Tamilnadu former cm jayalalitha spends more than 3 crores money for her son marriage

jayalalitha latest news, tamilnadu former cm jayalalitha news, jayalalitha son vn sudhakaran, sudhakaran marriage assets case, jayalalitha assets case, bangalore cbi court, bangalore cbi court judge john michael

tamilnadu former cm jayalalitha spends more than 3 crores money for her son marriage which is done in 1995

ఎంతపని చేశావ్ ‘జయమ్మ’! మరి అంత ఖర్చా?

Posted: 10/03/2014 09:04 PM IST
Tamilnadu former cm jayalalitha spends more than 3 crores money for her son marriage

ప్రస్తుతం అక్రమాస్తుల కేసులో జైలులో మగ్గుతున్న జయలలితకు సంబంధించి మరొక విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లవరకు ఎవరికీ తెలియని కొన్ని నిజాలు ఆమె అక్రమాస్తుల కేసును మరింత బలపర్చేకోణంలో కనిపిస్తున్నాయి. ఆమె తొలిసారి ముఖ్యమంత్రిగా వున్నప్పుడే లెక్కలేనన్ని డబ్బులు ఖర్చు చేశారని సీబీఐ కోర్టు బలంగా వాదిస్తోంది. అందుకు తగ్గ కొన్ని సాక్ష్యాధారాలను కూడా చూపిస్తోంది. అప్పట్లో ఆమె తన పెంపుడు కుమారుడు వీఎన్ సుధాకరన్ పెళ్లి కోసం భారీగానే ఖర్చులు చేశారని కోర్టు తెలుపుతోంది. కోర్టు చెబుతన్నట్టే ఆమె ఆనాడు తన కుమారుడి పెళ్లిని అంగరంగ వైభవంగా జరిపించారు. ఖర్చుకు ఏమాత్రం వెనకడుగు వేయకుండా భారీ సెట్లతో పెళ్లి వేదికను తీర్చి దిద్దారు ఆమె!

1995లో జరిగిన ఈ పెళ్లి.. అన్నింటికన్నా చాలా విలాసవంతమైనదిగా దాన్ని అందరూ చెప్పుకొన్నారు. అప్పట్లో జయలలిత పెళ్లికి పెట్టిన ఖర్చు దాదాపు మూడుకోట్ల రూపాయలని సీబీఐ కోర్టు తేల్చి చెప్పింది. ప్రస్తుతకాలంలో మూడుకోట్లంటే అంద పెద్ద మొత్తం కాకపోవచ్చుకానీ.. ఆనాటికాలంలో అది చాలా ఎక్కువే! అప్పటికి, ఇప్పటికి డబ్బు విలువలో తేడా దాదాపు పదినుంచి ఇరవై రెట్లు వరకు వుంటుంది. అంటే.. అప్పటి పది రూపాయలు.. ఇప్పుడు 200 రూపాయలతో సమానం.. లేదా అంతకంటే ఎక్కువే వుండొచ్చు. అటువంటి సమయంలో ఆమె కొడుకు పెళ్లికోసం ఏకంగా మూడుకోట్ల రూపాయలు ఖర్చుచేయడం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. తాంబూలం దగ్గరనుంచి అతిథులకు ఇచ్చిన విలువైన బహుమతుల వరకు భారీ మొత్తంలోనే ఆమె ఖర్చు చేశారని సీబీఐ కోర్టు తెలిపింది.

ఈ కేసులో ఏ-1 నిందితురాలైన జయలలిత, ఎ-3 నిందితుడైన సుధాకరన్ పెళ్లి కోసం భారీ మొత్తాన్ని ఖర్చు చేశారని, అతిథులకు ఇచ్చిన బహుమతులతో సహా అన్ని ఖర్చులను పరిగణనలోకి తీసుకునే ఆనాటి ఖర్చును తెలియజేశామని సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి జాన్ మైఖేల్ డికున్హా తెలిపారు. అయితే ఈ ఖర్చునంతటినీ భరించింది పెళ్లి కూతురి కుటుంబమేనని నిందుతులు చెప్పడాన్ని ఆయన సమర్థవంతంగా తిరస్కరించారు. ఈ మూడుకోట్ల ఖర్చుతోపాటు వీఐపీలను పిలిచి, వాళ్లకు హోటళ్లలో బస ఏర్పాటుచేశారని.. ఆ ఖర్చులన్నింటినీ జయలలితే భరించారని అన్నారు. కేవలం పెళ్లిలో మండపం ఖర్చే దాదాపు రూ. 5.21 కోట్లు అయ్యిందని ప్రాసిక్యూషన్ వాదించింది.

దీంతో జయమ్మ అక్రమాస్తుల కేసు మరింత బలపడే అవకాశాలు తీవ్రంగా వున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. జయమ్మకు సంబంధించిన విషయాలు ఇలా ఒక్కొక్కటిగా బయటపడితే.. ఆమె ఇప్పటిలో బెయిల్ మీదే బయటికొచ్చే అవకాశాలు చాలా తక్కువగా వున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇంకా ఇటువంటి ఖర్చులు జయమ్మ వేటిమీద వెచ్చించారోనంటూ చెప్పుకుంటున్నారు. సీబీఐ కోర్టు ఇలాగే తవ్వుకుంటూపోతే.. ఇతర ఖర్చు వ్యవహారాలు కూడా బయటపడే వీలుంది. మరి ఈ వ్యవహారాల నుంచి జయమ్మ ఎలా బయటపడతారోనంటూ అందరూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalitha assets case  vn sudhakaran marriage  bangalore cbi court  

Other Articles