Thank you america says pm modi

Narendra Modi, US, America, Barack Obama, syria, US tour, attacks on isis

Thank you America, says PM Modi after hugely successful visit

అమెరికా నుంచి తిరుగు పయనమైన ప్రధాని.

Posted: 10/01/2014 01:16 PM IST
Thank you america says pm modi

శతకోటి మంది భారతీయుల భారీ అంచనాల నడుమ ఐదు రోజుల అమెరికా పర్యటనకు వెళ్లిన ప్రధాని నరేంద్రమోడీ.. తన పర్యటనను ముగించుకుని స్వదేశానికి తిరుగు పయనం అవుతున్నారు. ఈ సందర్భంగా చివరిసారిగా అమెరికాలోని భారత వ్యాపారవేత్తల మండలి ఏర్పటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధ్యాంకూ అమెరికా అంటూ అక్కడి వారితో పాటు భారత అమెరికన్లను కూడా అకట్టుకున్నారు. అమెరికా పర్యటన భారీ విజయోత్సవ పర్యటనగా అభివర్ణించిన మోడీ.. అక్కడి ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మాడిసన్ స్క్వేర్ లోని రాక్ స్టార్ నుంచి శ్వేత సౌధంలోని అమెరికా అగ్రరాజ్య అద్యక్ష్యడు బరాక్ ఒబామా తనకిచ్చిన విందు వరకు ప్రధాని మోడీతో ప్రత్యేకత సంతరించుకుంది. బరాక్ ఒబామా తనదైన శైలిలో అతిథ్యాన్ని అందించారని మోడీ కొనియాడారు.

మరోవైపు అమెరికా పర్యటనకు వెళ్లి, అక్కడి వాళ్లను పెట్టుబడులు పెట్టాలంటూ ఆహ్వానించి, ప్రభుత్వంతో కూడా విస్తృతస్థాయి చర్చలు జరిపిన మోదీ.. సిరియాలో ఐఎస్ మీద దాడుల విషయంలో మాత్రం తన విధానాన్ని కుండ బద్దలుకొట్టినట్టు చెప్పేశారు. దాడులకు తాము ఎలాంటి సాయం చేయబోమని, అయితే ఉగ్రవాదం మీద పోరాటానికి మాత్రం తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

90 నిమిషాల పాటు సాగిన ద్వైపాక్షిక చర్చల్లో ఉగ్రవాదం వల్ల తలెత్తుతున్న సమస్యలపై కూడా మోదీ చర్చించారు. అంతర్జాతీయ అంశాల్లో చాలా సంక్లిష్టత ఉంటుందని, తాము ప్రస్తుతం దక్షిణాసియాతో పాటు పశ్చిమాసియాలో వస్తున్న ఉగ్రవాద సవాళ్లపై కూడా చర్చించామన్నారు. ఉగ్రవాద, నేర నెట్వర్కుల స్వర్గధామాలను కూల్చేయడానికి సంయుక్తంగా ప్రయత్నాలు చేయడానికి అమెరికా, భారత్ అంగీకరించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. సిరియా మీద దాడుల విషయంలో మాత్రం భారత్ కలగజేసుకోదని విదేశాంగ శాఖ సీనియర్ అధికారి విక్రమ్ దొరైస్వామి తెలిపారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Narendra Modi  US  America  Barack Obama  syria  US tour  attacks on isis  

Other Articles