High court angers on telangana government s fast scheme

telangana, telangana government, telangana latest, kcr, trs, telangana logo, latest news, andhrapradesh, fast, fast scheme, fees reimbursement, latest news, high court, pititions, students, eamcet

highcourt at hyderabad angers on telangana government's decission on fast scheme : hyderabad highcourt seriously warns telangana government on fast scheme asks to review the government order

ఫాస్టు పధకం ఫాసిజమే అంటూ హైకోర్టు మండిపాటు

Posted: 09/22/2014 06:46 PM IST
High court angers on telangana government s fast scheme

తెలంగాణ ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ వివాదాస్పదంగా పంతాలకు పోయి మరి తీసుకొచ్చిన ఫాస్ట్ పధకం జీవోపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ అంటే ప్రత్యేక దేశం కాదు., భారత్ లోనే అంతర్బాగం. అలాంటప్పుడు దేశ సమగ్రతను దెబ్బ తీసేలా ఎలా వ్యవహరిస్తారని మండిపడింది. తెలంగాణ విడుదల చేసిన జీవో రాజ్యాంగం ప్రకారం ఆమోదయోగ్యం కాదని తెలిపింది. ప్రభుత్వం మరోసారి జీవోను పరిశీలించాలని ఆదేశిస్తూ.., తదుపరి విచారణను 6వారాల పాటు వాయిదా వేసింది.

ఫాస్ట్ పధకం మతలబు

స్థానికతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్న తెలంగాణ ప్రభుత్వం.., ఫాస్ట్ పధకాన్ని తీసుకొచ్చింది. కేవలం తెలంగాణ విద్యార్థులకే ఫీజులు చెల్లించాలనే ఉద్దేశ్యంతో.., ప్రత్యేకంగా ఈ పధకం రూపొందించారు. ఇందులో స్థానికత ఆధారంగా ఫీజులు చెల్లించటం జరుగుతుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం విద్యార్థి తెలంగాణ స్థానికుడు కాకపోతే వారికి పీజులు చెల్లించదు. ఇందుకోసం 1956 ప్రామాణికంగా తీసుకువచ్చారు. అంటే ప్రస్తుత విద్యార్థుల పూర్వికుల తరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ 1956కు పూర్వం తెలంగాణలో ఉన్నట్లయితేనే వారు స్థానికులు. 1956తర్వాత వచ్చిన వారు ఫీజు చెల్లింపులకు అర్హులు కాదని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై చాలా వివాదాలు జరిగినా మాట వినకుండా జీవో తెచ్చింది.

అయితే తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు ప్రజాస్వామిక వాదులు, ఆంధ్రప్రదేశ్ కు చెందిన నేతలు వ్యతిరేకించారు. 7సంవత్సరాలు ఒక ప్రాంతంలో ఉంటే అక్కడ స్థానికుడుగా రాజ్యాంగం గుర్తింపు ఇస్తుండగా.., తెలంగాణ ప్రభుత్వం అరవై సంవత్సరాలను ప్రామాణికంగా తీసుకోవటం దారుణమని వ్యతిరేకించారు. ఈ నిర్ణయం వల్ల తెలంగాణలోని సీమాంధ్ర విద్యార్థులకు చదువు కష్టం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయంపై కోర్టులో పిటిషన్లు వేశారు. ఇతర రాష్ర్టాల నుంచి కూడా చాలా ఏళ్ల క్రితం ఇక్కడకు వచ్చిన వారున్నారని వారికి కూడా ప్రభుత్వం ఫీజును పొందే అర్హత ఉండదని వాదించారు. వారి వాదనతో ఏకీభవించిన కోర్టు., ప్రభుత్వం నిర్ణయం తీవ్రమైన విబేదాలను సృష్టిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవో పరిశీలించాలని హైకోర్టు సూచించిన నేపథ్యంలో.., కేసీఆర్ ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : telangana  fast scheme  highcourt  latest news  

Other Articles