Why errabelli met kcr in midnight

telangana, telangana government, telangana latest, kcr, trs, telangana logo, latest news, my homes, lt, metro rail, l and t company, hyderabad metro rail, metro rail jobs, errabelli dayakar rao, revanth reddy, revanth reddy on kcr, errabelli met kcr

tdp leader errabelli dayakar rao met telangana cm kcr at midnight in his home with out gunman : kcr insists tdp leader errabelli dayakar rao not to over respond on my homes issue

ఎర్రబెల్లి కేసీఆర్ ను ఎందుకు కలిశాడంటే..

Posted: 09/23/2014 07:31 AM IST
Why errabelli met kcr in midnight

టీడీపీ సీనియర్ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు కేసీఆర్ ను కలవటం సంచలనం కల్గిస్తోంది. అర్ధరాత్రి.., గన్ మెన్ లేకుండా ఒక్కడే వచ్చి కేసీఆర్ ను కలవటం తెలుగు రాష్ర్టాల రాజకీయ నేతల మద్య చర్చనీయాంశమైంది. టీ.టిడిపిలో నెంబర్ 2 స్థానంలో ఉన్న వ్యక్తి.., నిత్యం విమర్శలు చేసే కేసీఆర్ ను రహస్యంగా కలవటం వెనక.. ఇండ్ల కంపనీ ఉన్నట్లు బోగట్టా. విషయం ఏమిటంటే..ప్రస్తుతం తెలంగాణలో మెట్రోరైలుపై రభస నడుస్తోందని తెలుసు. కేసీఆర్ తెలంగాణను నాశనం చేస్తున్నాడని.. మెట్రో కంపనీ ఎల్&టికి గచ్చిబౌలి దగ్గర ఇచ్చిన భూమి తీసుకుని మై హోమ్స్ కు ఇచ్చారని ప్రతిపక్షాలు తెగ దుమ్మెత్తిపోస్తున్నాయి.

ఇక టీడీపీ నేత రేవంత్ రెడ్డి విమర్శల గురించి ప్రత్యేకంగా చెప్పాలి. కేసీఆర్ మై హోమ్స్ మద్య సంబంధం ఏమిటి అని ఆయన సూటిగా ప్రశ్నిస్తుంటే గులాబి దండు బచ్చాగాడు అంటూ విమర్శలు చేస్తోంది తప్ప సమాధానం చెప్పలేకపోతుంది. అంతలా ఇబ్బంది పెడుతున్నాయి రేవంతుడి మాటలు. ఇక మై హోమ్స్ అధినేత మన ఎర్రబెల్లి గారికి సన్నిహితుడు.., బంధువు కూడా. ఇండ్లుకట్టే అలవాటున్న వీరికి ఎన్నికల సమయంలో ఎర్రబెల్లికి అండగా ఉంటే అలవాటు కూడా ఉందని గచ్చిబౌలిలో గుసగుసలు విన్పిస్తున్నాయి. అందువల్ల ఈ వివాదంపై రేవంత్ రెచ్చిపోతే.. ప్రభుత్వం తలొగ్గాల్సి వస్తే.. నష్టపోయేది మైహోమ్స్ కంపనీయే అని చెప్పటానికి పిలిపించినట్లు సమాచారం.

అటు మై హోమ్స్ గులాబివర్గానికి కూడా దగ్గరి చుట్టమే అని చెప్పుకుంటున్నారు. తెలంగాణ వచ్చినా కాంగ్రెస్ తో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకోవద్దు అని కేసీఆర్ బలంగా నిర్ణయం తీసుకునేలా హోమ్ సంస్థ అధినేత కృషి చేశారట. ఇక ఎన్నికల సమయంతో అయితే వారికి తోచినవిధంగా ప్రత్యేక పార్టికి సాయం చేసినట్లు అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. ఇది అయితే ఆ ఇంటివారికే తెలియాలి మరి. అటు ముగ్గురి సామాజిక వర్గాలు కూడా ఒకటే కావటం విశేషం. అందువల్ల ఎర్రబెల్లితో మాట్లాడి టీఆర్ఎష్ నేతలు పిల్లాడిగా భావిస్తున్న రేవంత్ ను కాస్త కంట్రోల్ లో ఉండమని చెప్పారని తెలుస్తోంది.

ఇక పార్టీలో చేరికపై కూడా చర్చ జరిగినట్లు ప్రచారమైతే జరుగుతోందనుకోండి. ఇది నిజమైనా పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతం టీడీపీ తెలంగాణలో గతంలో మాదిరిగా బలంగా లేదు. కారు ఢీ: కొడితే సైకిల్ చక్రం బెండ్ అయినంత పనయింది. అలాంటి సైకిల్ పట్టుకుని ఎంతదూరం సవారీ చేస్తామని దయాకర్ సార్ ఆలోచిస్తున్నారు. ఈ కారణంగా కేసీఆర్ ను కలిసిన సందర్బంగా ఇద్దరూ నేతలు చేరిక, చేర్చుకోవటంపై చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీపై ఉన్న అసంతృప్తి.. కారుతో పాటు వచ్చే హోదాపై క్లారిటి వస్తే.. ఎర్రబెల్లి రెడి ఫర్ టీం గులాబి అన్నమాట. ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడు, ఏం జరుగుతుందో ఎవరూ అంచనా వేయలేరు కదా..!!

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  errabelli  kcr  latest news  

Other Articles