Passenger trains stoped for a week

founding week, anniversary, Maoists, Bihar, Jharkhand, five divisions, passenger trains, stopped

In the wake of the founding anniversary of the Maoists, officals stoped trains

అక్కడ వారం రోజుల పాటు రైళ్ల బంద్

Posted: 09/21/2014 10:53 AM IST
Passenger trains stoped for a week

అక్కడ వారి ప్రాబల్యం అధికం. అందుకనే అక్కడ వారం రోజుల పాటు రైళ్లను బంద్ చేశారు. ఇంతకీ ఎవరు వారు అనుకుంటున్నారా.. వారేనండి అన్నలు.. మరోవిధంగా మావోలు అంటాం. వారి ప్రాబల్యానికి తట్టుకోలేక రైల్వే శాఖ రైళ్లను బంద్ చేసిందంటే వారికున్న బలం ఏ పాటిదో అర్థమవుతోంది. మావోయిస్టుల వ్యవస్థాపక దినోత్సవాల నేపథ్యంలో..బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ఐదు డివిజన్ల పరిధిలో ఇవాళ్టి నుంచి వారంపాటు 28 పాసింజర్ రైళ్లను నిలిపివేస్తున్నట్లు తూర్పు మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.

బంద్‌లు, ఇతర సందర్భాల్లో గతంలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఈసీఆర్ ప్రధాన ప్రజాసంబంధాల అధికారి అరవింద్ కుమార్ రజక్ తెలిపారు. ధన్‌బాద్, సమస్తిపూర్ డివిజన్లలో 16, దనపూర్ డివిజన్‌లో 5, సోన్‌పూర్ డివిజన్‌లో 4, మొగల్‌సరాయ్ డివిజన్‌లో 3 పాసింజర్ రైళ్ల సేవలు నిలిపివేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు.

మరోవైపు ఛత్తీస్‌గఢ్‌లోని సుకుమా జిల్లా దోండ్రా బేస్‌క్యాంపుపై మావోయిస్టులు శనివారం రాత్రి దాడికి దిగారు. మావోయిస్టు ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకొంటున్న తరుణంలో కాల్పులకు తెగబడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులపై పోరాటం చేసేందుకు 2006లో సుకుమా, దంతెవాడ, బీజాపూర్ జిల్లాల్లోని మారుమూల గ్రామాలను ప్రధాన రహదారుల పక్కకు తరలించి బేస్ క్యాంపులు ఏర్పాటు చేశారు.

మావోయిస్టుల సమాచారం తెలిసిన కొందరు యువకులను ఎస్టీవోలుగా నియమించుకొని అటవీ ప్రాంతంలో కూంబింగ్‌లు చేపట్టారు. ఈ క్యాంపులు ఏర్పడ్డాక గతంలో ఎర్రబోరు బేస్‌క్యాంపుపై మావోయిస్టులు దాడి చేసి 32 మందిని హతమార్చారు. ఆ తర్వాత కూడా పలుమార్లు దాడులు జరిపారు. ఇటీవల బేస్ క్యాంపులపై దృష్టి పెట్టని మావోయిస్టులు తాజాగా కుంట సమీపంలో ఉన్న క్యాంపుపై కాల్పులు జరిపారు. అప్రమత్తమైన పోలీసులు దాడిని తిప్పికొట్టారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : founding week  anniversary  Maoists  Bihar  Jharkhand  five divisions  passenger trains  stopped  

Other Articles