Telangana cm kcr good news to farmers waivers loans

telangana cm kcr, kcr latest news, kcr waivers loans, telangana farmers, farmers waivers loans, agriculture minister pocharam srinivas reddy, cm kcr latest press meet

telangana cm kcr good news to farmers waivers loans : finally cm kcr takes decision on telangana farmers waivers loans

తెలంగాణ రైతులకు కేసీఆర్ షాకింగ్ వార్త!

Posted: 09/22/2014 07:36 PM IST
Telangana cm kcr good news to farmers waivers loans

(Image source from: telangana cm kcr good news to farmers waivers loans)

తెలంగాణ రైతు రుణాలను మాఫీ చేయిస్తామంటూ సార్వత్రిక ఎన్నికల నుంచి ఊరిస్తూ వచ్చిన సీఎం కేసీఆర్... చివరగా ఆ అంశంపై ఒక క్లారిటీ ఇచ్చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి వందరోజులు పూర్తి చేసుకున్నప్పటికీ రైతు రుణమాఫీపై కేసీఆర్ పెదవి విప్పకపోవడంతో నిరసనలు చేపట్టిన రైతన్నలకు ఇన్నాళ్లకు ఒక వార్త ఊరట కలిగించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాటినుంచి అప్పడూ, ఇప్పుడంటూ దాటవేస్తున్న రైతురుణమాఫీ అమలు చేస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించేశారు. లక్షరూపాయల రైతు రుణాలనుమాఫీ చేస్తూ తెలంగాణ సీఎం కేసీఆర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు. రుణమాఫీ అంశంపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికను ఆమోదించిన సీఎం.. 17వేల కోట్ల రుణమాఫీకి సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇందులో తొలివిడతగా 4,250 కోట్ల రూపాయల విడుదలకు వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. అనంతరం ఈ విషయంపై మాట్లాడిన ఆయన.. ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయం రైతులకు ఊరట కలిగిస్తుందని పేర్కొన్నారు. రైతు రుణాలను బ్యాంకులు రెన్యూవల్ చేస్తాయని, పంట బీమా సౌకర్యం కోల్పోకుండా తొందరగా నిర్ణయం తీసుకున్నామని ఆయన తెలిపారు. రుణమాఫీపై మంగళవారం మంత్రివర్గ ఉపసంఘం బ్యాంకర్లతో భేటీ కానుందని సమాచారం! ఈ భేటీ తర్వాత వెంటనే రుణమాఫీలు అమలయ్యేలా చర్యలు తీసుకోనున్నట్టు అధికారులు తెలుపుతున్నారు.

ఇదిలావుండగా.. ఈ రుణమాఫీ గురించి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివారెడ్డి మాట్లాడుతూ.. రైతు రుణమాఫీ నిధులను బ్యాంకులకు నాలుగు విడతలుగా విడుదల చేస్తామని తెలిపారు. రైతు రుణమాఫీని తక్షణమే అమలు చేసి.. రైతులకు ఖరీఫ్ రుణాలు అందేలా చేస్తామని అన్నారు. మంగళవారం బ్యాంకర్లతో జరిగే చర్చల్లో రైతులకు రుణాలు అందజేయడం, పాత పాత రుణాలు మాఫీ చేయడంపై సమగ్రంగా చర్చిస్తామని ఆయన తెలిపారు. అలాగే సీఎం కేసీఆర్ రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తారని ఆయన వెల్లడించారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles