Center and ap govt signs mou on power

ap gcvernment, cetral government, Piyush goel, chandrababu, IYr krishna Rao, power, Mou

center and ap govt signs mou on power

ఏపీ వెలుగులకు కేంద్రం మెరుగులు

Posted: 09/16/2014 05:54 PM IST
Center and ap govt signs mou on power

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో వెలుగులు విరజిమ్మనున్నాయి. చికట్లు మాయం కానున్నాయి. రాష్ట్ర విభజనతో అన్యాయమైన రాష్ట్రంలో.. కొత్త వెలుగులు నింపేందుకు కేంద్రం నడుం బిగించింది. రాష్ట్రంలో

నిరంతరాయంగా విద్యుత్ సరఫరాపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. ఒప్పంద పత్రాలను కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు

mou-on-power-1

అందజేశారు. అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో నిరంతర విద్యుత్ అమల్లోకి రానుంది.

6,500 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. విశాఖలో 4 వేల మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్ ప్రాజెక్టు, రాయలసీమ జిల్లాల్లో 2,500

మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం ఒప్పందం కుదిరింది. అనంతపురం జిల్లా ఎన్‌పీ కుంట మండలంలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు, కర్నూలు జిల్లా పాణ్యంలో వెయ్యి మెగావాట్ల

mou-on-power-2

సౌర విద్యుత్ ప్రాజెక్టుకు, కడప జిల్లా గాలివీడులో 500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టుకు ఒప్పందం కుదిరింది. కేంద్ర, రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శులు ఈ ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap gcvernment  cetral government  Piyush goel  chandrababu  IYr krishna Rao  power  Mou  

Other Articles