Mars orbiter mission is on stable trajectory isro

Mars orbiter mission, Mom, mangalyaan, ISRO, Mars, India, First asian country, launch, stable, trajectory

India origins as first asian country to launch orbiter mission on to mars

24న మార్స్ కక్ష్యలోకి మంగళ్ యాన్..

Posted: 09/22/2014 07:54 AM IST
Mars orbiter mission is on stable trajectory isro

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో అరుదైన ఘనతను సాధించనుంది. వీనువీధుల్లో భారత కీర్తి పతాకాన్ని ఎగురవేయనుంది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మంగళ్‌యాన్ (మామ్) ప్రయోగం కీలకదశకు చేరుకుంది. అంగారక గ్రహాన్ని చేరిన మొదటి ఆసియాదేశంగా నిలిచి అంతరిక్ష ప్రయోగాల్లో చైనా, జపాన్ లపై పైచేయి సాధించాలని పట్టుదలతో ఉన్న ఇస్రో, మామ్‌లో నాలుగోదశను ఇవాళ ప్రారంభించనుంది. దాదాపు 300 రోజులుగా మామ్‌లో నిద్రావస్థలో ఉన్న 440 న్యూటన్ లిక్విడ్ అపోజీ మోటార్‌ను (లామ్) ఇవాళ ప్రయోగాత్మకంగా మండించనుంది. భారతీయ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30గంటలకు 3.968 సెకండ్లపాటు ఈ మోటార్‌ను మండిస్తారు. సెకనుకు 22.1 కి.మీ. వేగంతో దూసుకుపోతున్న మామ్.. అంగారకుడిని సమీపించేలోగా సెకనుకు 4.4 కి.మీ. వేగానికి తగ్గాల్సి వుంది. మార్స్ ను మండించడం కోసం మామ్‌లో నిల్వ ఉంచిన ఇంధనంలో 0.567 కిలోలు ఖర్చవుతుంది. మామ్ ప్రయోగం మొత్తానికి అత్యంత కీలకమైన అంగారక గ్రహ కక్ష్యలోకి మామ్‌ను ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని బుధవార చేపట్టనున్నారు.

అప్పుడే ఉపగ్రహాన్ని అంగారకుడు తనవైపు లాక్కుంటాడు. లేకపోతే ఉపగ్రహం మార్స్ గురుత్వాకర్షణను తప్పించుకుని ముందుకు దూసుకుపోతుంది. అందుకే.. బుధవారం తెల్లవారుజామున ఉపగ్రహం మార్స్‌ను సమీపించేసరికి.. లామ్ ఇంజన్‌ను 24 నిమిషాల పాటు మండించి ఉపగ్రహ వేగాన్ని తగ్గించడం అనేది అత్యంత కీలకం కానుంది. ఉపగ్రహం మార్స్ చుట్టూ కక్ష్యలోకి చేరేందుకు అతిముఖ్యమైన ఈ రెండు ప్రక్రియలు చేపట్టేందుకు ఆదేశాలు ఇవ్వడం పూర్తిచేశామని  ఇస్రో అధికారులు వెల్లడించారు. ఒకవేళ లామ్ ఇంజన్ పనిచేయకపోయినా.. ప్రత్యామ్నాయంగా 8 థ్రస్టర్లను ఎక్కువ సేపు మండిం చడం ద్వారా కూడా ఉపగ్రహాన్ని మార్స్ కక్ష్యలోకి చేర్చవచ్చని తెలిపారు.

మార్స్ చేరిన మొదటి ఆసియా దేశంగా భారత్..?

భారత్ గ్రహాంతర యానం చేపట్టడం ఇదే తొలిసారి. గతేడాది నవంబరు 5న శ్రీహరికోట నుంచి పీఎస్‌ఎల్‌వీ సీ-25 రాకెట్ ద్వారా మామ్‌ను నింగికి పంపి అంగారక యాత్రను ఇస్రో ప్రారంభించింది. రోదసిలో 300 రోజుల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేసిన మామ్ మరో 48 గంటల్లోనే మార్స్‌ను చేరుకోనుంది. ఇస్రో అంగారక యాత్రలో ఈ తుది ఘట్టం కూడా విజయవంతం అవుతోంది. దీంతో మార్స్‌కు ఉపగ్రహాన్ని పంపిన ఏకైక ఆసియా దేశం, తొలిప్రయత్నంలోనే మార్స్‌కు వ్యోమనౌకను పంపిన దేశం, అమెరికా, రష్యా, ఐరోపాల తర్వాత అంగారక యాత్రను విజయవంతంగా చేపట్టిన నాలుగో దేశంగా భారత్ చరిత్ర సృష్టించనుంది.  అంతరిక్ష ప్రయోగాల్లో భారత్‌కంటే ఎంతో ముందున్న చైనా, జపాన్ దేశాలు మార్స్‌ను చేరాలని ఇప్పటికే ప్రయత్నించి విఫలమయ్యాయి. వ్యోమగాములను సైతం స్వయంగా అంతరిక్షంలోకి పంపి సురక్షితంగా భూమికి తీసుకొచ్చిన చైనా, అంగారకుడిని మాత్రం చేరలేకపోయింది. ఆ దేశం 2011లో అంగారకుడిపైకి మొదటిసారిగా పంపిన యింఝౌ-1 ప్రయోగం విఫలమైంది. మరోవైపు అంగారకుడిపై ప్రయోగానికి కేవలం 15 నెలల్లోనే ఆర్బిటర్‌ను సిద్ధం చేసి ప్రపంచంలోనే అతితక్కువ సమయంలో ఈ ఘనత సాధించిన దేశంగా భారత్ అవతరించింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

  Yanamala ramakrishnudu fire on cm kiran kumar reddy
116 year old woman dies  
Rate This Article
(0 votes)
Tags : Mars orbiter mission  Mom  mangalyaan  ISRO  Mars  India  First asian country  trajectory  

Other Articles