High tensions in india china border

india, china, india china border, china india border, arunachal pradesh china, china war, chiana attitude, indian army, china army, chinese army, latest news, xi ping, china president india tour, narendra modi, ladakh, himachal pradesh, latest news, kargil war

china army troops still on a mountain in border ready to infertiltate again into indian lands : india china borders are in high tensions opposite troops are waiting on a mountain to re enter into indian border

డ్రాగన్ తో మళ్ళీ యుద్ధం తప్పదా...?

Posted: 09/21/2014 08:12 AM IST
High tensions in india china border

కుక్క తోక వంకర అన్నట్లు చైనా బుద్ది కూడా మారటం లేదు. భారత్ తో సన్నిహిత సంబంధాలు కోరుకుంటున్నట్లు చెప్తూనే.. దేశంపై దురాక్రమణలకు సిద్దం అవుతోంది. వెనక్కి వెళ్ళినట్లే వెళ్ళిన చైనా సేనలు తిరిగి భారత భూభాగంలోకి అడుగు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాస్తవాధీన రేఖ దగ్గర ఓ పర్వతంపై చైనా సైన్యం భారత భూభాగంలోకి ప్రవేశించేందుకు సిధ్ధంగా ఉన్నట్లు ఆర్మీ వర్గాలు చెప్తున్నాయి. గతంలో భారత్ తో యుద్ధానికి ముందు పాక్ కూడా ఇలా కొండల చాటున నక్కి ఉంది. దీంతో భవిష్యత్తును ఊహించి అప్రమత్తమైన భారత ఆర్మీ.., వెనక్కి రప్పించిన సరిహధ్ధు రక్షణా బలగాలను భారత్ కూడా తిరిగి వెళ్ళాలని స్పష్టం చేసింది. గస్తీని మరింత పెంచాలని ఆదేశించింది.

చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ భారత పర్యటన సందర్బంగా.. డ్రాగన్ దేశపు చొరబాట్లపై నరేంద్రమోడీ నిలదీశారు. ఆక్రమణలు సహించబోమని చెప్పారు. అంతకు ముందు వారమే చైనా బలగాలు భారత భూభాగమైన హిమాచల్ ప్రదేశ్ లోని లడఖ్ సరిహద్దులో చుమర్ గ్రామంలో తిష్టవేశాయి. చాలాకాలంగా ఆ గ్రామం తమ భూభాగమని చైనా వాదిస్తోంది. అయితే పింగ్ పర్యటన సజావుగా సాగాలనే ఉద్దేశ్యంతో విదేశీ బలగాలు వెనక్కి వెళ్ళాయి. దీంతో వారి బుద్ధి మారింది అనుకుని భారత సైన్యం కూడా సరిహద్దులో బలగాల మోహరింపును కాస్త తగ్గించింది.

అయితే కుట్రలకు పాల్పడే చైనా బలగాలు పూర్తిగా వెనక్కి వెళ్లలేదని మన సైనికులు గుర్తించారు. సరిహద్దులో వాస్తవాధీన రేఖ దగ్గర్లో ఉండే ఓ పర్వతంపై వారంతా దాచుకున్నట్లు గుర్తించారు. అంటే మళ్ళీ ఓ రెండ్రోజుల్లో వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని అర్ధమవుతోంది. గతంలో కార్గిల్ యుద్ధం సమయంలో కూడా పాక్ సైనికుల సాయంతో ఉగ్రవాదులు ఇలాగే కొండలు, పర్వతాలపైకి చేరి.., భారత్ తో యుద్ధానికి తెగబడ్డారు. దీంతో మళ్లీ ఇలాంటి ముప్పు వచ్చే అవకాశం ఉందని మన సైన్యం అప్రమత్తమైంది. సరిహద్దులో బలగాల మోహరింపును పెంచాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. చైనా ఆక్రమణలు ఇప్పటివి కావు. అరుణాచల్ ప్రదేశ్ భూభాగం కూడా తమదే అని గతంలో చాలాసార్లు ఆ ప్రాంతంలో ఆక్రమణలకు యత్నించారు.

భారత్ -పాక్ సరిహద్దులో పాక్ బలగాలు కాల్పులకు తెగబడుతుంటే., భారత్- చైనా సరిహద్దులో ఆదేశ బలగాలు ఆక్రమణలకు పాల్పడుతున్నాయి. శత్రువు., శత్రువు మిత్రుడు అవుతాడన్నట్లుగా చైనా-పాకిస్థాన్ ప్రస్తుతం మైత్రి దేశాలుగా కొనసాగుతున్నాయి. ఈ రెండిటి టార్గెట్ భారత్ కావటం ఇందుకు ప్రధాన కారణం. ఆ మద్య పాక్ కు అవసరమైతే సైనిక సాయం చేస్తామని.., అటువైపు నుంచి ఆక్రమణలు చేసేందుకు డ్రాగన్ పావులు కదిపింది కూడా. ఇలా రెండు దేశాలు కలిసి భారత్ పై కుట్రలు చేస్తే.., ఎదుర్కోవటం కష్టసాధ్యమవుతుంది. దేశ నాశనం కోసం ఎదురుచూస్తున్న ఉగ్రవాదులు వీరికి తోడయి.., ఉపఖండంపై యుద్ధానికి తెగబడతారు.

నిజంగా చెప్పాలంటే చైనాకు భారత్ పై అంతగా ప్రేమ లేదు. కాకపోతే చైనా ఉత్పత్తులు ఇక్కడ ఎక్కువగా అమ్ముడవుతున్నాయి కాబట్టి.., వ్యాపార విస్తరణ చేసుకోవాలంటే మనతో మంచిగా ఉండక తప్పదు. అందువల్లే వచ్చి ఒప్పందాలు చేసుకుని వెళ్తున్నారు. కేవలం చైనా ప్రభుత్వానికే కాదు., ఆ దేశ ప్రజలకు కూడా భారత్ అంటే వ్యతిరేక భావం ఉంది. చైనాలో ఓ సర్వేలో తమకు భారత్ అంటే వ్యతిరే్క భావం ఉందని.. పాకిస్థాన్ అంటే ప్రేమ ఉందని మెజార్టి ప్రజలు దేశంపై విషం కక్కారు. అయినా సరే మనం చైనా వస్తువులే కావాలి అన్నట్లుగా ఎగబడి మరీ కొంటున్నాం.

 

 


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india china border  ladakh  latest news  war  

Other Articles