Man not eating from 13years

indian army, indian army jobs, defence jobs, latest news, iniyan, tamilnadu, indian army soldiers, gossips, water, vitamins in water, food, food calaries, food vitamins, how a man lives, man lives with out food

indian army ex soldier iniyan not taking food from 13years only drinking water : army ex soldier iniyan living with only drinking water from 13years says if any one practise they can also do this

తిండి తిప్పల్లేకుండా.., 13ఏళ్ళుగా

Posted: 10/07/2014 10:11 AM IST
Man not eating from 13years

ఒక మనిషి తినకుండా ఎన్ని రోజులు ఉండగలరు. రెండ్రోజులు, మూడ్రోజులు అంతకుమించి ఉంటే ఆస్పత్రికి తీసుకెళ్లటం తప్పనిసరి. లేకపోతే మామూలు మనిషి కాలేదు. కాని తమిళనాడుకు చెందిన ఇనియాన్ తిండి తినకుండా పదమూడేళ్లుగా బ్రతుకుతున్నాడు. 13సంవత్సరాలుగా కేవలం నీరు మాత్రమే తీసుకుంటూ., బ్రతుకుతున్నాడు. తమిళనాడులోని ఈరోడ్ జిల్లా గోబిశెట్టి పాళయంలో ఉండే ఇనియాన్ ను ఇప్పుడు స్థానికులంతా వాటర్ మ్యాన్ అంటున్నారు. నీరు తప్ప మరొక పధార్ధము.., పానియము తప్ప తీసుకోని ఇనియాన్ ను చూసి ఆశ్చర్యపోతున్నారంతా.

ఇనియాన్ తిండి మానేసింది డబ్బులు లేక కాదు.., రికార్డుల కోసం అంతకంటే కాదు. జీవితంపై విరక్తి పుట్టి చనిపోవాలనే ఆలోచనతో తిండి మానేశాడట. దీంతో పాటు దైవ చింతనతో తిండి తినకుండా పస్తులు ఉండటం అలవాటైపోయిందని చెప్తున్నాడు. అలా విరక్తితో తిండి మానేసిన ఇనియాన్ కు అదే అలవాటుగా మారింది. ఇలా ఆహారం తీసుకోకుండానే 13ఏళ్ళుగా జీవిస్తున్నాడు. రోజంతా నీరు మాత్రమే తాగి బ్రతుకుతున్నట్లు తనను కలిసిన వారికి నవ్వుతూ చెప్తున్నాడు. బయటకు వెళ్ళినా.., ఎవరైనా ప్రోత్సహించినా, బలవంతపెట్టినా ముద్ద ముట్టడు.

ఇక ఈ జలాహారంపై ఇతరులకు సలహాలు కూడా ఇస్తున్నాడు. కేవలం నీరు మాత్రమే తాగుతున్నా.., ఇప్పటివరకు తనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాలేదన్నారు. అంతేకాకుండా వయస్సు మీద పడుతున్నా ఆరోగ్యంగానే ఉన్నట్లు చెప్తున్నాడు. ఇక ప్రతి ఒక్కరూ సాధన చేస్తే తనలాగే జీవించవచ్చు అని ఘంటాపధంగా చెప్తున్నాడు. కావాలంటే ట్రై చేసి చూడండి కాని జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు. మరో విషయం ఏమిటంటే.., నీరు తీసుకుని బ్రతికి ఉండటంపై మన ఇనియాన్ ఇతరులకు ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడు. గ్రేట్ కదా., హ్యాట్సాఫ్ టు ఇనియాన్

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : food  water  tamilnadu  latest news  

Other Articles