Underestimated narendra modi says cnn scribe who interviewed

underestimate, narendra modi, sharp leader, CNN, scribe, interview, Fareed Zakaria

i have under estimated narendra modi, he is a sharp leader says CNN scribe who interviewed

నరేంద్రమోడీని తక్కువగా అంచనా వేశాను..

Posted: 09/20/2014 02:11 PM IST
Underestimated narendra modi says cnn scribe who interviewed

నరేంద్ర మోడీని తక్కువగా అంచానా వేశాను.. ఆయన చాలా గ్రేట్ అంటూ కితాబిచ్చారాయన. సాధారణ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా జీవితం ప్రారంభించి.. దేశానికే ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన వ్యక్తి మాత్రమే అనుకున్నారట. జీవితంలో అనేక ఎత్తుపల్లాలను చూసి, ఘటనా ఘటన సమర్థులను ఎదుర్కొన్న ఆయనను తక్కువగా ఎందుకు అంచానా వేశానబ్బా అని తరువాత నాలుక కరుచుకున్నారట. ఇంతకీ ఎవరాయన అనుకుంటున్నారా..? ఆయన అంతర్జాతీయ మీడియా సంస్థ సీఎన్ఎన్ ప్రతినిధి ఫరీద్ జకారియా. అతను మాత్రం ఎం తక్కువ కాదండోయ్.. భారత ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ తొలి ఇంటర్య్వూ సంపాదించడంలో సఫలమైన తలపండిన పాత్రికేయుడు..

అంతగా తలపండిన ఫరీద్ జకారియా.. నరేందర మోడీని ఎందుకు తక్కువగా అంచనా వేసిందంటారా..? నాణేనికి ఒక వైపే చూసి పోరబాటున అంచానాకు వస్తుంటారు కొందరు. మోడీ విషయంలోనూ ఫరీద్ జకారియా ఇలాంటి తప్పిదమే చేశారు. అయితే.. మేధావి వర్గానికి చెందినవారు కాబట్టే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. మోడీని తక్కువగా అంచానా వేశాను.. కానీ ఆయన చాలా షార్ప్ అని కితాబిచ్చారు.. ఈ విషయాన్ని మోడీని ఇంటర్య్వూ చేసిన తరువాత గ్రహించారాయన.

ప్రధాని నరేంద్రమోడీని తాను తక్కువగా అంచనా వేశానని, కానీ ఇప్పటివరకు తాను చూసిన నాయకులందరిలో ఆయనే చాలా షార్ప్ అని ఫరీద్ జకారియా చెప్పారు. ఆయన చాలా తెలివైనవారని, అన్ని విషయాలపై దృష్టి బాగా కేంద్రీకరిస్తారన్నారు. ఆయనకు దీర్ఘకాలిక ఎజెండా ఉందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో మంచి రాజనీతిజ్ఞుడిగా పేరుతెచ్చుకోవాలన్నది ఆయన లక్ష్యమని, గతంలోకి చూసి బాధపడేకంటే భవిష్యత్తులోకి చూసి సాధించడం ఆయన వద్దే నేర్చుకోవాలని జకారియా వ్యాఖ్యానించారు.

భారతీయ ముస్లింలు భారతదేశం కోసమే జీవిస్తారు, దేశం కోసమే మరణిస్తారని.. అల్ కాయిదా లాంటి సంస్థలు వీళ్లను ఎంత మభ్యపెట్టాలనుకున్నా సాధ్యం కాదని ఆ ఇంటర్వ్యూలో నరేంద్రమోడీ తెలిపారు. ఆయన ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత వచ్చిన తొలి ఇంటర్వ్యూ ఇదే. ముస్లింలు ఒక చేత్తో ఖురాన్, మరో చేత్తో కంప్యూటర్ పట్టుకుని వెళ్లాలని మోడీ ఆంకాంక్షించారన్నారు. మోడీ ఇంటర్య్వూ ఆదివారం తమ చానెళ్లో పరసారం అవుతుందని ఫరీద్ జకారియా చెప్పారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : underestimate  narendra modi  sharp leader  CNN  scribe  interview  Fareed Zakaria  

Other Articles