Another twist in the regulation of contractual workers

Another twist, regulation, contractual workers, Telangana government, five years, regular service, mandatory

Another twist in the regulation of contractual workers .. as government says five years of regular service mandatory

ఒప్పంద కార్మికుల క్రమబద్దీకరణలో మరో ట్విస్ట్..

Posted: 09/21/2014 11:21 AM IST
Another twist in the regulation of contractual workers

కాంట్రాక్టు కార్మికులను రెగ్యూలరైజ్ చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఎన్నికలు జరిగి నాలుగు మాసాలు గడిచినా.. ఆ హామిని నిలబెట్టుకోలేదు. ఈ దిశగా ముందుకు వెళ్తూ క్రమబద్దీకరణకు చర్యలు తీసుకుంటున్న ఆయన పలు ప్రకటనలు చేస్తూ.. ఒప్పంద కార్మికులను ఆందోళనకు గురిచేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించి.. ప్రాణాలను అడ్డపెట్టి నిలిచిన తెలంగాణ విద్యార్థులను మచ్చిక చేసుకునే ప్రయత్నంలో భాగంగా టీఆర్ఎస్ ప్రభుత్వం తాజాగా ఒక ప్రకటన చేసింది.

నిరాటంకంగా ఐదేళ్ల సర్వీసు దాటిన ఒప్పంద ఉద్యోగులనే క్రమబద్ధీకరణకు పరిగణనలోకి తీసుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ఉన్నతస్థాయి కమిటీ యోచిస్తోంది. మధ్యలో మానేసి మళ్లీ విధుల్లో చేరిన వారిని అనర్హులుగా భావించనుంది. తెలంగాణ ఆవిర్భావదినమైన జూన్ 2 కంటే ముందు ఐదేళ్లుగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగుల జాబితాను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది. అంటే 2009 జూన్ 2 కంటే ముందు నియమితులైన వారికే క్రమబద్ధీకరణ జాబితాలో చోటు దక్కే అవకాశాలున్నాయి.

తెలంగాణలో ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణకు నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం దీనిపై విధివిధానాల రూపకల్పనకు ప్రభుత్వ ప్రధానకార్యదర్శి అధ్యక్షతన అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులతో కమిటీని ఏర్పాటు చేసింది. పలు దఫాలు సమావేశమైన కమిటీ.. ఉద్యోగుల క్రమబద్ధీకరణకు అర్హులెవరనే అంశంపై విధివిధానాలు రూపొందించింది. దాదాపు అందరూ ఐదేళ్లు దాటిన వారినే పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. దీన్ని కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించింది. క్రమబద్ధీకరణకు ప్రభుత్వ నిర్ణయం తెలిసిన తర్వాత ఒప్పంద ఉద్యోగాలను వదిలేసిన వారు మళ్లీ వచ్చి విధుల్లో చేరుతున్నట్లు పలు శాఖలు సమాచారం అందించాయి.

మధ్యలో చేరిన వారిని పరిగణనలోకి తీసుకోరాదని కమిటీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఒప్పంద ఉద్యోగుల ఎంపిక, నియామక విధానం, రోస్టర్, రిజర్వేషన్లు తదితర అంశాలతో పాటు ఆయా శాఖల్లోని ఖాళీల ఆధారంగానే తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక విద్యార్థులను మచ్చిక చేసుకునే ప్రయత్నం వుందని వార్తలు వినిపిస్తున్నాయి.

ఒప్పంద కార్మికులను రెగ్యూలరైజ్ చేయరాదని ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కు తేల్చిచెప్పారు. ఎన్నికల తరుణంలో వారి మాటలను లక్ష్యపెట్టని కేసీఆర్.. విద్యార్థులపై ఒంటి కాలుపై లేచారు. ఎన్నికల సమయంలో ఎలాంటి చర్యలు చేపట్టినా.. మనం తెచ్చకున్న పార్టీ ఉనికే ప్రమాదం కలుగుతుందని భావించిన విద్యార్థులు మిన్నకుండిపోయారు. ఎన్నికల తరువాత మరోమారు కేసీఆర్ దృష్టి తమ సమస్యను తీసుకువెళ్థామని నిర్ణయించుకున్నారు.

ఒప్పంద కార్మికులను రెగ్యూలరైజ్ చేస్తే.. ఇన్నాళ్లు కష్టపడి ఉద్యోగాల కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్న తమకు ఉద్యోగాలు రావని విద్యార్థులు ఎన్నికల తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టిక సమస్యను తీసుకువెళ్లారు. ఒప్పంద కార్మికులకు మాట ఇచ్చాను. వారిని క్రమబద్దీకరణ చేస్తాను అని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు. దీంతో తమ ఉద్యోగావకాశాలు ఇప్పట్లో రావని భావించిన విద్యార్థులు ఉద్యమాన్ని చేపట్టారు. ఉద్యమించిన విద్యార్థులపై.. ఉద్యమాల నెలవైన ఉస్మానియాలో పోలీసులు లాఠీలు ఝుళిపించారు. విద్యార్థులను చితకబాదారు. ఈ చర్యను ప్రతిపక్షాలు ఖండించాయి

దీంతో విద్యార్థులను మచ్చిక చేసుకోవండంతో పాటు ఒప్పంద కార్మికులను వదులుకోకుండా.. ప్రభుత్వం ఈ యోచన చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఐదేళ్ల రెగ్యూలర్ సర్వీసు వున్న ఒప్పంద కార్మికులనే క్రమబద్దీకరిస్తామని ప్రభుత్వ ప్రకటన తెలంగాణ విద్యార్థులకు కాస్తా ఊరటనిస్తోంది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles