Tussle between bjp sena s seat sharing may come to end

Shiv Sena, BJP, Maharashtra, Sena-BJP alliance, Uddhav Thackeray, Sanjay Raut, Tussle, 125 seats, Congress, NCP, Manikrao Thakre, Praful patel

Tussle between BJP-Sena's seat sharing may come to end, as sena agrees to give 125 seats to BJP

కొలిక్కి రానున్న బీజేపి-‘సేన’ సీట్ల సర్థుబాటు

Posted: 09/21/2014 01:27 PM IST
Tussle between bjp sena s seat sharing may come to end

మహారాష్ట్ర అసెంబ్లీ త్వరలో జరగనున్న ఎన్నికలలో బీజేపి, శివసేన పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండున్నర దశాబ్ధాలుగా ఈ రెండు పార్టీల మధ్య వున్న మైత్రిని వదులకోవడం ఇష్టంలేని శిశసేన పట్టువిడుపుకు పోతోంది. ఇప్పటిదాకా సీట్ల పంపకాలపై భీష్మించుకొని కూర్చున్న శివసేన నేతలు పట్టువిడుపులతో ఉన్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో సగం స్థానాలు (144) కావాలని కోరుతన్న బీజేపికి 125 స్థానాలను కేటాయించేందుకు సముఖంగా వున్నట్లు సమాచారం. శివసేన తమకు అనుకున్న సీట్లను కేటాయించని పక్షంలో రానున్న ఎన్నికలలో ఒంటరిగానే బరిలో నిలుస్తామన్న బీజేపి హెచ్చరికలతో.. శివసేన కాస్తా వెనక్కు తగ్గింది. బీజేపి వైపు ప్రజలు ఆసక్తిగా ఎదురుచూడడంతో పాటు.. ఒంటరిగా పోటీ చేసి గెలవలేమన్న భావన శివసేన వర్గాలలో వ్యక్తం కావడం కూడా కారణం కావచ్చని తెలుస్తోంది.

మొత్తం 288 నియోజకవర్గాలలో తాము 155 స్థానాల్లో పోటీ చేస్తామని, భాజపాకు 125, చిన్నపార్టీలైన మిగిలిన మిత్రపక్షాలకు 8 స్థానాలను వదిలేస్తామని శివసేన కొత్త ప్రతిపాదన తెచ్చింది. గత ఎన్నికలలో బీజేపికి కేటాయించిన సీట్ల కన్నా అధికంగా ఒక్క సీటు కూడా కేటాయించేది లేదని తేగేసి చెప్పిన శిశసేన.. పార్టీ అధినేత ఉద్దవ్ థాకరే సీనియర్ నేతలు, క్రీయాశీలక సభ్యులతో సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. సుమారు పదిహేనేళ్ల తరువాత అధికార పార్టీ కాంగ్రెస్, ఎన్సీపీలపై ప్రజలు గుర్రుగా వున్నారని, ఈ దఫా అధికారం తమదేనని భావిస్తున్న తరుణంలో ఒంటరి పోరుతో ప్రత్యర్థులకు గెలిచే అవకాశాన్ని ఇవ్వవదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా, శివసేన ప్రతిపాదనలపై బీజేపి నుంచి ఇప్పటికీ వరకు ఎలాంటి స్పందనా రాలేదు. ఇవాళ జరిగే పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో శివసేన ప్రతిపాదనలపై నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. మహారాష్ట్రలో శివసేన-బీజేపి బంధాన్ని తెంచుకునే పరిస్థితే లేదని, సీట్ల పంపకాలపై 24 గంటల్లో స్పష్టత వస్తుందని ఇరుపార్టీల నేతలు పేర్కొన్నారు.

కాంగ్రెస్ ఎన్సీపీల మధ్యా కొనసాగుతున్న స్తబ్ధత

మరోవైపు అధికార కాంగ్రెస్-ఎన్సీపీ కూటమిలో కూడా స్తబ్ధత నెలకొంది. మహారాష్ట్ర శాసనసభకు మొత్తం 288 స్థానాలుండగా కాంగ్రెస్ ఇస్తానన్న 124 స్థానాలను తిరస్కరించి 144 స్థానాలు కావాలని ఎన్సీపీ కోరుతోంది. తాము కోరిన స్థానాల సంఖ్యపై కాంగ్రెస్ ఒక రోజులో తన స్పందనను తెలపాలని, తాము ఎక్కువ కాలం వేచి ఉండలేమని ఎన్సీపీ ఉపాధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ అన్నారు. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కన్నా మెరుగైన ఫలితాలు సాధించినందునే తాము ఎక్కువ సీట్లు కోరుతున్నామన్నారు. ఒంటరిగా ఎన్నికల బరిలోకి ఎన్సీపీ కూడా వెళ్లే అవకాశం ఉంటుందన్నారు. మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మానిక్‌రావ్ థాక్రే మాట్లాడుతూ నిర్ణయం ఎన్సీపీకే వదిలేశామన్నారు. ఎన్సీపీ రోజు లేదా రెండు రోజుల్లో తన స్పందనను తెలపకుంటే 288 స్థానాలకు పోటీచేసేందుకు కాంగ్రెస్ సిద్ధంగా వుందన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shiv Sena  BJP  Maharashtra  Sena-BJP alliance  Uddhav Thackeray  Congress  NCP  Manikrao Thakre  Praful patel  

Other Articles