Anti naxal operations over 100 commandogs to take on red ultras

Maoists, commandargs, CRPF, Malinois, ITBP

anti naxal operations over 100 commandogs to take on red ultras

‘అన్నల’ సమస్త సమాచారాన్ని అందించే ‘సింహాలు’

Posted: 09/22/2014 10:50 AM IST
Anti naxal operations over 100 commandogs to take on red ultras

మావోయిస్టులు దేశ అంతరింగక భద్రతకు పెను సవాల్ గా భావిస్తున్న కేంద్రం వారిని నియంత్రించే చర్యలకు ఉపక్రమించింది. నక్సల్స్ ఏరివేతలో భద్రతా బలగాలకు ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచనలు చేస్తోంది. ఐటీబీపీ, సీఆర్పీఎఫ్ తదితర పారామిలిటరీ జవాన్లు కూంబింగ్ సమయంలో ల్యాండ్‌మైన్స్ బారినపడి మరణించకుండా ముందుగానే హెచ్చరించేందుకు కమాండాగ్స్ ను రంగంలోకి దింపనుంది. అంటే ఇక అన్నలు ఎక్కడున్నారన్న సమాచారంతో పాటు అన్నలు పోలీసులను లక్ష్యంగా చేసుకుని అమర్చే మందుపాతరలను కూడా ఈ కమాండాగ్స్ పనిగట్టనున్నాయి. ఇంతకీ కమాండాగ్స్ అంటే ఏంటో తెలుసా..? శిక్షణ పొందిన కుక్కలను (కమాండాగ్స్). అంటే ఇక అన్నల సమాచారాన్ని ఈ శునాకాలు, అదేనండి గ్రామ సింహాలు చూసుకుంటాయన్న మాట.

 కూంబింగ్ ఆపరేషన్స్‌లో కమాండాగ్స్ ను వాడాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. మొదటగా 100 కమాండాగ్స్‌ను భద్రతా బలగాలకు సమకూర్చేందుకు ప్రణాళికను సిద్ధం చేసినట్లు హోంశాఖ వర్గాలు తెలిపాయి. ఐఈడీ తదితర పేలుడు పదార్థాలను గుర్తించటంలో శిక్షణ పొందిన బెల్జియన్ షెపర్డ్ జాతికి చెందిన మాలినోయిస్ కుక్కలు కూంబింగ్ సమయంలో పేలుడు పదార్థాలను ముందుగానే గుర్తించి జవాన్లను హెచ్చరిస్తాయి. ఇలాంటి కుక్కలను 2011లో ఐటీబీపీ బలగాలు సైనికావసరాల కోసం భారత్‌లో మొదటిసారి ఉపయోగించాయి.
 
శుత్రువుల జాడను పసిగట్టి దాడులు చేసేందుకు చాలా దేశాల సైన్యాలు ఈ శునకాలనే వాడుతున్నాయి. పాకిస్థాన్‌లో తలదాచుకున్న అల్‌కాయిదా చీఫ్ లాడెన్ జాడను పసిగట్టి అమెరికా నేవీ సీల్స్ దళాలు మట్టుబెట్టేలా సాయం చేయడం ద్వారా ‘మాలినోయిస్’లు ప్రపంచ ఖ్యాతి ఆర్జించాయి. వీటికి శిక్షణ అనంతరం నక్సల్స్ ఏరివేత చర్యల్లో పాల్గొనే ఒక్కో బెటాలియన్ వెంట కనీసం ఒక్కో ‘కమాండాగ్’ను మోహరించాలని యోచిస్తున్నట్లు ఓ అధికారి తెలిపారు. నక్సల్స్ ప్రాంతాల్లోని బెటాలియన్ క్యాంపుల్లో ఉండేందుకు వీలుగా ఈ కుక్కలకు, వాటి శిక్షకులకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు కమాండోలకు సరిసమానంగా పనిచేసే సామర్థ్యమున్నందుకే వీటికి ‘కమాండాగ్స్’ అని పేరుపెట్టారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Maoists  commandargs  CRPF  Malinois  ITBP  

Other Articles