Floods wreak havoc in assam meghalaya

Assam, Assam floods, Assam flood alert, Guwahati, BSF, NDRF, Meghalaya

Floods wreak havoc in Assam, Meghalaya; 10 dead, alert sounded

ఈశాన్య రాష్ట్రాల్లో వరుణ బీభత్సం, 10 మంది మృతి

Posted: 09/23/2014 11:14 AM IST
Floods wreak havoc in assam meghalaya

ఈశాన్య రాష్ట్రాల్లో వరణుడు బీభత్సాన్ని సృష్టిస్తున్నాడు. పలకరించడం లేదని బాధపడిన రైతనన్ను.. రుతపవానాల చివరాకన వచ్చి నిలువునా ముంచుతూ.. వందలాది ప్రాణాలను బలిగొన్నాడు. దక్షిణాది నుంచి ప్రారంభించిన బీభత్సం. మధ్య ఉత్తర భారతాల్లో కొనసాగిస్తూ.. ఇప్పడు ఈశాన్య రాష్ట్రాలపై ప్రతాపం చూపుతున్నాడు. జమ్మూకాశ్మీర్ లో వందలాది మందిని బలి తీసుకుని, వేలాది మందిని నిరాశ్రయులను చేసి విలయ తాండవం చేసిన వరుణుడు.. తాజాగా అస్సోం, మేఘాలయ రాష్ట్రాల్లో జల వలయాన్ని సృష్టిస్తున్నాడు.

వరుణడి బీభత్సానికి అస్సోం, మేఘాలయ రాష్ట్రాల్లోని గోల్పురా, లఖ్మీపూర్, కామ్ రూప్, గోహతి జిల్లాల్లో వరదలు పోంగిపోర్లుతున్నాయి. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు, నదులు ప్రమాదస్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. అనేక గ్రామాలు జలమయం కాగా, పలు గ్రామాలకు వెళ్లే దారులు నీటిలో మునిగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పలు జిల్లాల్లో జనజీవనం పూర్తిగా స్థంభించింది. గోల్పురా, లఖ్మీపూర్, కామ్ రూప్ జిల్లాల్లో రవాణా, టెలి కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా దెబ్బతినింది. పలు చోట్ల కొండచరియలు విరిగి పడ్డాయి. దీంతో పలు రహదారుల్లో ప్రయాణానలను అధికారులు నిలిపివేశారు

వరదల్లో చిక్కుకున్న వారని రక్షించేందుకు ఆర్మీ, బార్డర్ సెక్యూరిటీ పోర్స్ దళాలతో పాటు జాతియ విపత్తు నివారణా సంస్థ బృందాలు రంగంలోకి దిగాయి. జిల్లా యంత్రాంగంతో కలసి పనిచేస్తూ.. సత్వర చర్యలకు పూనుకుంటున్నారు. వరదల్లో చిక్కుకున్న 100 గ్రామాల నుంచి సుమారు 50 వేల మందిని సురక్షిత స్థావరాలకు తరలించామని అధికారులు తెలిపారు. పలు గ్రామాల్లో ఏడు నుంచి ఏనమిది అడుగుల మేర వరదలు పొంగిపొర్లడంతో అనేక పూరిళ్లు కొట్టుకుపోయాయని అధికారులు తెలిపారు. వరదల్లో  చిక్కుకుని ఇప్పటి వరకు పది మంది మృతి చెందారని అధికారులు వెళ్లడించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Assam  Assam floods  Assam flood alert  Guwahati  BSF  NDRF  Meghalaya  

Other Articles