Kidnap case on ap speaker kodela son

andhrapradesh assembly, andhrapradesh assembly speake, andhrapradesh, domestic voilence, gruhahimsa act, women protection, kodela shivaprasad rao, kodela sivaprad rao, vishakapatnam, vishakapatnam police, andhrapradesh police, latest news

vishakapatnam 3town police filed kidnap case against andhrapradesh speaker kodela shivaprasad rao's son shivaramkrishna for allegedly taking his son from wife : kodela's daughter in law complainted on her husband for forcebly taking her son

స్పీకర్ కోడెలకు కొడుకు కష్టాలు

Posted: 09/18/2014 10:53 AM IST
Kidnap case on ap speaker kodela son

ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద రావుకు కొడుకు కష్టాలు మొదలయ్యాయి. స్పీకర్ కొడుకు శివరామకృష్ణపై విశాఖపట్నంలోని పోలిస్ స్టేషన్ లో కిడ్నాప్ కేసు నమోదయింది. స్వయంగా రామకృష్ణ భార్య ఈ కేసును పెట్టింది. పూర్తి వివరాలు చూస్తే.., 2009 సంవత్సరంలో శివరామకృష్ణకు పద్మప్రియ అనే మహిళతో వివాహం అయింది. పెళ్లయిన కొద్ది రోజులకే అత్తింటిపోరు మొదలయిందని శివరామకృష్ణ భార్య పోలిసులకు తెలిపింది. భర్తతో పాటు, అత్త, తన మరదలు కూడా వేధించేవారని ఆరోపించింది. అటు 2010 సంవత్పరంలో తనకు బాబు పుట్టిన తర్వాత వేధింపులు ఎక్కువై చాలాసార్లు ఇంటినుంచి గెంటేశారని ఏడుస్తూ చెప్పింది.

అటు ఈ మద్య విశాఖలో తాను నివసిస్తున్న ఇంటికి వచ్చిన రామకృష్ణ తన కుమారుడు గౌతమ్ (4) బలవంతంగా తీసుకుపోయారని ఆరోపిస్తూ పోలిసులకు ఫిర్యాదు చేసింది. భర్తపై, అదీ స్పీకర్ కొడుకుపై కావటంతో ముందుగా సర్ధిచెప్పిన పోలిసులు., ఆ తర్వాత చేసేది లేక కిడ్నాప్ కేసు పెట్టారు. తన పిల్లాడిని వెనక్కి తీసుకువచ్చేలా పోలిసులు సహకరించాలని బాధితురాలు కోరుతోంది. పద్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలిసులు ధర్యాప్తు ప్రారంభించారు. పిల్లాడిని ఎందుకు, ఎక్కడకు తీసుకెళ్లాడనే విషయంపై వారు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

అంతేకాకుండా గతంలో మామూలుగా ఉన్న వేధింపులు కోడెల స్పీకర్ అయిన తర్వాత మరింత పెరిగాయని చెప్పింది. అయితే తనపై వేధింపుల్లో మామ శివప్రసాద్ పాత్ర ఉన్నట్లు పద్మప్రియ ఎక్కడా చెప్పలేదు. ఇది ఆయనకు రాజకీయ పరంగా కాస్త ఊరట కల్గించే అంశం. కాని చట్టసభలో ఎమ్మెల్యేలందరికి పెద్దగా.,, సభను నడిపించే స్థాయిలో ఉన్న స్పీకర్.., ఇంట్లో సమస్యను ఇలా బయటకు తెచ్చుకోవటం ఆయనకు కాస్త అవమానకరమే. స్పీకర్ ఇంట్లోనే గృహహింస వేధింపులు ఉంటే., ఇక సాధారణ ప్రజల ఇంట్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. రామకృష్ణ ఆయన కుటుంబ సభ్యులు ఇప్పటికైనా మనసు మార్చుకుని పద్మప్రియను ఆదరిస్తారా.., లేక పంతాలకు పోయి కోర్టు మెట్లు ఎక్కుతారా అనేది త్వరలో తేలనుంది.


కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kodela siva prasad  doemstic voilence  kidnap  latest news  

Other Articles