Life after death is it true

medical study, clinically dead, evidence, experienced real events, State University of New York, University of Southampton, Dr Sam Parnia,

Life after death? is it True..? The man who officially died for three minutes but remembers everything

మరణించినా.. స్మృతి వీడిపోదా.. ఇది నిజమేనా..?

Posted: 10/09/2014 12:19 PM IST
Life after death is it true

మరణానంతర జీవితం.. ఏమవుతోంది..? మనిష స్మృతి ఎక్కడికి వెళ్తుంది. మనషి ఆత్మ ఎముతోంది. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలిసిన వారు ఎవరూ లేరు. పాతకాల వేదాంతుల దగ్గర్నుంచీ నవీనకాలంలోని శాస్త్రవేత్తల దాకా చాలా మంది దీని గురించి ఆలోచించిన వారే, పరిశోధనలు చేసినవారే. అయినా ఇప్పటి వరకు మనిషి అన్నవాడు మరణించిన తరువాత.. ఏమవుతాడు అన్నది గహ్రించలేకపోయాం.

ఈ విషయాన్న పక్కన బెడితే మనిషి గుండె కొట్టుకోవడం నిలిచిపోయిన మరుక్షఃణంలో అతిని మెదుడు కూడా పనిచేయడం అగిపోతుందని ఇన్నాళ్లు చెప్పిన వైద్య శాస్త్రంలో మరో కొత్తకోణం వెలుగుచూసింది. తాజాగా మరణానంతర జీవితంపై అధ్యయనం చేసిన యూనివర్సిటీ ఆఫ్‌ సౌతాంప్టన్‌ పరిశోధకులు.. మరణించిన తర్వాత కొంతకాలం వరకూ మనిషి జాగృతావస్థను కోల్పోడని కనుగొన్నారు. ముఖ్యంగా గుండెపోటు (హార్ట్‌ ఎటాక్‌)తో గుండె కొట్టుకోవడం కొంతసేపు నిలిచిన రోగుల్లో కొందరు వైద్యుల శ్రమతో తిరిగి బతికిబట్టకట్టారు.

అలా గుండె నిలిచిపోయి.. వైద్యుల శ్రమతో బతికిబట్టకట్టిన వారిపై నాలుగేళ్లుగా బ్రిటెన్ కు చెందిన వైద్యుల బృందం పరిశోధనలు చేస్తోంది. ఈ బృందంలో సభ్యురాలు, సంఘ సంస్కర్త అయిన పార్నియా సుమారుగా 2060 మంది హృద్రోగులపై అధ్యయనం చేశారు. బ్రిటెన్, అమెరికా, అస్ట్రియాలతో పాటు పలు దేశాలలో సేవలందించారు. అమె రోగులలో సుమారుగా 45 శాతం మంది హృద్రోగులు బతికి బట్టకట్టారని, వారిలో తొమ్మిది శాతం మంది మరణించిన అనంతరం ప్రాణం నిలపాలన్న పోరాట క్రమంలో వైద్యులు పడుతున్న పాట్లను వివరించారని తెలిపారు.

సాధారణంగా గుండె కొట్టుకోవడం ఆగిన 20 నుంచి 30 సెకన్లలో మెదడు కూడా నిర్వీర్యమవుతుందని వైద్యుల అభిప్రాయం. దీనికి భిన్నంగా.. వీరిలో గుండె కొట్టుకోవడం ఆగిన తర్వాత మూడు నిమిషాల వరకూ తమ చుట్టూ (తమ శరీరం చూట్టూ) జరుగుతున్న వాటిని చూసినట్లు వీరు తెలిపారు. తమ శరీరం నుంచి విడివడి తమ శరీరం పునరుజ్జీవనం పొందే క్రమాన్ని ఓ పక్కగా నిలుచుని చూసినట్లు కొందరు చెప్పారు. వారు చెప్పిన ప్రతి విషయాన్నీ తాము ఆస్పత్రి వైద్యులు సామ్‌ పార్నియాను కలిసి నిర్ధారించుకున్నామని సౌతాంప్టన్‌ పరిశోధకులు వివరించారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles