న పాకిస్థాన్ పై భారత్ సహా అన్ని దేశాలు విపరీతమైన ఒత్తిడి తెచ్చాయి.

కాగా, ఇప్పటికే అంతర్జాతీయ సరిహద్దుల్లో పాక్ రేంజర్ల వైపు నుంచి కాల్పులు భారీగా తగ్గినట్లు తెలుస్తోంది. బీఎస్ఎఫ్ దళాలు అంతలా తిరగబడతాయని కూడా పాక్ దళాలు ఊహించలేదు. వాస్తవానికి పాక్ బలగాల కంటే రెట్టింపు సంఖ్యలో సరిహద్దుల్లో భారత సైన్యం ఉంది. తొలుత కొంత ఊరుకున్నా.. ప్రధాని వైపు నుంచి దీటుగా స్పందించాలన్న సంకేతాలు రావడంతో భారీగా విరుచుకుపడ్డినట్లు సమాచారం. గత రాత్ర నుంచి జమ్మూలోని అంతర్జాతీయ సరిహద్దు సాంబాల జిల్లాలో దాడులకు పాల్పడలేదని బీఎస్ఎఫ్ అధికార ప్రతినిధి తెలిపారు. కతువా జిల్లాలోని 4 బీఎస్ఎఫ్ స్థావరాలపై మాత్రం ఉదయం కాల్పులు జరిగాయని, కాల్పుల్లో ఎవ్వరికీ గాయాలు కాలేదని వెల్లడించారు.

కాగా గత తొమ్మిది రోజులుగా పాక్ రేంజర్ల కాల్పుల్లో తొమ్మిది మంది భారత పౌరులు మృతి చెందగా, 13 మంది భద్రత అధికరులతో పాటు మొత్తం 90 మంది గాయపడ్డారని తెలిపారు. పాక్ రేంజర్ల కాల్పుల ధాటికి సరిహద్దులోని 113 పల్లెలు ఖాళీ అయ్యాయని, 32 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని ఆర్మీ అధికారులు తెలిపారు. తొక ముడిచిన పాక్ మరో చోట కాల్పులకు తెగబడవచ్చునని రాజస్థాన్ సరిహద్దులో బీఎస్ఎఫ్ బలగాలు గస్తీని ముమ్మరం చేశాయి.

భారత్ దాడుల బాధిత దేశం పాక్: షరీఫ్

ఇదిలావుండగా, పక్కనోడిని గిల్లి.. తానే ఏడ్చినట్టుంది పాకిస్థాన్ తీరు. గత తొమ్మిది రోజుల కాల్పులకు భారత్ నుంచి ధీటుగా సమాధానం లభ్యం కావడంతో.. తొకముడిచిన పాక్.. ఈ కాల్పలుకు భారతే కారణమని అసత్య ప్రచారం చేస్తోంది. భారత దేశం అకారణంగా దాడులు చేస్తోందని పాకిస్తాన్‌ ప్రధానమంత్రి నవాజ్‌ షరీఫ్‌ శుక్రవారం ఆరోపించారు. భారత్‌ దాడుల బాధిత దేశం పాకిస్తానేనని ఆయన వ్యాఖ్యానించారు. భారత్‌-పాక్‌ సరిహద్దుల్లో శాంతి నెలకొల్పడమే తమ లక్ష్యమని, దాన్ని బలహీనతగా భావించరాదని ప్రకటించారు. దీర్ఘకాలిక శాంతి కోసం సరిహద్దు వెంట కాల్పులను విరమిద్దమని అన్నారు.

ఇస్లామాబాద్‌లో త్రివిధ దళాధిపతులతో జాతీయ భద్రతా సమితి సమావేశం నిర్వహించిన అనంరతం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యాలు చేశారు.  గత పది రోజులుగా జరుగుతున్న కాల్పులు, ప్రతికాల్పుల నేపథ్యంలో పాకిస్తాన్‌ ఉన్నతాస్థాయి సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి. నిజానికి పాక్‌ సైనిక దాడులను భారత్‌ సేనలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. దీంతో పాక్‌ దళాలు కొంచెం వెనుకడుగు వేశాయి.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : border firing  pakistan  india  jammu kashmir  pak rangers  bsf forces  narendra modi  indian army  

Other Articles