Minister kamineni srinivas takes class to doctors

telangana, andhrapradesh, hospitals, andhrapradesh hospitals, latest news, kamineni srinivas, arogya sri, medical claims, disease, ap ministers, chandrababu, doctors, apollo, yashoda, hospitals in hyderabad

ap health minister kamineni srinivas angers on doctors for neglecting their duties : minister of ap health kamineni questions doctors that government will release money how much they asks will they serve patient much better

ఫస్ట్ ర్యాంకు కోసం డాక్టర్లకు మంత్రి ‘‘క్లాసు’’లు

Posted: 09/18/2014 06:22 PM IST
Minister kamineni srinivas takes class to doctors

ఫస్ట్ ర్యాంకు రావటం కోసం ఒక విద్యార్థి ఎంత కష్టపడతాడో.., ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ అంతకంటే ఎక్కవే తంటాలు పడుతున్నాడు. తనకు కేటాయించిన వైద్య శాఖను పరుగులు పెట్టిస్తున్నారు. ప్రభుత్వ ఆస్పత్రులను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ అధికారులు, వైద్యులకు షాకిస్తున్నాడు. సక్రమంగా డ్యూటీలు చేయక, సరైన టైంకు రాకుండా ఉండేవారిని సస్పెండ్ చేస్తున్నాడు. తాజాగా విజయవాడలో పర్యటించిన మంత్రి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవర్తన మార్చుకోవాలంటూ క్లాస్ కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.

రోగులకు వైద్య సేవల్లో ఆలస్యంపై ప్రశ్నించగా.., సరిగా నిధులు, మందులు అందటం లేదని సమాధానం వచ్చింది. వెంటనే స్పందించిన మంత్రి... 'ఎంత నిధులు కావాలో చెప్పండి కేటాయిస్తాను.. కాని సక్రమంగా విధులు నిర్వహిస్తారా..? వైద్య సేవలు సరిగా అందజేస్తారా''? గుండెలపై చేయి వేసి చెప్పండని అధికారులను నిలదీశారు. ఒక్క అధికారి కూడా చేయలేము సార్ అని చెప్పలేదు. కాని.. సరిగా డ్యూటి చేస్తామని కూడా ఎవరూ చెప్పలేదట. సమాధానాలు చెప్పేందుకు తడబడ్డారట. జిల్లా, మండల స్థాయిల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో అధికారులు, డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే సామాన్య ప్రజలు నమ్మకం కోల్పోయారని మండిపడ్డారు.

తేడా వస్తే తాట తీస్తా

డాక్టర్లు ఉదయం తొమ్మిది నుంచి సాయత్రం నాలుగు గంటల వరకూ కచ్చితంగా ఆసుపత్రిలో ఉండాల్సిందేనని ఆయన ఆదేశించారు. రోగుల ఫిర్యాదు లేకుండా వైద్య సేవలు అందజేసే డాక్టర్లను గుర్తించి ప్రమోషన్లు ఇస్తామన్నారు. ఇదే సమయంలో డ్యూటీ సరిగా చేయకపోతే కఠినంగా చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రభుత్వంపై ప్రజలు పెట్టుకున్న ఆశలు నెరవేర్చాల్సిన బాధ్యత తమతో పాటు అధికారులపై కూడా ఉందన్నారు. కాబట్టి ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలని హెచ్చరించారు. ఏమైనా తేడా వస్తే మాత్రం ఊస్టింగ్ తప్ప.., ఉపేక్షించే పని ఉండదన్నారు.

గుంటూరు, విజయవాడలను హైదరాబాద్‌కు మించిన మెడికల్‌ హబ్‌గా తయారు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఉందన్నారు. ఇందులో భాగంగా త్వరలో విజయవాడలో సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మిస్తామన్నారు. ఇకపోతే ఏపీ మంత్రులకు చంద్రబాబు గ్రేడులు ప్రకటించారు. ఈ గ్రేడుల్లో దేవినేని ఉమా మహేశ్వర రావు తొలి స్థానంలో ఉండగా..., మంత్రి కామినేని శ్రీనివాస్ రెండవ స్థానంలో ఉన్నారు. శాఖాపర పనితీరు, ప్రజల్లో ఉన్న స్పందనతో పాటు పార్టీ కార్యక్రమాలు, పార్టీ కార్యకర్తలతో మెలుగుతున్న వైఖరి ఆధారంగా బాబు ఈ గ్రేడులు ఇచ్చారు. ఈ దూకుడు చూస్తుంటే వచ్చే రిజల్ట్ లో చంద్రబాబు దగ్గర కామినేనికి డిస్టింక్షన్ వచ్చేట్టుంది.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : doctors  kamineni srinivas  latest news  andhrapradesh  

Other Articles