Modi takes blessings from his mother on 64th birthday

narendra modi, narendra modi birthday, narendra modi caste, prime minister of india, narendra modi india, narendra modi mother, narendra modi songs, narendra modi latest images, gujrat, latest news, hiraben, heeraben, narendra modi marriage, gandhinagar

prime minister narendra modi went to gandhinagar and taken his mother's blessings on his 64th birthday : hiraben blessed her son prime minister narendra modi and given special made sweets for him

దేశానికి రాజయినా.., తల్లికి కొడుకే అన్పించుకున్నాడు

Posted: 09/17/2014 11:03 AM IST
Modi takes blessings from his mother on 64th birthday

దేశానికి రాజు అయినా... తల్లికి కొడుకే అన్నట్లుగా., ప్రధాని అయినా మోడి ఎప్పటికి హీరాబెన్ కు కొడుకే. దేశాన్ని శాసిస్తున్న ప్రధాని.., పుట్టినరోజున తల్లి దగ్గరకు వెళ్లాడు. ఎన్ని ఆడంబరాలు.., అధికార లాంఛనాలు ఉన్నా ఇవన్నీ తల్లి ప్రేమ ముందు తక్కువే అని నిరూపించాడు. ప్రజలెంత ముఖ్యమో.. తల్లి ఆశీర్వాదం కూడా అంతే అవసరమని గుర్తించి సొంత ఇంటికి వెళ్ళిపోయాడు. అరవై నాల్గవ పుట్టినరోజున నరేంద్రుడు తల్లి ఆశీర్వాదం తీసుకున్నాడు. గుజరాత్ లోని గాంధీనగర్ లో ఉంటున్న తల్లి హీరాబెన్ దగ్గరకు వెళ్ళి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. ఉన్నత శిఖరంగా ఎదిగిన కొడుకును చూసిన ఆ తల్లి ఆప్యాయంగా నరేంద్రుడిని చూసి.. మనసారా దీవించింది.

కాసేపు కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత.., కొడుకు కోసం తయారుచేయించిన స్వీట్లు., పిండివంటలను ప్రేమగా వడ్డించింది. తల్లి ప్రేమ తియ్యదనం కలగలిసిన స్వీటును తిన్న మోడి.., సంతోషంతో ఉప్పొంగిపోయారు. తనకు ఇది చాలు అని మనస్సులో అనుకున్నారు. పుట్టిన రోజున తల్లి దగ్గర గడపాలి అనుకున్న ప్రధాని దేశ ప్రజలకు..., ముఖ్యంగా యువతకు ఆదర్శ ప్రాయంగా నిలుస్తున్నారు. తల్లితండ్రులను కేవలం డబ్బులు, అవసరాలు తీర్చే యంత్రాలుగా చూస్తున్న ఈ రోజుల్లో కూడా వారి విలువ, గుర్తింపు ఏమిటో మోడి యావత్ ప్రపంచానికి చాటి చెప్పారు.

ఇక పుట్టిన రోజున సాయంత్రం చైనా అధ్యక్షుడికి భారత ప్రధాని విందు ఇస్తున్నారు. బుధవారం భారత్ కు వస్తున్న చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ను అహ్మదాబాద్ లో మోడి కలుసుకుని.., పలు అంశాలపై చర్చించిన తర్వాత..  సాయంత్రం విందు ఇస్తున్నారు. తక్కవ వ్యక్తులు.., ఎక్కువ పని అని చెప్పే మోడి, ఇక్కడ విందుకు కూడా పరిమిత సంఖ్యలోనే ఆహ్వానాలు పంపారు. సబర్మతి నది తీరంలో జరిగే సాయంత్రపు విందులో రెండు వైపుల నుంచి చెరో ఐదుగురు చొప్పున మాత్రమే విందులో పాల్గొంటారు. గత ప్రభుత్వాల మాదిరిగా వందల మంది విందుకు హాజరై ప్రజల సొమ్మును తినకుండా ఇలా చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు అంటున్నారు. తమను పిలవలేదనే బాధ లేకపోగా.. ప్రజల డబ్బును జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నారనే సంతోషం తమకు ఉందని కేంద్రమంత్రులు అంటున్నారు.

కార్తిక్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : narendra modi  heeraben  birthday  latest news  

Other Articles