Chandrababu gives dassera gift to ministers

chandrababu naidu, ap ministers, media liaison officers, ministers peshis, recruit, dassera gift

chandrababu recruited tdp loyalists media liaison officers in ministers peshis

మంత్రులకు మౌత్ పీస్ లు ఇస్తున్న బాబు

Posted: 09/19/2014 06:21 PM IST
Chandrababu gives dassera gift to ministers

ప్రజలకే కాదు తన మంత్రివర్గంలోని మంత్రులకు కూడా ఊహించని షాక్ లిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి  చంద్రబాబు. ఇప్పటికే మంత్రులకు పనితీరు ఆధారంగా గ్రేడింగ్ ఇచ్చిన ఆయన తాజాగా మరో ఝలక్ ఇచ్చారు. తన మంత్రివర్గంలోని అమాత్యులందరికీ దసరాకు ముందే కానుకలు ఇచ్చారు. కానుకేమిటనుకుంటున్నారా..? మంత్రుల పేషీల్లో మీడియా అనుసంధాన అధికారి(ఎంఎల్ఓ)లను నియమిండం.. 20 మంది నిబద్దత కలిగిన టీడీపీ మద్దతుదారు జర్నలిస్టులను ఎంఎల్ఓలుగా నియమించేందుకు అధినేత పచ్చజెండా ఊపారు. మంత్రుల తరపున ఎంఎల్ఓలే అన్నింటికీ  సమాచారం అందిస్తారు.

ఒక రకంగా ఇది మంచిదే అయినా.. మరో రకంగా ఆలోచిస్తే.. మంత్రలు వ్యవహారాలపై నిఘా పెట్టేందుకే ఈ ఏర్పాటని అమాత్యులు భావిస్తున్నారు. తమ శాఖలో జరిగే పనులను మీడియాకు వారే నెరుగా చెబితే.. మీడియా ద్వారా ప్రజల్లోకి వెళ్లినట్లు అవుతుందనుకున్న మంత్రలుకు ఇది చేదు గుళికే అవుంతోంది. అంతే కాదు ఈ ఎంఎల్ఓలు సమాచారానంతా మీడియాతో పాటు అధిష్టాన వర్గానికి కూడా చేరవేస్తారన్న భయం కూడా అమాత్యులతో నెలకొంది. మంత్రులు లేని సమయాల్లో, ఇంకా మాట్లాడితే వున్న సమయాల్లోనూ వీరు సూడో మంత్రులుగా వ్యవహరించే ప్రమాదముందన్న అమాత్యులు ఆందోళన చెందుతున్నారట.

అధినేత నిర్ణయంపై కక్కలేక మింగలేక మంత్రులు సతమతమవుతున్నారు. ఇప్పటికే చాలా మంది మంత్రులు పీఆర్వోలను నియమించుకున్నారు. తాము నియమించుకున్న పీఆర్వోలను కొనసాగిస్తారో, లేదో తెలియక తలపట్టుకుంటున్నారు. ఎంఎల్ఓ వ్యవహారం తమకు తలనొప్పిగా తయారవుతుందని అమాత్యులు వాపోతున్నారు. వచ్చే వారం నుంచి తమ పనితీరును రోజువారీగా 'ట్యాబ్'ల ద్వారా సీఎం అంచనా వేయనున్నారన్న గుబులు మరోపక్క మంత్రులను పీకుతోంది.

ఎంఎల్ఓలను 'చినబాబు' లోకేష్, ఆయన స్నేహితుడు, సీఎంఓ కార్యాలయం ఓఎస్డీ అభిష్ట ఎంపిక చేశారని సమాచారం.. మంత్రుల వ్యక్తిగత కార్యదర్శుల నియామకంలోనూ చక్రం తిప్పిన చినబాబు ఇప్పుడు కూడా కీలకపాత్ర పోషించారు.  ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమితులైన ఎంఎల్ఓలకు నెలకు రూ.20 వేల నుంచి రూ. 28 వేల వరకు వేతనాన్ని ఫిక్స్ చేశారట, ఇతర అలవెన్సులు కూడా చెల్లించనున్నారని సమాచారం. అయితే ప్రభుత్వంలో పనిచేసిన అనుభవంలేని వారిని ఎంఎల్ఓలుగా ఎలా నియమిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు. వ్యక్తిగత కార్యదర్శుల నియామకంలో తమకెదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని మంత్రులు కిమ్మనడం లేదు. తామెన్ని చెప్పినా చివరకు చినబాబు మాటే నెగ్గుతుందని తెలుసు కాబట్టి అమాత్యులు నోరు మెదపడం లేదు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : chandrababu naidu  ap ministers  media liaison officers  dassera gift  

Other Articles