No plans to raise pds grain supply

Food handouts, Food welfare programme, Ram Vilas Paswan, Food Minister, Food grains

No plans to raise PDS grain supply from 5kg to 7kg: Paswan

సబ్సీడీ ఆహార ధాన్యాల కోటాను పెంచలేం..

Posted: 09/23/2014 04:49 PM IST
No plans to raise pds grain supply

సబ్సీబీ కింద ప్రజలకు అందిస్తున్న ఆహార ధాన్యాలను పెంచే యోచన ప్రభుత్వానికి లేదని కేంద్ర ఆహార శాఖా మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ అన్నారు. ప్రస్తుతం ప్రతి వ్యక్తికి నెలసరి కోటా కింద లభిస్తున్న ఆహార ధాన్యాలను 5 నుండి 7 కేజీలను పెంచుతున్నారన్న వార్తలను అయన తోసిపుచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వానికి అలాంటి ఆలోచన లేదన్నారు. ఆహార భద్రతా బిల్లు కింద ప్రతీ వ్యక్తి 5 నుంచి 7 కేజీలకు కోటా పెరగాల్సిన ఉన్నా.. ఇప్పుడు ప్రభుత్వానికి అటోచన లేదన్నారు. ఆహార భద్రతా బిల్లు దేశంలోని మూడింట రెండోంతుల మందికి ఆహారధాన్యాలను సబ్సీడీ కింద అందించే లక్ష్యమే వుందన్నారు.

ఈ చట్టం కింద ప్రతీ అర్హుడైన వ్యక్తికి 5 కేజీల బియ్యం, మూడు కేజీల గోధుమలను సబ్సీడీ ధరల కింద అందిస్తున్నామని చెప్పారు. అంత్యోధయ అన్న యోజన లబ్దిదారు కుటుంబాలకు, అతిపేద కుటుంబాలకు నెలకు 35 కేజీల ఆహారధాన్యాలను సబ్సీడీ ధరల కింద అందిస్తున్నామని కేంద్రమంత్రి చెప్పారు. గుజరాత్ వంటి రాష్ట్రాల నుంచి అర్హులైన వ్యక్తులకు సబ్సీడీ ఆహార ధాన్యాలను ఐదు కిలోల నుంచి ఏడు కిలోలకు పెంచాలన్న డిమాండ్ వస్తుందని, అయితే ప్రస్తుతానికి పెంచే యోచన లేదన్నారు.

ఆహార భద్రతా చట్టం కింద కేంద్ర ప్రభుత్వం వద్ద ప్రస్తుతం నిల్వ సామర్థ్యంగా 75.8 మిలియన్ టన్నుల ఆహార ధాన్యలు కాగా, వాటిలో ప్రతీ నెల 61 మిలియన్ టన్నలును పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుత ఏడాది దేశ వ్యాప్తంగా బియ్యం, గోధుమల ఉత్పత్తి 200 మిలియన్ టన్నలని పాశ్వాన్ తెలిపారు. ప్రస్తుతం కేవలం ఐదు రాష్ట్రాలు మాత్రమే ఆహార భద్రతా చట్టాన్ని సంపూర్ణంగా అమలు చుస్తుండగా, మరో ఆరు రాష్ట్రాలు మాత్రం అసంపూర్ణంగా అమలు చేస్తున్నాయన్నారు. సుమారు 25 రాష్ట్రాలతో పాటు పలు కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా ఆహార భద్రతా చట్టాన్ని అమలుపర్చాల్సి వుందని చెప్పుకోచ్చారు.


జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Food handouts  Food welfare programme  Ram Vilas Paswan  Food Minister  Food grains  

Other Articles