Angry mob tries to set alight bihar minister

vinay bihari, bihar minister, mob, burn alive, Bihar, cabinet minister, Art Culture and Youth Affairs, Tarachandi temple, Navaratra

Angry mob tries to set alight Bihar minister at Navratra celebrations

వామ్మో..! వీళ్లేం జనం రా నాయనో..!

Posted: 10/01/2014 04:43 PM IST
Angry mob tries to set alight bihar minister

వామ్మో.. వీళ్లేం జనం రా నాయనో..! అంటే సర్గీయ ధర్మవరపు సుబ్రమణ్యం నోటి నుంచి జాలువారిన ఏదో సినిమా డైలాగ్ అనుకుంటున్నారా..? ఎంతమాత్రము కాదు ఇది బీహార్ సాంస్కృతిక శాఖా మంత్రి వినయ్ బిహారీ నోటి నుండి ఇప్పుడు పదే పదే జాలువారుతున్న మాట. ఎందుకంటే ఆయన కొద్దిలో సజీవ దహనం నుంచి తప్పించుకున్నారు కాబట్టి. బీహార్ రాజధాని పాట్నాకు 150 కిలోమీటర్ల దూరంలోని రోహ్తాస్ జిల్లా ససారం ప్రాంతంలోని ప్రఖ్యాత తారాచాందీ ఆలయంలో ఈ ఘటన జరిగింది

జిల్లా కలెక్టర్, ఎస్పీ అందరూ ఉండగానే.. వాళ్లందరి ఎదురుగానే బీహార్లో ఓ కేబినెట్ మంత్రిని సజీవంగా దహనం చేయడానికి ప్రజలు ప్రయత్నించారు. ప్రఖ్యాత తారాచాందీ ఆలయంలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలను మంత్రి వినయ్ బీహారీ ప్రారంబించారు.. స్వతహాగా జానపద గాయకుడు కావడంతో ఆయనే ఈ కార్యక్రమం ప్రారంభించిన అనంతరం కొన్ని భక్తి పాటలు పాడారు. అయన తరువాత ప్రముఖ భోజ్ పురి గాయకుడు పవన్ సింగ్ గీతాలను ఆలపిస్తుండగా, పాటలు సరిగా వినబడటం లేదని, భక్తులకు కూర్చొనే ఏర్పాట్లు అధ్వానంగా చేయారని ఆరోఫిస్తూ అక్కడి ప్రజలు నిరసన తెలిపారు. దీంతో కొందరు కుర్చీలను వేదికపైకి విసిరారు.

ఎస్పీ చందన్ కుమార్ కుష్వాహా మీద కూడా ఓ కుర్చీ పడటంతో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన ప్రజలు.. ఇటుకలు రాళ్లు విసిరి, వాహనాలకు నిప్పు పెట్టారు. మంత్రి గారు, అధికారులు వేదిక కింద దాక్కున్నారు. తాను రెండు గంటల పాటు అక్కడ దాక్కుని ఉండకపోతే.. అక్కడి ప్రజలు ఆగ్రహంతో తనను సజీవంగా దహనం చేసేవారని అన్నారు. అక్కడి జనం విసిరిన రాళ్లు తగలడంతో మంత్రి తలపై, గడ్డంపై గాయాలయ్యాయి. సంఘటన జరిగిన చాలా సమయం తర్వాత కూడా ఆయన బెదిరిపోయినట్లే కనిపించారు. కొంతమంది వ్యక్తులు పెట్రోలు క్యాన్లు పట్టుకుని తన కోసం చూస్తున్నారని చెప్పారు. అక్కడే ఉండి చచ్చిపోయే కంటే పారిపోయి ప్రాణాలు కాపాడుకోవడం మంచిదని తనకు అనిపించినట్లు తెలిపారు. తాను దొరకలేదని తన అధికార వాహనానికి నిప్పు పెట్టారని అన్నారు.

ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయని,  ముందుగా ప్లాన్ చేసే మంత్రిపై దాడికి యత్నించారని ఎస్పీ కుష్వాహ అన్నారు. దాడికి పాల్పడిన వారిలో ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని, మిగిలిన వారి కోసం పోలీసు బృందాలు తనిఖీలు చేస్తున్నాయన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vinay bihari  bihar minister  mob  burn alive  Bihar  cabinet minister  Tarachandi temple  Navaratra  

Other Articles