Mla of madhyapradesh cleans hand with mp s saree

dinesh roy, madhyapradesh mla, madhyapradesh mp, mla dinesh roy, mahdypradesh mla list, bjp mps list, bjp mla list, saree, mla pulls saree, dinesh roy pulls saree of mp, sexual harassasment, latest news, national news, mp neetu pateria

mla of madhyapradesh dinesh roy pulls bjp mp neeta pateria's saree and cleans his hand with that : mla dines roy facing problems by catching mp's saree in publicly

పబ్లిగ్గా.., ఎంపి కొంగుపట్టుకున్న ఎమ్మెల్యే

Posted: 09/19/2014 05:39 PM IST
Mla of madhyapradesh cleans hand with mp s saree

మధ్యప్రదేశ్ లో ఓ ఎమ్మెల్యే దుస్సాహసానికి ఒడిగట్టాడు. నాడు భారతంలో నిండు సభలో కౌరవులు ద్రౌపతి చీరను లాగితే ఇప్పడు భారతదేశంలో.., బహిరంగ సభలో ఓ మహిళా ఎంపి చీర కొంగు పట్టుకున్నాడు. ఎవరూ చూడకపోయినా.. తన పనిని కెమెరా కళ్ళు బంధించటంలో వీడియోను కనీసం కట్ చేయకుండా మీడియా ప్రసారం చేసింది. ఇంకేముంది తెలిసో.., తెలియక చేసిన ఈ చిలిపి పనికి ఇప్పుడు ఎమ్మెల్యే విమర్శలతో చుక్కలు చూస్తున్నాడు. దినేష్ రాయ్ అనే ఇండిపెండెంట్ ఎమ్మెల్యే ఈ పని చేశాడు.

బీజేపి ఎంపి నీతా పటేరియాతో కలిసి సియోనిలోజరిగిన ఓ బహిరంగ సభలో దినేష్ పాల్గొన్నారు. స్టేజిపైకి ఎక్కిన సమయంలో ఎంపి వెనక ఉన్న గౌరవనీయ ఎమ్మెల్యే గారు ఆమె చీరకొంగు పట్టుకున్నారు. అంతటితో ఆగకుండా చేయితో నలిపేశాడు. ఇంకా ఏం చేద్దామనుకున్నాడో కాని.., ఇంతలోపే తన చేతి చిలిపి పని మీడియాలో లైవ్ వచ్చింది. కొంగు పట్టుకున్న వీడియోను మళ్ళీ.., మళ్ళీ.., రిపీట్ సీన్స్ వేసి ఎమ్మెల్యే బండారం బయటపెట్టేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే వెంటనే షాకయ్యాడు. మొదట నోట మాట రాకపోయినా.. తర్వాత తేరుకుని తప్పు తెలుసుకున్నట్లు చెప్పాడు. కావాలని అలా చేయలేదని.. ఏదో అనుకోకుండా జరిగిపోయిందన్నాడు. చేతికి మరక అంటితే చీరకొంగుతో తుడుచుకున్నట్లు వివరణ ఇచ్చాడు.

{youtube}OxsB1o2UvtM|620|400|1{youtube}

పోని ఎమ్మెల్యే వాదనే కరెక్ట్ అనుకున్నా.., మరకలు తుడుచుకోవటానికి ఎంపి చీర తుండుగుడ్డ కాదు కదా.., అంతేకాకుండా ఆమె అతిని కుటుంబ సభ్యురాలయితే వారికున్న సాన్నిహిత్యం వల్ల అలా జరిగినా తప్పులేదు అనుకోవచ్చు. ఇక చివరకు తన తప్పుకు ఎంపీకి సభలోనే క్షమాపణలు చెప్పాడు దినేష్. నీతూ తనకు వదినలాంటిదని., ఆమెపై ఎలాంటి దురుద్దేశం లేదని వివరణ ఇచ్చాడు. దినేష్ పై చర్యలు తీసుకోవాలా.. వద్దా అనేది పార్టీనాయకత్వమే చెప్పాలని ఎంపీ పేర్కొంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dinesh roy  mp neetu pateria  latest news  madhyapradesh  

Other Articles