Oil prices may come down slighty

Diesel Price, Reduction, Five years, Dharmendra Pradhan, Narendra Modi, Assembly Elections

oil prices may come down slighty, diesel price is likely to be cut reduction in over five years

వాహనదారులకు శుభవార్త, తగ్గనున్న ఇంధన ధరలు

Posted: 09/30/2014 05:47 PM IST
Oil prices may come down slighty

వాహనదారులకు చమురు సంస్థలు దసరా కానుకను అందించనున్నాయి. అవునండీ.. పండుగలు, పబ్బాలని చూడకుండా ఎడాపెడా ఇంధన చార్జీలు పెంచే ఆయిల్ సంస్థలు ఇప్పడు పండుగలకు కానుకలను అందించనున్నాయి. ఏదో బంపర్ అపర్ ఇస్తున్నాయనో, లేక తమ పెట్రోల్ బంకులోనే ఆయిల్ పోయించుకున్న వారకి పారితోషకం ఇస్తామనో కాదండి.. దసరా సందర్భంగ పెట్రోల్ ధరలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకోనున్నాయి. ఇందులో విచిత్రమేముందని అనుకుంటున్నారా..?

పెట్రోల్ సహా డీజిల్ ధరను కూడా తగ్గించేందుకు చమురు కంపెనీలు పరిశీలిస్తున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి.  లీటర్ డీజిల్ ధరపై ఒక్క రూపాయిని తగ్గించే అంశాన్ని ఆయల్ సంస్థలు పరిశీలించడంతో గత ఐదేళ్లలో ఇదే తొలిసారి అవుతుందని బిజినెస్ అనలిస్టులు అంటున్నారు. 2009 జనవరి 29 తేదిన లీటర్ డిజీల్ ధర 1.75 తగ్గింది. ఆ తరువాత క్రమంగా పెరుగుతూనే వస్తుంది. గత యూపీఏ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పెట్రోల్ ధరలో ఎగుడు, దిగుడు పరిస్థితులున్నా.. డీజిల్ ధర మాత్రం ప్రతీ నెల యాభై పైసల మేర పెరుగుతూనే వచ్చింది.  అంతర్జాతీయ దిగుమతి, రిటైల్ ధరకు ప్రస్తుత వ్యత్యాసం భారీగా ఉండటంతో చమురు ధరను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
 
అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరలు గణనీయంగా తగ్గడంతో దేశీయ చమురు కంపెనీలు డీజిల్ ధరను తగ్గించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు భేటి కానున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో చమురు ధరల పరిస్థితులను వివరిస్తూ ప్రధాని నరేంద్రమోడికి లేక రాశామని, అలాగే మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల నేపథ్యంలో డీజిల్ ధర తగ్గింపుపై ఎన్నికల కమిషన్ కు తెలిపామని కేంద్ర పెట్రోలియం శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Diesel Price  Reduction  Five years  Dharmendra Pradhan  Narendra Modi  Assembly Elections  

Other Articles