Modi speech in newyork

modi, narendra modi, narendra modi latest, modi gossips, latest news, narendra modi america tour, modi speech, andhrapradesh, telangana, central government, modi latest speech, modi newyork speech, uno, modi on pakisthan

prime minister of india narendra modi speech in madisan square in newyork : modi called all indians to come for win the world and also promises the world that he make india as the production house for experts

న్యూయార్క్ లో టార్గెట్లను ప్రకటించిన మోడి

Posted: 09/29/2014 08:31 AM IST
Modi speech in newyork

ప్రధాని నరేంద్రమోడి తను అనుకున్న లక్ష్యాలను అమెరికాలో ప్రకటించారు. న్యూయార్క్ లో ప్రజలను ఉద్దేశించి మాడిసన్ స్క్వేర్ లో మోడి ప్రసంగించారు. ఈ సభకు ప్రవాస భారతీయులతో పాటు భారత సంతతి వ్యక్తులు, విదేశీయులు కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యారు మోడి స్పీచ్ విని వారంతా మంత్ర ముగ్దులయ్యారు. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత శక్తులను తెలుపుగూ సాగిన మోదీ ప్రసంగ మాటలు ప్రతి ఒక్కరి హృదయాన్ని తాకాయి. ప్రతి మాటకూ చప్పట్లు మారుమోగాయి.మోదీ నామస్మరణతో మేడిసన్  స్క్వేర్  హోరెత్తిపోయింది.  దాదాపు 20 వేల మంది ప్రత్యక్షంగా.. ప్రపంచవ్యాప్తంగా మరెంతో మంది పరోక్షంగా ప్రధాని ప్రసంగాన్ని ఆసక్తిగా ఆలకించారు. ఉపవాసాన్ని ఆచరిస్తున్నప్పటికీ ఆయన నవయువకుడిగా మారిపోయి ప్రసంగించారు. 

జన్‌ధన్ యోజన, స్వచ్ఛభారత్, మేకిన్ ఇండియా, అందరికీ ఇళ్లు వంటి పథకాల ఆవశ్యకతను వెల్లడించారు. మోడి ప్రసంగంలో ఏమన్నారంటే ‘దేశంలో బ్యాంకింగ్ రంగం ఎంతో విస్తరించినప్పటికీ ఇంకా 50 శాతం మంది కుటుంబాలకు ఖాతాలు లేవు. పేదలకు బ్యాంకు అకౌంట్లు ఉండాలనే జన్‌ధన్ పథకాన్ని ప్రారంభించాం. ఇప్పటికే 4 కోట్ల మందికి ఖాతాలు తెరిచాం. జీరో బ్యాలెన్స్ ఖాతాలను తెరుస్తామని చెప్పాం. కానీ జనం ఆ ఖాతాల్లో రూ. 1,500 కోట్లు జమ చేశారు. ప్రైవేటుగా రుణాలు తీసుకునే పేదలను వడ్డీ వ్యాపారులు దోచుకుంటున్నారు. ఇక తగినన్ని మానవ వనరులు, తక్కువ రేట్లకే ఉత్పత్తి కావాలంటే మీ గమ్యం భారతే. ఇందుకు పాలనా వ్యవస్థను సులభతరం చేస్తున్నాం. పనికిరాని చట్టాలను తొలగిస్తున్నట్లు  ఆయన పేర్కొన్నారు. భారత భవిష్యత్తు మార్చడానికి మాతో కలిసిరండి’ అని పిలుపునిచ్చారు.

అమెరికాలో స్థిరపడిన భారతీయులను మోదీ ప్రశంసల్లో ముంచెత్తారు. పాములను ఆడించే దేశంగా ప్రపంచానికి తెలిసిన భారత్‌ను ప్రపంచవ్యాప్తంగా గుర్తించేలా చేశారని ప్రస్తుతించారు. ఇప్పుడు మనం ‘మౌస్’తో ఆడుకుంటున్నామని చమత్కరించారు. భారత అభివృద్ధిలో మీ పాత్ర ప్రధానమైనది’ అని భారతీయ అమెరికన్లను ఉద్దేశించి మోదీ వ్యాఖ్యానించారు.  భారతీయులు దేశం గురించి ఎన్నో ఆశలు, అంచనాలు పెట్టుకున్నారు. వాటిని నెరవేర్చడంలో మేం కచ్చితంగా విజయం సాధిస్తామన్నారు. ఇక ప్రవాస భారతీయులకు పలు నజరానాలు ప్రకటించారు. పీఐవో కార్డులు ఉన్నవారికి వీసాల సమస్యలను తొలగించనున్నట్లు తెలిపారు. వారికి జీవితకాల వీసాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. అలాగే పీఐవో, ఓవర్‌సీస్ సిటిజన్‌షిప్ ఆఫ్ ఇండియా(ఓసీఐ) స్కీములను కలుపుతున్నట్లు ప్రకటించారు. అలాగే భారత పర్యటనకు వచ్చే అమెరికన్లకు వీసా ఆన్ అరైవల్ అమలు చేస్తామన్నారు.

భారత్ లో నైపుణ్యాల అభివృద్ధి కోసం సహకరించాలని ఎన్‌ఆర్‌ఐలకు పిలుపునిచ్చారు. స్వాతంత్య్ర ఉద్యమం వచ్చినట్టే ఇప్పుడు అభివృద్ధి ఉద్యమం రావాలన్నారు. 2020కల్లా ప్రపంచమంతా ముసలివాళ్లతో నిండుతుంది. అప్పుడు భారతదేశమే ప్రపంచానికి వారికి మానవ వనరులను అందించే ప్రాంతంగా ఎదుగుతుందన్నారు. యువశక్తిని ఉపయోగించుకుని ప్రపంచాన్నే జయిస్తాం’ అని ప్రధాని స్పష్టం చేశారు. దేశంలోని 40 శాతం మంది ప్రజల ఆర్థిక ప్రతినిధి గంగానదేనన్నారు. గంగ ప్రక్షాళన ద్వారా వారందరి జీవితాల్లోనూ మార్పు వస్తుందన్నారు. 2019 గాంధీ జయంతి నాటికి దేశంలో ఇల్లులేని కుటుంబం ఉండకూడదన్నది తన కల అని మోడి ప్రకటించారు.


మేడిసన్ స్క్వేర్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎన్‌ఆర్‌ఐలు, అమెరికన్లు భారీగా తరలివచ్చారు.  సీట్లన్నీ నిండిపోయాయి, బయట ఉన్న వారి కోసం ప్రత్యేకంగా స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రసంగానికి ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. భారతీయ సాంప్రదాయ నృత్యాలు, పాటలతో కళాకారులు ప్రదర్శనలిచ్చారు. పలువురు అమెరికన్ కాంగ్రెస్ సభ్యులు కూడా దీనికి హాజరయ్యారు. మోదీ నామస్మరణతో మేడిసన్  స్క్వేర్  లోపలాబయటా  హోరెత్తిపోయింది.

 

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  newyork  latest news  us tour  

Other Articles